'కూలీ' క్రేజ్‌కి ఇదే ప్రత్యక్ష సాక్ష్యం
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం 'కూలీ' విడుదలకు రెడీగా ఉంది. ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కూలీ సినిమా అడ్వాన్స్ సేల్ మొదలైంది.;
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం 'కూలీ' విడుదలకు రెడీగా ఉంది. ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కూలీ సినిమా అడ్వాన్స్ సేల్ మొదలైంది. నార్త్ అమెరికాలో ఈ సినిమా బుకింగ్స్ భారీగా నమోదు అవుతున్నాయి. రజనీకాంత్ గత చిత్రాల ఫలితాలతో సంబంధం లేకుండా కూలీ తమిళ వర్షన్ అత్యధిక వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. లోకేష్ సినిమాటిక్ యూనివర్శ్ నుంచి వచ్చిన అన్ని సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. దాంతో ఆయన సినిమాటిక్ యూనివర్శ్‌ను ఇష్టపడే వారు ఎక్కువ మంది అయ్యారు. ముఖ్యంగా ఏ సెంటర్ ప్రేక్షకులు లోకేష్ సినిమాటిక్ వరల్డ్ సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు.
'కూలీ' ఓవర్సీస్ ప్రీ సేల్ రికార్డ్
ఆ జోనర్‌లోనే రాబోతున్న కూలీ సినిమాకు క్లాస్ ఏ ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అదే విషయం నార్త్ అమెరికాలో నమోదు అవుతున్న ప్రీ సేల్ ను చూస్తే అర్థం అవుతుంది. సినిమా విడుదలకు ఇంకా దాదాపు రెండు వారాల సమయం ఉంది. అప్పుడే మిలియన్ డాలర్ల వసూళ్లు నమోదు చేసింది. 5 మిలియన్ డాలర్ల వసూళ్ల టార్గెట్‌తో ఓవర్సీస్‌లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా విడుదలకు ముందే ప్రీ సేల్ ద్వారా కనీసం రెండున్న మిలియన్‌ల వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళ్, తెలుగు, హిందీ భాషల వర్షన్‌లు ఓవర్సీస్‌లో విడుదల కాబోతున్న నేపథ్యంలో అన్ని భాషల ప్రేక్షకులు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కనుక అక్కడ భారీ ఓపెనింగ్స్ నమోదు కాబోతున్నాయని రజనీకాంత్ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.
లోకేష్ కనగరాజ్ ఫ్యాన్స్ ఎదురు చూపులు
లోకేష్ కనగరాజ్ గత చిత్రాలతో పోల్చితే ఈ సినిమా మరో రేంజ్‌లో ఉంటుందని ప్రమోషన్ సమయంలో మేకర్స్ పదే పదే చెబుతూ వచ్చారు. కూలీ సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ ఇచ్చిన సంగీతం మరో హైలైట్‌గా నిలుస్తుంది. సాధారణంగానే లోకేష్ కనగరాజ్ సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది. ఈ సినిమాలో అనిరుధ్ ప్రాణం పెట్టి మ్యూజిక్ చేశాడు. కనుక అంతకు మించి ఉండటం పెద్ద విషయం ఏమీ కాదు. లోకేష్ కనగరాజ్ ఈ సినిమా కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. తన అభిమాన స్టార్‌ను డైరెక్ట్ చేసే అవకాశం రావడంతో లోకేష్ తన సత్తా చాటి ఉంటాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తెలుగులో కూలీ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ మొత్తానికి కొనుగోలు చేసిందని, డైరెక్ట్ తెలుగు సినిమా స్థాయిలో విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
వార్ 2 వర్సెస్ కూలీ బాక్సాఫీస్ వార్
కూలీ సినిమా జోరుగా బాక్సాఫీస్ వద్దకు దూసుకు వస్తున్న సమయంలో బాలీవుడ్ మూవీ వార్ 2 రజనీకాంత్ ఫ్యాన్స్‌కి ఆందోళన కలిగిస్తుంది. హృతిక్ రోషన్ హీరోగా ఎన్టీఆర్ ముఖ్య పాత్రలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన వార్ 2 సినిమా ఆగస్టు 14న విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. కూలీ విడుదల రోజే వార్ 2 రిలీజ్ ఉన్న కారణంగా ఖచ్చితంగా ఓపెనింగ్స్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. తెలుగులో ఎన్టీఆర్ ఉన్న కారణంగా వార్ 2 కి సాలిడ్ ఓపెనింగ్ రావడం అనేది పెద్ద కష్టం కాదు. ఇక తమిళనాట వార్ 2 ను ఖచ్చితంగా కూలీ డామినేట్ చేయడం ఖాయం. బాలీవుడ్‌లోనూ వార్ 2 డామినేషన్ కనిపించబోతుంది. మొదటి రోజు రెండు సినిమాలు హోరా హోరీగా వసూళ్ల విషయంలో తలపబడే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది చూడాలి.