రాజశేఖర్ గ్రీన్ సిగ్నెల్..ఎంత మంది రెడీగా!
రాజశేఖర్ ఫాంలో ఉన్నంత కాలం కెరీర్ ఎంత గొప్పగా సాగిందన్నది చెప్పాల్సిన పనిలేదు. వరుస సినిమాలతో చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున లాంటి నటీనటులకు పోటీగా సినిమాలు చేసిన నటుడాయన.;
రాజశేఖర్ ఫాంలో ఉన్నంత కాలం కెరీర్ ఎంత గొప్పగా సాగిందన్నది చెప్పాల్సిన పనిలేదు. వరుస సినిమాలతో చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున లాంటి నటీనటులకు పోటీగా సినిమాలు చేసిన నటుడాయన. కొన్నాళ్ల పాటు, తిరుగులేని స్టార్ డమ్ తో కొనసాగారు. కాలక్రమంలో చేసిన సినిమాలు పరాజయం చెందడంతో అవకాశాలు తగ్గాయి. సొంత బ్యానర్లో చేసిన చాలా సినిమాలు ఆశించిన ఫలితాలు రాక ప్రతికూల పరిస్థితులు ఎదుర్కున్నారు. ఈ క్రమంలో స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రల అవకాశాలు నటుడి ఇంటి తలపు తట్టాయి.
నచ్చిన పాత్రలతో ప్రయాణం:
మెగాస్టార్ లాంటి నటుడు కూడా తన సినిమాల్లో అవకాశాలివ్వాలని చూసారు. ఓ ఆఫర్ కూడా చేసారు. కానీ అప్పట్లో ఆ ఛాన్స్ ని రాజశేఖర్ సున్నితంగా తిరస్కరించారు. చేస్తే హీరో పాత్రలే చేయాలి? అన్న తీరున ఆయన వైఖరి కనిపించింది. అయితే `ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్` తో రెండేళ్ల క్రితమే తన పద్దతి మార్చుకున్నట్లు కనిపిం చింది. ఆ సినిమాలో ఓ కీలక పాత్రలో అవకాశం రావడంతో..పాత్ర నచ్చడంతో నో చెప్పకుండా పని చేసారు. కానీ ఆ సినిమా వైఫల్యం చెందడంతో అవకాశాలు రాక మరో సినిమా చేయలేదా? వచ్చినా వద్దనుకున్నారా? అన్నది తెలియదు గానీ..
సెకెండ్ ఇన్నింగ్స్ ఆసక్తికరంగా:
తాజాగా ఇప్పుడు ఎలాంటి పాత్రలైనా పోషించడానికి సిద్దంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ పాత సంఘటన కూడా గుర్తు చేసుకున్నారు. `ఓ సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ ఫోటో గ్రాఫర్ చేతినిండా సినిమాలు ఉన్నాయి . మీరు చాలా లక్కీ అన్నాడు. ఆ రోజు ఆ మాట విలువ తనకు పెద్దగా అర్దం కాలేదన్నారు. కానీ ఇప్పుడా ప్రాముఖ్యత అర్దమవుతుంది. కరోనా సమయంలో నడవలేని పరిస్థితికి వెళ్లాను. అటుపై రెండు నెలల్లో కోలుకున్నా. ఇప్పుడు పని చేయాలి అన్న తపన ఎక్కువైంది. కానీ కథలు నచ్చకే సినిమాలు చేయలేదు.
అవకాశం ఇచ్చేది ఎంత మంది?
ఆ సమయంలో డైరెక్టర్ అభిలాష్ `బైకర్` కథతో వచ్చాడు. నచ్చడంతో వెంటనే ఒకే చేసానన్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. సెకెండ్ ఇన్నింగ్స్ విషయంలో రాజశేఖర్ పుల్ క్లారిటీగా ఉన్నారు. రాజశేఖర్ కీలక పాత్రలు పోషిం చని సమయంలో చాలా మంది దర్శకులు ట్రై చేసారు. కానీ అప్పుడు ఛాన్స్ ఇవ్వలేదు. మరి ఇప్పుడు తానే ముందుకొచ్చిన వెళ ఎంత మంది దర్శకులు రాజశేఖర్ కోసం పాత్రలు రాస్తారో చూడాలి.