సూపర్ స్టార్ ను ఏడిపించిన బుక్
సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయన స్క్రీన్ పై కనిపిస్తే చాలు చూద్దామనుకునే అభిమానులు ఎంతో మంది ఉన్నారు.;
సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయన స్క్రీన్ పై కనిపిస్తే చాలు చూద్దామనుకునే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. తన స్టైల్, స్వాగ్ తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను అందుకున్న రజనీకాంత్ ఏం చేసినా స్పెషల్ గానే ఉంటుంది. స్క్రీన్ పై ఆయన తన స్టైల్ లో అలా నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ చూస్తే ఆయన క్రేజ్ ఏంటనేది అర్థమవుతుంది.
ఏడు పదుల వయసులో కూడా రజినీకాంత్ వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఆడియన్స్ ను అలరిస్తూ వస్తున్నారు. జైలర్ సినిమా తర్వాత సూపర్ ఫామ్ లోకి వచ్చిన రజినీ ఇప్పుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. ఆగస్ట్ 14న కూలీ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాగా రజినీకాంత్ రీసెంట్ గా ఓ ఈవెంట్ కు హాజరయ్యారు. వెంకటేషన్ రాసిన గొప్ప నవల వేల్పారికి మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించగా దానికి రజినీకాంత్ చీఫ్ గెస్టుగా హాజరై అసలు ఇలాంటి కార్యక్రమానికి 75 ఏళ్ల ఏజ్ లో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని స్లో మోషన్ లో నడవడం తప్ప బుక్స్ గురించి పెద్దగా తెలియని తనను ఎందుకు పిలిచారా అని షాకయ్యానని అన్నారు. రీసెంట్ గా ఓ ఈవెంట్ లో తాను మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ అయిందని, అందుకే ఈసారి ఎంతో ఆచితూచి మాట్లాడతానని పేర్కొన్నారు. ఏం మాట్లాడాలనేది విజ్ఞానం నేర్పితే ఎలా చెప్పాలనేది టాలెంట్ చెప్తుందని, అది ఎంత చెప్పాలనేది స్టేజ్ డిసైడ్ చేస్తుందని, కానీ ఏం చెప్పకూడదనే విషయాన్ని మాత్రం మన అనుభవాలు నేర్పుతాయని రజినీ చెప్పారు.
అయినా ఇలాంటి ఈవెంట్లకు కమల్ హాసన్ లేదా శివ కుమార్ అయితే సరిగ్గా సరిపోతారని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. తనకు బుక్స్ చదవాలనే ఇంట్రెస్ట్ రామకృష్ణ ఆశ్రమం వల్ల వచ్చిందని, ఇప్పటివరకు ఎన్నో గొప్ప పుస్తకాలను చదివానని చెప్పిన ఆయన కొందరు రచయితల్ని గుర్తు చేసుకున్నారు. జయకంధన్ రచనలు తననెంతో ప్రభావింత చేశాయని చెప్పిన సూపర్ స్టార్ ఆయన రాసిన ఓ పుస్తకం చదివి కన్నీళ్లు పెట్టుకున్నట్టు వెల్లడించారు.
తన స్నేహితుల సూచన మేరకు తాను వేల్పారి బుక్ చదవడం మొదలుపెట్టి పావు వంతు పూర్తి చేశానని, మిగిలిన పుస్తకం సినిమా నుంచి రిటైర్ అయ్యాక పూర్తి చేయాలనుకుంటున్నట్టు తెలిపారు. అయితే వేల్పారి బుక్ ఆధారంగా తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఓ సినిమా తీయనున్న విషయాన్ని ఇప్పటికే పలుమార్లు చెప్పగా, ఈ బుక్ ఆధారంగా శంకర్ తీయబోచే ఆ సినిమా కోసం తానెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు రజినీ తెలిపారు.