• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పిక్‌ టాక్‌ : రకుల్‌...

పిక్‌ టాక్‌ : రకుల్‌ దీపావళి స్పెషల్‌ ట్రీట్‌

| రకుల్‌ అందం విషయంలో ఏమాత్రం తగ్గలేదు కానీ టాలీవుడ్‌లో ఆమెకు ఆఫర్లు పూర్తిగా డ్రాప్‌ అవ్వడం విచారకరం.

By - Tupaki Desk
Update: 2024-11-07 13:30 GMT

టాలీవుడ్‌లో యంగ్‌ స్టార్‌ హీరోల్లో దాదాపు అందరితో నటించిన ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. తక్కువ సమయంలో ఎక్కువ మంది స్టార్‌ హీరోలతో సినిమాలు చేసిన ఘనత కచ్చితంగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కి దక్కుతుంది అనడంలో సందేహం లేదు. కెరీర్ ఆరంభంలో ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేసిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఆ తర్వాత సూపర్‌ స్టార్‌ సినిమాలోనూ నటించేనంత బిజీగా సినిమాల్లో నటించింది. రకుల్‌ ప్రీత్‌ సింగ్ టాలీవుడ్‌లో చాలా తక్కువ సమయంలోనే ఫేడ్‌ ఔట్ అయింది. రకుల్‌ అందం విషయంలో ఏమాత్రం తగ్గలేదు కానీ టాలీవుడ్‌లో ఆమెకు ఆఫర్లు పూర్తిగా డ్రాప్‌ అవ్వడం విచారకరం.

తెలుగు సినిమాల్లో ఆఫర్లు తగ్గుతున్న సమయంలోనూ కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో ప్రయత్నాలు చేసింది. కోలీవుడ్‌ ప్రేక్షకులు, ఫిల్మ్‌ మేకర్స్ ఈమెను పట్టించుకోలేదు. కానీ హిందీ ఫిల్మ్‌ మేకర్స్ మాత్రం ఈమెకు వరుసగా ఆఫర్లు వచ్చారు. ఆశ్చర్యకరంగా రెండేళ్లలో దాదాపు డజను సినిమాల్లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించింది. బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్ ఆఫర్లు ఇచ్చారు కానీ ప్రేక్షకులు మాత్రం ఈమెను పట్టించుకోలేదు. దాంతో తక్కువ సమయంలోనే హీరోయిన్‌గా అక్కడ కూడా ఆఫర్లు తగ్గి పోయాయి. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సినిమాల్లో నటించడమే చాలా అరుదైన విషయంగా ప్రస్తుతం పరిస్థితులు ఉన్నాయి.

సినిమాల్లో కనిపించినా కనిపించకున్నా సోషల్‌ మీడియాలో మాత్రం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కి మంచి ఆధరణ ఉంది. అలాగే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ షేర్ చేసే ఫోటోలకు మంచి స్పందన ఉంటుంది. బాలీవుడ్‌ హీరోయిన్స్ ఫోటోలు సైతం రకుల్‌ అందమైన ఫోటోల ముందు దిగదుడుపు అన్నంత అందంగా రకుల్‌ ప్రీత్‌ సింగ్ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపుగా 24 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తాజాగా దీపావళి స్పెషల్‌ అన్నట్లుగా షేర్‌ చేసిన ఈ ఫోటోలకు మంచి స్పందన దక్కింది. దీపావళి దీపం వెలిగినట్లుగా చాలా అందంగా ఉన్నారు అంటూ రకుల్‌ కి ప్రశంసలు దక్కుతున్నాయి.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈ ఫోటోల్లో కలర్ ఫుల్‌గా కనిపించడంతో పాటు, నెటిజన్స్ కళ్లు పెద్దవి చేసుకుని చూసే విధంగా క్లీ వేజ్ షో చేసింది. ఈ స్థాయిలో అందంగా కనిపించడం రకుల్‌ కి కొత్తేం కాదు. అయినా ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో సమ్‌థింగ్‌ స్పెషల్‌ అన్నట్లుగా నిలిచాయి అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ ఫోటోలు చూసి అయినా ఫిల్మ్‌ మేకర్స్ రకుల్‌ కి సినిమాల్లో ఆఫర్లు ఇవ్వాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు. కానీ ప్రస్తుతం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కి సినిమాల్లో తిరిగి బిజీ అయ్యే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ముందు ముందు అయినా రకుల్‌ మళ్లీ సినిమాలు, సిరీస్లు అంటూ నటనతో బిజీ అవ్వాలని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు.

Tags:    
  • Rakulpreetsingh 
  • Rakulpreet 
  • Rakul 
  • Phototalk 
  • Socialmedia 
  • Bollywood 
  • Actressrakul 

Similar News

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS