• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ర‌జ‌నీ 'కూలీ' ఎంతో...

ర‌జ‌నీ 'కూలీ' ఎంతో ఊహించ‌గ‌ల‌రా?

| దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం దేశంలో ఖ‌రీదైన చిత్రాల‌లో ఒక‌టి.

By - Tupaki Desk
Update: 2025-05-08 14:30 GMT

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా లోకేష్ క‌న‌గ‌రాజ్ తెర‌కెక్కిస్తున్న 'కూలీ' ఆగ‌స్టు 14న స్వాతంత్య్ర దినోత్స‌వ కానుక‌గా విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. లోకేష్ మార్క్ విజువ‌లైజేష‌న్ తో ఈ మూవీ ఆద్యంతం యాక్ష‌న్ ప్రియుల‌ను ర‌క్తి క‌ట్టించ‌నుంది. ఈ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ కోసం కాస్ట్ అండ్ క్రూ అందుకుంటున్న పారితోషికాలు చ‌ర్చ‌గా మారాయి.

ర‌జ‌నీ ఇప్ప‌టికే 500 కోట్ల క్ల‌బ్ హీరో. దానికి త‌గ్గ‌ట్టే పారితోషికం అత్యంత భారీగా అందుకుంటున్నాడ‌ని క‌థ‌నాలొస్తున్నాయి. కూలీ చిత్రం కోసం ర‌జ‌నీకాంత్ 260-280 కోట్లు అందుకుంటున్నార‌ని, ఆసియాలోనే పారితోషికంలో నంబ‌ర్ వ‌న్ స్టార్ అని ప్ర‌చారం సాగుతోంది. అలాగే లోకేష్ క‌న‌గ‌రాజ్ ఈ చిత్రం కోసం అత్య‌ధికంగా 60 కోట్ల పారితోషికం అందుకుంటున్నారని స‌మాచారం.

దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం దేశంలో ఖ‌రీదైన చిత్రాల‌లో ఒక‌టి. ఇందులో మెజారిటీ భాగం హీరో- ద‌ర్శ‌కుడి పారితోషికం రూపంలోనే ఖ‌ర్చ‌వుతోంది. ఈ యాక్ష‌న్ డ్రామాలో నాగార్జున సైమన్ పాత్రలో నటించారు. దీనిలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న‌ తెలుగు సీనియర్ నటుడు నాగార్జున‌కు 35 కోట్ల పారితోషికం చెల్లిస్తున్నార‌ని తెలుస్తోంది.

ఈ చిత్రంలో శ్రుతి హాసన్, సత్యరాజ్, ఉపేంద్ర ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో కనిపిస్తారు. వారు తమ సాధారణ మార్కెట్ కి త‌గ్గ‌ట్టే పారితోషికాన్ని అందుకుంటున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూడా ఈ చిత్రంలో ప్రత్యేక అతిధి పాత్రలో కనిపిస్తారు. అత‌డికి రూ.25-30 కోట్లు పారితోషికం ఇస్తున్నట్లు గుస‌గుస వినిపిస్తోంది. ఇందులో ప్ర‌త్యేక గీతంలో న‌ర్తించిన పూజా హెగ్డే 2 కోట్లు వ‌సూలు చేస్తోంద‌ని స‌మాచారం. నిర్మాతలు ఇటీవల సినిమా ప్రీమియర్‌కు 100 రోజుల కౌంట్‌డౌన్ ప్రారంభ‌మైంద‌ని ప్ర‌క‌టించారు. టీజ‌ర్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అయింది. అనిరుధ్ ర‌విచంద‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Tags:    
  • Rajinikanth 
  • CoolieMovie 
  • LokeshKanagaraj 
  • CoolieRelease 
  • RajinikanthPaycheck 
  • ActionThriller 
  • Nagarjuna 
  • CoolieBudget 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS