షూటింగ్‌లో ప్రమాదాలకు గురైన నటులు!
మాస్ మహారాజా రవితేజ సైతం ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొంటుండగా భారీ ప్రమాదం జరిగి తీవ్రంగా గాయపడ్డారు.
వెండితెరపై మన హీరోలు చేసే ఫైట్లు, రిస్కీ స్టంట్లు చూసి థియేటర్లలో ఈలలు, గోలలు వేస్తాం. కానీ, ఆ రెండు నిమిషాల సీన్ వెనుక వారు ప్రాణాలను పణంగా పెట్టి చేసే కష్టం దాగుంటుంది. డూప్ లేకుండా రియలిస్టిక్‌గా చేయాలనే తపనతో టాలీవుడ్‌లో ఎందరో నటులు షూటింగ్స్ సమయంలో ఘోర ప్రమాదాలకు గురై గాయపడ్డారు. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సైతం గాయపడి వార్తల్లో నిలిచారు. మనల్ని అలరించడం కోసం హీరోలు పడే ఆ తపన, కష్టం వెలకట్టలేనివి.
కంటికి గాయమైనా తగ్గని రామ్ చరణ్:
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన లేటెస్ట్ సినిమా ‘పెద్ది’ షూటింగ్‌లో ఫుల్ వున్నప్పుడు, యాక్షన్ సీన్స్ చేస్తున్న సమయంలో చరణ్ కంటికి తీవ్ర గాయమైంది. అయినా సరే ఆయన షూటింగ్ ఆపకుండా అలాగే కంటిన్యూ చేశారు. అంతేకాదు, ఇదే సినిమా సెట్స్‌లో ఆయన చేతికి కూడా గాయమై కట్టు కట్టుకుని మరీ యాక్షన్ ఎపిసోడ్స్ పూర్తి చేశారు. ఫ్యాన్స్‌కు బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వాలనే చరణ్ డెడికేషన్‌కు అందరూ సల్యూట్ చేస్తున్నారు.
బైక్ స్టంట్‌లో శర్వానంద్, నితిన్‌కు గాయాలు:
యంగ్ హీరో శర్వానంద్ ‘96’ రీమేక్ సినిమా షూటింగ్ కోసం బ్యాంకాక్‌లో బైక్ స్టంట్ చేస్తుండగా బైక్ అదుపుతప్పి కింద పడిపోయారు. ఇక ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే మరో యంగ్ హీరో నితిన్ కూడా తన తాజా చిత్రం 'తమ్ముడు' షూటింగ్‌లో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు గాయాలపాలయ్యారు.
నాని, సుహాస్‌లకు తప్పని ప్రమాదాలు:
నేచురల్ స్టార్ నాని కూడా తన మోస్ట్ అవేటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ 'HIT3' మూవీ షూటింగ్‌లో యాక్షన్ సీన్ చేస్తుండగా తీవ్రంగా గాయపడ్డారు. ఇక మరో టాలెంటెడ్ హీరో సుహాస్ అయితే 'మందాడి' సినిమా షూటింగ్ సమయంలో సముద్రంలో పడవ బోల్తా పడటంతో తృటిలో ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
రవితేజ, రాజశేఖర్, నాజర్ సైతం:
మాస్ మహారాజా రవితేజ సైతం ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొంటుండగా భారీ ప్రమాదం జరిగి తీవ్రంగా గాయపడ్డారు. సీనియర్ హీరో రాజశేఖర్ కూడా గతంలో ఒక యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. అలాగే వెలటైల్ యాక్టర్ నాజర్ హైదరాబాద్‌లో ఓ సినిమా చిత్రీకరణలో రిస్కీ షాట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు గాయపడి హాస్పిటల్ పాలయ్యారు.
సినిమా అంటే కేవలం రంగుల ప్రపంచం మాత్రమే కాదు.. దాని వెనుక రక్తం, చెమటా కూడా ఉంటాయి. సగటు అభిమానికి థియేటర్లలో పూనకాలు తెప్పించడం కోసం, తమను నమ్ముకున్న నిర్మాతలకు నష్టం రాకూడదనే ఉద్దేశంతో గాయాలైనా లెక్కచేయకుండా మన హీరోలు కష్టపడుతుంటారు. అందుకే వారు కేవలం రీల్ హీరోలు మాత్రమే కాదు.. రియల్ హీరోలు