తోట‌లోకి షిఫ్ట్: బాబాయ్ బాట‌లో అబ్బాయ్ చ‌ర‌ణ్ ఫామ్‌హౌస్ ప్ర‌వేశం!

కేవలం మెగా హీరోలే కాకుండా టాలీవుడ్‌కు చెందిన పలువురు టాప్ స్టార్లు కూడా హైదరాబాద్ ఔటర్ పరిసరాల్లో భారీ ఫామ్‌హౌస్‌లను నిర్మించుకున్నారు.

Update: 2026-07-14 16:40 GMT

టాలీవుడ్‌లో ప్రకృతి జీవనానికి, వ్యవసాయానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బాటలోనే ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అడుగులు వేస్తున్నారు. హైదరాబాద్ శివార్లలోని తన ఫామ్‌హౌస్‌లో పవన్ కల్యాణ్ ఎప్పటి నుంచో సేంద్రీయ వ్యవసాయం చేస్తూ, నగర కాలుష్యానికి దూరంగా ప్రశాంత జీవనాన్ని గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బాబాయ్ పద్ధతినే అనుసరిస్తూ రామ్ చరణ్ సైతం ప్రకృతి ఒడిలోకి షిఫ్ట్ అవుతుండటం మెగా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

పవన్ కల్యాణ్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని తన ఫామ్‌హౌస్‌లో మామిడి తోటలు పెంచ‌డానికి.. స్వయంగా పార, పలుగు పట్టి శ్రమించిన విజువల్స్ గతంలో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. బాబాయ్ స్ఫూర్తితో రామ్ చరణ్ కూడా హైదరాబాద్ శివార్లలో దాదాపు ఐదెకరాల విస్తీర్ణంలో ఒక అద్భుతమైన ఫామ్‌హౌస్‌ను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. నగర హడావిడికి దూరంగా ఇక్కడ ప్యూర్ ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని చరణ్ ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్స్ నుండి బ్రేక్ దొరికినప్పుడు, వీకెండ్స్‌లో కుటుంబ సభ్యులు, ఆప్తమిత్రులతో కలిసి ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి ఈ స్థలాన్ని ఎంచుకున్నారు.

ఈ మెగా ఫామ్‌హౌస్ ఎక్కడ ఉందనే విషయానికి వస్తే.. హైదరాబాద్ చేవెళ్ల-మొకిల పరిసర ప్రాంతాల్లో దీనిని నిర్మించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాంతం ఫామ్‌హౌస్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. త్వరలోనే రామ్ చరణ్-ఉపాసన దంపతులు ఇక్కడ నిర్మించిన సరికొత్త నివాసంలోకి అధికారికంగా గృహప్రవేశం చేయబోతున్నారు. ఒక లగ్జరీ రిసార్ట్‌ను తలపించేలా అల్ట్రా మోడ్రన్ అండ్ నేచురల్ లుక్‌తో డిజైన్ చేసిన ఈ ఇంటి బాధ్యతలను ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్లు `ఆమీర్ - హమీదా` విజయవంతంగా పూర్తి చేశారు.

కేవలం మెగా హీరోలే కాకుండా టాలీవుడ్‌కు చెందిన పలువురు టాప్ స్టార్లు కూడా హైదరాబాద్ ఔటర్ పరిసరాల్లో భారీ ఫామ్‌హౌస్‌లను నిర్మించుకున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గోపాల్‌పల్లి సమీపంలో దాదాపు ఆరున్నర ఎకరాల విస్తీర్ణంలో `బృందావనం` పేరుతో ఒక అందమైన ఆర్గానిక్ ఫామ్‌హౌస్‌ను నిర్మించి, అక్కడ వ్యవసాయం చేస్తున్నారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుకు కూడా గండిపేట పరిసరాల్లో విలాసవంతమైన ఫామ్‌హౌస్ ఉంది. మెగాస్టార్ చిరంజీవికి దేవరయాంజల్‌లో 15 ఎక‌రాల‌లో ఫామ్ హౌస్.. అక్కినేని నాగార్జునకు పాపిరెడ్డిగూడెంలో 25 ఎకరాల విస్తీర్ణంలో తోటలు, వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి. ప్ర‌భాస్ కి హైద‌రాబాద్ న‌గ‌రానికి స‌మీపంలోని ఫామ్ హౌస్ తో పాటు, భీమ‌వ‌రంలోను భారీగా తోట‌లు- ఫామ్ హౌస్ లు ఉన్న సంగ‌తి తెలిసిందే.

గ్లామర్ ప్రపంచంలో నిరంతరం బిజీగా ఉండే సెలబ్రిటీలు మానసిక ప్రశాంతత కోసం... ఆరోగ్యకరమైన ఆహారం కోసం ఇలా తోటల్లోకి షిఫ్ట్ అవ్వడం మంచి పరిణామం. నగర జీవితంలోని ఒత్తిడిని అధిగమించడానికి, విష ర‌సాయ‌న‌మ‌యంగా మారిన పండ్లు, కూర‌గాయ‌లకు దూరంగా ఉండ‌టానికి ఆర్గానిక్ ఫార్మింగ్ ఒక బెస్ట్ థెరపీగా ఉపయోగపడుతోంది. బాబాయ్ పవన్ కల్యాణ్ లాగే రామ్ చరణ్ కూడా ఈ ఐదెకరాల ఫామ్‌హౌస్‌లో పండించబోయే ఆర్గానిక్ పంటలు, అక్కడ గడపబోయే ప్రశాంత క్షణాలు ఆయన తదుపరి చిత్రాల షూటింగ్స్‌కు సరికొత్త ఎనర్జీని ఇస్తాయనడంలో సందేహం లేదు.

Tags:    

Similar News