• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చరణ్ గేమ్ ప్లాన్ ఎలా...

చరణ్ గేమ్ ప్లాన్ ఎలా ఉందంటే..

| గేమ్ ఛేంజర్ మూవీ నిరాశ పరచడం రామ్ చరణ్ కెరీర్ మీద గట్టి ప్రభావం చూపిందని అనిపిస్తోంది.

By - Tupaki Desk
Update: 2025-06-10 10:15 GMT

గేమ్ ఛేంజర్ మూవీ నిరాశ పరచడం రామ్ చరణ్ కెరీర్ మీద గట్టి ప్రభావం చూపిందని అనిపిస్తోంది. వాస్తవానికి శంకర్ దర్శకత్వం, భారీ బడ్జెట్, డబుల్ రోల్, స్టార్ క్యాస్ట్ వంటి హైప్ ఉన్నా, కంటెంట్ లో ఉన్న లోపాల వల్ల సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద డిజాస్టర్ అయింది. RRR తర్వాత మళ్లీ బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్ చరణ్‌కి ఇప్పుడు గేమ్ ఛేంజర్ ఫెయిల్యూర్ ఓ గట్టిపాఠం అయింది. అందుకే ఇక నుంచి ప్రాజెక్టుల ఎంపికలో మరింత జాగ్రత్త తీసుకుంటున్నాడు.

ప్రస్తుతం చరణ్ పాన్ ఇండియా రేంజ్‌లో చేస్తున్న ప్రాజెక్ట్ పెద్ది మీద భారీ అంచనాలు ఉన్నాయి. బుచిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రీ లుక్, గ్లింప్స్‌ లతోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. చరణ్ రగ్డ్ లుక్, మాస్ డైలాగ్ డెలివరీ, సంగీతానికి రెహమాన్ మ్యాజిక్ వంటి అన్ని అంశాలు సినిమాపై అటెన్షన్ పెంచాయి. బుచిబాబు కూడా ఈ సినిమాతో తనను దర్శకుడిగా మరో లెవెల్‌కు తీసుకెళ్లాలన్న ఆత్మవిశ్వాసంతో పని చేస్తున్నాడు.

వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 27న, చరణ్ పుట్టినరోజున విడుదల చేయనున్నారు. ఇంతకే కాదు, చరణ్ తదుపరి ప్రాజెక్టు మళ్లీ రంగస్థలం దర్శకుడు సుకుమార్‌తో కన్ఫర్మ్ అయింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో ఇది మరో రస్టిక్ ఎంటర్టైనర్‌గా రూపొందనుంది. రంగస్థలం తరహాలోనే ఎమోషన్, నేటివిటీ, మాస్ కమర్షియల్ అంశాలతో కూడిన కథ కోసం ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ప్రారంభమైందని సమాచారం.

2025 చివరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సుకుమార్‌తో చరణ్ కలిసి మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక మూడో ప్రాజెక్ట్ విషయంలో రామ్ చరణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్. ఇప్పటివరకు వీరిద్దరి కాంబోలో సినిమా రాలేదు. అయితే తాజాగా త్రివిక్రమ్ ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్ ఐడియా చెప్తే చరణ్ వెంటనే ఓకే చేశాడట.

దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. త్రివిక్రమ్ ప్రస్తుతం నితిన్ సినిమా పూర్తిచేయగానే చరణ్ సినిమా పనులు ప్రారంభమయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ మూడు సినిమాలు - పెద్ది, సుకుమార్ ప్రాజెక్ట్, త్రివిక్రమ్ సినిమా  చరణ్‌కి తిరిగి మాస్ మార్కెట్‌లో నిలదొక్కుకునే అవకాశాలుగా కనిపిస్తున్నాయి. వరుస హిట్లతో హ్యాట్రిక్ అందుకోవాలన్న లక్ష్యంతో ఆయన ఈ లైనప్‌ను సిద్ధం చేసుకున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. గేమ్ ఛేంజర్ దెబ్బ తర్వాత, ఈ మూడు సినిమాలు చరణ్‌కు తిరిగి బాక్సాఫీస్ పరంగా గేమ్ ఛేంజ్ చేసే అవకాశముందంటూ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

Tags:    
  • RamCharan 
  • GameChanger 
  • Peddi 
  • Sukumar 
  • Trivikram 
  • Tollywood 
  • PanIndia 
  • MegaPowerstar 
  • RRRAftermath 
  • TeluguCinema 
  • UpcomingMovies 
  • MassEntertainer 
  • RamCharanFans 
  • RamcharanLineups 
  • Filmindustry 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS