ఆర్సీ 17లో చ‌ర‌ణ్ ద్విపాత్రాభిన‌యం!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ `ఆర్సీ 17` పై అంచ‌నాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు.

Update: 2026-08-13 12:30 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ 'ఆర్సీ 17' పై అంచ‌నాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు. 'పెద్ది'తో బౌన్స్ బ్యాక్ అయిన చ‌ర‌ణ్‌...`పుష్ప‌`తో సంచ‌ల‌నం సృష్టించిన కాంబినేష‌న్ కల‌వ‌డంతో? అంచ‌నాలు వేరే లెవ‌ల్లో ఉన్నాయి. ప్ర‌త్యేకించి 'రంగస్థలం' లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఈ క్రేజీ కూటమి మరోసారి రిపీట్ అవుతుండటంతో అంచనాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడంటూ ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో ఓ వార్త వైరల్ అవుతోంది.

సుకుమార్ కథాకథనాలు, పాత్రల చిత్రణ ఎంతటి వైవిధ్యంగా ఉంటాయో? ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన తెరకెక్కించే ప్రతి సినిమాలోనూ హీరో పాత్రలకు బలమైన ఎమోషన్స్, ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ ఉంటాయి. `ఆర్సీ 17` కోసం రామ్ చరణ్ పూర్తిగా భిన్నమైన రెండు కోణాలతో కూడిన పాత్రల్లో కనిపిస్తారని.. అందులో ఒకటి అత్యంత పవర్‌ఫుల్ రోల్ అని...మ‌రోక‌టి సాప్ట్ రోల్ గా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ వార్తలపై చిత్ర యూనిట్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సినిమా ప్రారంభ దశలో ఉన్నప్పుడే ఇలాంటి లీక్స్ బయటకు రావడం సహజమే అయినా? మేకర్స్ నుండి క్లారిటీ వస్తేనే అసలు నిజం ఏంటో స్పష్టమవుతుంది. కేవలం ప్రచారాలకే పరిమితం కాకుండా? సినిమాలో నిజంగానే డ్యూయెల్ రోల్ ఉంటే మాత్రం స్క్రీన్ మీద అభిమానులకు కన్నుల పండుగగా ఉండటం ఖాయం.

రామ్ చరణ్ కెరీర్‌లో ఇప్పటికే `నాయక్` చిత్రంలో ద్విపాత్రాభినయం చేసి మెప్పించారు. ఆ తర్వాత మళ్లీ సుకుమార్ దర్శకత్వంలో ద్విపాత్రాభినయం చేస్తున్నారనే టాక్ తో అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. సుకుమార్ మార్క్ మేకింగ్, ద్విపాత్రాభినయం సృష్టించే మ్యాజిక్ తోడైతే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు బద్దలవడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.

భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక విలువలతో సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులతో పాటు నటీనటుల ఎంపిక వేగంగా సాగుతోంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మేకర్స్ రాబోయే రోజుల్లో ఒకదాని తర్వాత ఒకటిగా అధికారిక అప్‌డేట్స్ ఇచ్చే అవకాశం ఉంది. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ గాయం కార‌ణంగా విశ్రాంతి తీసుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఓయంబ‌త్తూర్ లోని ఓ ప్ర‌ముఖ ఆసుప‌త్రిలో మ‌ణిక‌ట్టుకు శ‌స్త్ర చికిత్స జ‌రిగింది.

Tags:    

Similar News