• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  SSRMB.. టైటిల్ చెప్పి...

SSRMB.. టైటిల్ చెప్పి మొదలు పెడతారా..?

| ఈ సినిమా టైటిల్ దగ్గర నుంచి ప్రతి చిన్న విషయాన్ని కూడా రాజమౌళి చాలా ఫోకస్ గా ఉన్నట్టు అర్థమవుతుంది.

By - Tupaki Desk
Update: 2024-03-01 23:30 GMT

RRR తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ తో సినిమా లాక్ చేసుకున్నాడని తెలిసిందే. ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించే ప్లానింగ్ లో ఉన్నాడు జక్కన్న. ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అన్న ఎగ్జైట్మెంట్ ఫ్యాన్స్ లో ఉంది. రాజమౌళి ఈ సినిమాకు భారీ ప్లానింగ్ తో ఉన్నాడని తెలుస్తుంది. తన ప్రతి సినిమా లానే ఈ సినిమా అనౌన్స్ మెంట్ కూడా ఒక ప్రెస్ మీట్ తో మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నాడు రాజమౌళి.

సినిమాకు ముహూర్తం పెట్టేసి ఆ తర్వాత ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తారట. ఈ సినిమాకు కూడా రాజమౌళి సినిమా టైటిల్ ముందే పెట్టి ఆ తర్వాత సెట్స్ మీదకు వెళ్తాడని తెలుస్తుంది. సినిమా టైటిల్ పై కన్ ఫ్యూజ్ లేకుండా టైటిల్ అనౌన్స్ చేసి ఆడియన్స్ కు క్లారిటీ ఇస్తారని టాక్. RRR టైం లో కూడా ఇదే ఫార్ములా ఫాలో అయ్యాడు రాజమౌళి. పాన్ ఇండియా లెవెల్ లో RRR ఎలాగైతే ఒకే టైటిల్ పెట్టారో మహేష్ రాజమౌళి కాంబో సినిమాకు పాన్ వరల్డ్ మొత్తం వచ్చేలా సినిమా టైటిల్ పెడతారట.

ఈ సినిమా టైటిల్ దగ్గర నుంచి ప్రతి చిన్న విషయాన్ని కూడా రాజమౌళి చాలా ఫోకస్ గా ఉన్నట్టు అర్థమవుతుంది. సినిమా కోసం ఇప్పటికే హాలీవుడ్ టెక్నీషియన్స్ ని తీసుకునే ఆలోచనలో ఉన్న రాజమౌళి. ఈ సినిమాతో హాలీవుడ్ సినిమాలకు గట్టి పోటీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. ఆర్.ఆర్.ఆర్ తో ఆస్కార్ దాకా వెళ్లొచ్చిన రాజమౌళి ఈ మూవీతో సినిమాకు, డైరెక్టర్ నామినేషన్స్ లో కూడా తన పేరు ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట.

మామూలుగానే మహేష్ హాలీవుడ్ కటౌట్ తో ఉంటాడు. అలాంటి హీరోతో రాజమౌళి ఎలాంటి అద్భుతమైన సినిమా చేస్తాడు.. ఆడియన్స్ కు ఎలాంటి వండర్ఫుల్ ఎక్స్ పీరియన్స్ అందిస్తాడు అన్నది చూడాలని ఫ్యాన్స్ అంతా కూడా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. కె.ఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా 300 కోట్ల పైన బడ్జెట్ తో ఉంటుందని టాక్. ఈ సినిమాలో మిగతా స్టార్ కాస్ట్ ఎవరన్నది తెలుసుకోవాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు.

Tags:    
  • Ssrajamouli 
  • Maheshbabu 
  • Hollywoodrangemovie 
  • Ssmb29 
  • Rrrmovie 
  • Movietitle 
  • Staractors 
  • Panworldmovie 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS