'ద‌ళ‌ప‌తి'కి సిస‌లైన‌ నివాళి ఈ 'కూలీ'

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌లో లోకేష్ క‌న‌గ‌రాజ్ తెర‌కెక్కించిన `కూలీ` 2025 ఆగ‌స్టులో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.;

Update: 2025-05-06 16:40 GMT

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌లో లోకేష్ క‌న‌గ‌రాజ్ తెర‌కెక్కించిన `కూలీ` 2025 ఆగ‌స్టులో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. 100 రోజుల కౌంట్ డౌన్ ప్రారంభ‌మైందని గుర్తు చేస్తూ, తాజాగా నిర్మాత‌లు రిలీజ్ చేసిన టీజ‌ర్ వెబ్ లో వైర‌ల్ గా దూసుకెళుతోంది. ఈ ప్రీటీజ‌ర్ లో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ స‌హా నాగార్జున‌, ఉపేంద్ర‌, స‌త్య‌రాజ్ ల‌ను ప‌రిచ‌యం చేసాడు. అయితే ర‌జ‌నీ మిన‌హా ఇత‌ర హీరోలు ఫేస్ టు ఫేస్ క‌నిపించ‌రు. కేవ‌లం బ్యాక్ ఫీట్ లో ఫోజులివ్వ‌గా అభిమానులు వాళ్లు ఎవ‌రో ఊహించ‌గ‌లిగారు.

ఈ సింపుల్ ప్రీటీజ‌ర్ చూస్తుంటే, లోకేష్ ర‌జ‌నీకాంత్ క్లాసిక్ `ద‌ళ‌ప‌తి`కి నివాళిగా దీనిని రిలీజ్ చేసాడ‌ని అభిమానులు భావిస్తున్నారు. ముఖ్యంగా టీజ‌ర్ లో ర‌జ‌నీకాంత్ ఫేసియ‌ల్ ఎక్స్ ప్రెష‌న్, బాడీ లాంగ్వేజ్ ప్ర‌తిదీ ద‌ళ‌ప‌తిని గుర్తు చేసాయి. మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన 1991 బ్లాక్ బ‌స్ట‌ర్ ద‌ళ‌ప‌తిలో కూడా ర‌జ‌నీ ఒక అనాథ‌గా, ఒక నాయ‌కుడికి న‌మ్మిన‌బంటుగా క‌నిపిస్తాడు. ఆస‌క్తిక‌రంగా ఇప్పుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ చిత్రంలోను అత‌డు ఒక కూలీ.

కానీ కూలీని లోకేష్ త‌న‌దైన శైలిలో ఎలివేట్ చేయ‌బోతున్నాడు. బంగారం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో స్క్రీన్ ప్లే ప్రాధాన్య‌త‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ర‌జ‌నీ పాత్ర చాలా వైల్డ్ గా ఉంటుంద‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇందులో నాగార్జున‌, ఉపేంద్ర‌, స‌త్య‌రాజ్ ఎలాంటి పాత్ర‌లు పోషించారో ఇంకా రివీల్ కావాల్సి ఉంది. ప్ర‌స్తుతానికి ఈ ప్రీటీజ‌ర్ ని ద‌ళ‌పతి చిత్రానికి నివాళిగా అభిమానులు భావిస్తున్నారు.

ఆగస్టులో సినిమా విడుదలకు 100 రోజుల కౌంట్‌డౌన్ మొద‌లైంది. ఈ క్ష‌ణం నుంచి ర‌జ‌నీ అభిమానుల‌ను టెన్ష‌న్ నిల‌వ‌నీయ‌దు. నాగార్జున, ఉపేంద్ర, దిలీప్ ఇందులో కేవ‌లం అతిధి పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కూడా అతిథిగా క‌నిపిస్తాడ‌ని టాక్ ఉంది. ఒక‌వేళ ఇది నిజమైతే అమీర్ ఖాన్ కి త‌మిళ ఆరంగేట్రం అవుతుంది. సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శ్రుతి హాసన్, రెబా మోనికా జాన్ , జూనియర్ ఎంజీఆర్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. పూజా హెగ్డే ఒక పాటలో అతిధిగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఎడిటింగ్ ఫిలోమిన్ రాజ్, సంగీతం అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు. `కూలీ` 14 ఆగస్టు 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Tags:    

Similar News