• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రెండేళ్ల తర్వాత రకుల్...

రెండేళ్ల తర్వాత రకుల్ ప్రీత్ సింగ్...!

| తమిళ్ లో రూపొందబోతున్న ఆ సినిమాను తెలుగు మరియు ఇతర సౌత్ ఇండియన్‌ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు

By - Tupaki Desk
Update: 2023-09-25 03:15 GMT

కెరటం సినిమా తో తెలుగు సినిమా పరిశ్రమలో 2011లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్. తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో స్టార్‌ హీరోలతో, సూపర్‌ స్టార్‌ హీరోలతో నటించే అవకాశంను దక్కించుకుంది. హీరోయిన్ గా ఒకానొక సమయంలో మహేష్ బాబు సినిమాకి కూడా డేట్లు ఇవ్వలేనంత బిజీగా మారింది.

అలాంటి పరిస్థితి నుంచి కొన్నేళ్లలోనే చేతిలో ఒక్క సినిమా లేని పరిస్థితికి దిగజారింది. ఆమె చేసిన సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నా కూడా అన్నీ రొటీన్ పాత్రలు.. రొటీన్ కమర్షియల్‌ సినిమాలే అవ్వడంతో రకుల్ ప్రీత్‌ సింగ్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రేజ్ తగ్గింది. రెండేళ్లుగా తెలుగు లో ఈమెకు సినిమా ఆఫర్లే లేవు.

తెలుగు లో కాకుండా కోలీవుడ్‌ లో కూడా అదే పరిస్థితి. ఈఅమ్మడు ఆ సమయంలోనే బాలీవుడ్‌ కి వెళ్లి అక్కడ చేసిన ప్రయత్నాలు ప్రయోజనం చేకూర్చాయి. అక్కడ వరుసగా సినిమాల్లో నటించే అవకాశాలు దక్కాయి. కానీ చేసిన ప్రతి ఒక్క సినిమా కూడా హిందీ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. రెండేళ్లు హిందీలో చాలా బిజీగా ఉన్న ఈ అమ్మడు ఈ మధ్య సైలెంట్ అయింది.

హిందీలో కూడా ఆఫర్లు లేకపోవడంతో ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరు అవుతూ, సోషల్‌ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ ను షేర్‌ చేస్తున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్ కి ఎట్టకేలకు ఓ తమిళ్‌ చిత్రంలో నటించే అవకాశం దక్కినట్లుగా సమాచారం అందుతోంది. శివ కార్తికేయన్ హీరోగా రూపొందుతున్న సినిమాలో ఈ అమ్మడు ఎంపిక అయిందట.

తమిళ్ లో రూపొందబోతున్న ఆ సినిమాను తెలుగు మరియు ఇతర సౌత్ ఇండియన్‌ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు. శివ కార్తికేయన్ తో చేయబోతున్న సినిమా హిట్ అయితే రకుల్ కి మళ్లీ తెలుగు లో కూడా ఛాన్స్ లు దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. మరి రకుల్‌ మళ్లీ బిజీ అయ్యేనా చూడాలి.

Tags:    
  • Rakulpreetsingh 
  • Actressrakul 
  • Bollywood 
  • Filmindustry 
  • Shivakarthikeyan 
  • Rakul 
  • Socialmedia 

Similar News

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS