#GlobeTrotterEvent - కృష్ణ గారి గొప్పతనం అప్పుడు తెలిసింది: ఎస్.ఎస్.రాజమౌళి
``నా చిన్నప్పుడు కృష్ణగారి గొప్పతనం ఏంటో నాకు తెలీదు. ఎన్టీఆర్ అభిమానిగా ఆయన సినిమాలు చూసేవాడిని.;
``నా చిన్నప్పుడు కృష్ణగారి గొప్పతనం ఏంటో నాకు తెలీదు. ఎన్టీఆర్ అభిమానిగా ఆయన సినిమాలు చూసేవాడిని. కానీ ఇండస్ట్రీకి వచ్చాక తెలిసింది. పరిశ్రమకు ఎంతో గొప్ప సాంకేతికతను తెచ్చిన గ్రేట్ హీరో కృష్ణగారు`` అని అన్నారు ఎస్.ఎస్.రాజమౌళి. మహేష్ కథానాయకుడిగా నటించిన `ఎస్.ఎస్.ఎం.బి 29` టైటిల్ లాంచ్ వేడుకలో రాజమౌళి మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.
రాజమౌళి మాట్లాడుతూ.. ``టాలీవుడ్ కి కృష్ణగారు చాలా అద్భుతమైన సాంకేతికతను పరిచయం చేసారు. మొదటి స్కోప్ సినిమా - అల్లూరి సీతారామరాజు చేసింది ఆయన. ఫస్ట్ ఈస్ట్ మన్ కలర్ సినిమా చేసింది ఆయనే. ఫస్ట్ 70ఎంఎం స్కోప్ సినిమా - సింహాసనం చేసినది కృష్ణ గారు. ఎన్నోసార్లు మారుతున్న సాంకేతికతను పరిచయం చేసిన గొప్ప హీరో కృష్ణ గారి వారసుడైన మహేష్ తో సినిమా చేస్తున్నాను. ఇప్పుడు లార్జ్ స్కేల్ లో చేస్తున్న ఈ సినిమాని ఫుల్ స్క్రీన్ ఐమ్యాక్స్ లో చేస్తున్నానని గర్వంగా చెప్పగలను అని అన్నారు.
నన్ను మహేష్ ని కలిపినందుకు నిర్మాత కేఎల్ నారాయణకు ధన్యవాదాలు. ప్రతి సినిమాకి ముందు ప్రెస్ మీట్ పెట్టి కథ చెప్పడం అలవాటు. బాహుబలి సమయంలో అలా చెప్పగలిగాను. అన్నిటికీ అలా కుదరదు. కొన్నిటికి కథ చెప్పడం కుదురుతుంది కొన్నిటికి కుదరదు. గ్లోబ్ ట్రాటర్ కు స్కేల్ కాన్వాస్ దృష్ట్యా కథను మాటల్లో చెప్పడం కుదరదు. ఆడియెన్ అంచనాలకు అనుగుణంగా ప్రతిదీ సెట్ చేయాలి. కథ ముందే చెప్పకుండా ఆడియెన్ లో అంచనా రావాలి. కథేంటో, స్కేల్ ఏంటో చాలా ముందే మేం ఒక వీడియో చేసి రిలీజ్ చేయాలనుకున్నాం. మార్చిలో మొదట చేయాలని అనుకున్నాము.. జూన్ వచ్చింది... జూలై వచ్చింది . వీడియో రాలేదు.. వర్షాలు వచ్చాయి. .జూలై, ఆగస్టు, సెప్టెంబర్ కంటిన్యూగా వర్షాలొస్తూనే ఉన్నాయి. మొత్తానికి నవంబర్ నాటికి వీడియోతో మీ ముందుకు వచ్చాం. ఈ వీడియో చెబుతుంది సినిమా స్కేల్, స్కోప్ ఏంటో`` అని అన్నారు. అయితే టైటిల్ చెప్పకుండా `దిస్ ఫిలిం` అనడం కష్టంగా ఉంది... అని కూడా రాజమౌళి అన్నారు.
ప్రీమియం లార్జ్ స్కేల్ ఉన్న ఐమ్యాక్స్ కోసం ఈ సినిమాని చిత్రీకరించాం.. అయితే ఐమ్యాక్స్ సినిమాలు చాలా వచ్చాయి కదా? అనుకుంటాం. కానీ చాలా సినిమాలను సినిమా స్కోప్ లో తీస్తారు.. కొన్నిటిని మ్యాక్సిమైజ్ చేసి రిలీజ్ చేస్తారు. కానీ ఇది అలాంటిది కాదు. మేం ఈ సినిమాను ఫుల్ ఐమ్యాక్స్ స్క్రీన్ కోసం సిద్ధం చేసామని తెలిపారు. అయితే టైటిల్ ట్రైలర్ లాంచ్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంత ఆలస్యమైంది.