బాబోయ్! రజనీకాంత్ వెరీ కాస్ట్లీ కూలీ
రజనీతోపాటు సినిమాలో అక్కినేని నాగార్జున, బాలీవుడ్ టాప్ హీరో ఆమిర్ ఖాన్, ఉపేంద్ర కూడా ఆయా పాత్రలు పోషించారు.;
కూలీతో ప్రేక్షకుల ముందుకు రానున్న రజనీకాంత్ కు అందరి ప్రశ్న ఒకటే. ఈ సినిమాకు ఆయన కూలీ ఎంత తీసుకున్నాడు? అనేది. సాధారణందా సూపర్ స్టార్ కు సౌత్ లో మంచి మార్కెట్ ఉంది. తమిళంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో రజనీ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయి. అందుకే ఆయన కూడా ఇవన్నీ దృష్టింలో ఉంచుకొనే రెమ్యూనరేషన్ తీసుకుంటారు.
అయితే ఈ సినిమా భారీ బడ్జెట్ రూ. 375 కోట్లతో తెరకెక్కింది. ఇందులో రజనీ కాంత్ రెమ్యూనరేషన్ గా ఈ సినిమాకు పనిచేసినందుకు రూ.150 కోట్లు తీసుకున్నారు. ఏ కూలీ అయినా రూ.200- 500 తీసుకుంటారు. కానీ కూలీ సినిమాకు పని చేసిన రజనీ పూర్తిగా ట్యాక్స్ పరిధిలోనే భారీ మొత్తం అందుకున్నారు.
రజనీతోపాటు సినిమాలో అక్కినేని నాగార్జున, బాలీవుడ్ టాప్ హీరో ఆమిర్ ఖాన్, ఉపేంద్ర కూడా ఆయా పాత్రలు పోషించారు. దీంతో ఎవరైనా రజనీ తర్వాత నాగార్జున లేదా ఆమిర్ ఖాన్ భారీ మొత్తంలో అందుకుంటారని అనుకుంటారు. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే! ఎందుకంటే రజనీ మినహా వీళ్లందరి కంటే ఎక్కువ అందుకున్నది డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్.
దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఈ సినిమా తెరకెక్కించినందుకుదానూ ఆయన కూలీ గా రూ. 50 కోట్లు తీసుకున్నాడు. ఈ లెక్కన రూ. 375 కోట్ల సినిమా ఓవరాల్ బడ్జెట్ లో కేవలం హీరో, దర్శకుడికే రూ. 200 కోట్లు అయిపోయాయి అన్నమాట. ఇక ఈ సినిమాతో తొలిసారి నెగిటివ్ రోల్ చేస్తున్న రూ. 24 కోట్ల నుంచి 30 కోట్ల మధ్యలో రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు సమాచారం.
కన్నడ హీరో ఉపేంద్ర ఎంతోకొంత అందుకున్నాడట. అయితే బీ టౌన్ సూపర్ స్టార్ ఆమిర్ మాత్రం.. రజనీకాంత్ పైన ప్రేమతోనే సినిమా ఒప్పుకున్నారట. ఇక సినిమా బడ్జెట్, రెమ్యూనరేషన్స్ కాకుండా ప్రమోషన్స్ కోసం మరో రూ.25 కోట్ల దాకా ఖర్చు చేశారని టాక్. ఇక ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
అయితే రిలీజ్ కు ఇంకో ఐదు రోజులే సమయం ఉండడంతో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లో సరికొత్త రికార్డులు అందుకుంటుంది. ఓవర్సీస్ లో ఇప్పటికే కూలీ ప్రీ బుకింగ్స్.. 1 మిలియన్ డాలర్ మార్క్ దాటేసిందట. భారత్ లో తీసుకుంటే రూ. 20 కోట్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చాయి. కేరళలో కొన్ని ఏరియాల్లో అయితే తొలి వీకెండ్ పూర్తిగా సోల్డ్ ఔట్ అయ్యాయంటే హైప్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా, ఓపెనింగ్ డే ఈ సినిమా రూ.150 కోట్లు వసూల్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.