'ఆత్మకథ' లో బిజీగా ఉన్న సూపర్ స్టార్!
సూపర్ స్టార్ రజనీకాంత్ జీవితం తెరచిన పుస్తకం లాంటింది. కాలం మాత్రమే తనని నటుడిని.. సూపర్ స్టార్ చేసిందని రజనీకాంత్ బలంగా నమ్ముతారు.;
సూపర్ స్టార్ రజనీకాంత్ జీవితం తెరచిన పుస్తకం లాంటింది. కాలం మాత్రమే తనని నటుడిని.. సూపర్ స్టార్ చేసిందని రజనీకాంత్ బలంగా నమ్ముతారు. కండెక్టర్ టూ సూపర్ స్టార్ రజనీ జీవితం అందరికీ తెలిసిందే. రజనీ కన్నడిగి అయినా తమిళనాడు తన సొంత రాష్ట్రంగా మారిపోయింది. తనని సూపర్ స్టార్ గా మార్చింది తమిళ ప్రేక్షుకులే. అక్కడ నుంచి ఆయనే పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అక్కడ నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. ఓ నటుడిగా ఇలా ఎదగడం అన్నది రజనీకి మాత్రమే సాధ్యమైంది.
ఆయన నట జీవితాన్ని పక్కన బెడితే? రజనీ వ్యక్తిగతం జీవితంలో ఎంతో ఎమోషన్ తోనూ ముడిపడి ఉంది. ఆయనలో ఆధ్యాత్మక చింతనకు కారణం ఒకప్పటి జీవితం. కండెక్టర్ గా ఉన్న సమయంలో ఆయన రోజు మద్యం సేవించేవారు. మాంసం తినేవారు. ఈ రెండు లేకుండా రజనీకి రోజు గడిచేది కాదు. ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలు రజనీ జీవితంలో ఉన్నాయి. తాజాగా రజనీకాంత్ తన ఆత్మకథను రాసే పనిలో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని దర్శకుడు లోకేష్ కనగరాజ్ రివీల్ చేసారు.
ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలు వ్యక్తిగతంగా రజనీకాంత్ తనతో పంచుకున్నట్లు లోకేష్ గుర్తు చేసుకున్నాడు. `కూలీ' సినిమా సెట్స్ లో ఖాళీగా ఉన్న సమయంలో ఆత్మ కథ రాసే పనిలోనే ఉండేవారు. రజనీకాంత్ జీవితం ఏదశలో ఎలా ఉండేది? అని తరుచూ అడిగే వాడిని. ఎన్నో విషయాలు పంచు కున్నారు. 42వ ఏట గురించి.. ఆ తర్వాత సంవత్సరాల్లో జరిగిన కొన్ని సంఘటనల గురించి చెప్పారు. ఈ విషయాలు ఇప్పటి వరకూ ఎవరికీ చెప్పలేదాయన. ఆ కథలు నన్నెంతగానో కదిలించాయి.
రజనీకాంత్ ప్రయాణం పోరాటాలు చాలా మందికి కనెక్ట్ అవుతాయి. ఆయన జీవితంలో ఎన్నో అవరో ధాలు..అడ్డంకులు దాటుకుని వచ్చారు. అవి ఏంటో? తెలిస్తే చాలా మందిలో స్పూర్తిని నింపుతాయి` అన్నారు. మరి రజనీ ఆత్మకథ పుస్తక రూపంలో ఎప్పుడు వెలువడుతుందో చూడాలి. అలాగే దీన్ని ఓ డాక్యుమెంటరీగానూ తీసే అవకాశం ఉంది.