అప్పుడు బ్రహ్మోత్సవం.. ఇప్పుడు SSMB29
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న SSMB29 సినిమాపై దేశవ్యాప్తంగా అభిమానుల్లో భారీ క్రేజ్ ఉంది.;
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న SSMB29 సినిమాపై దేశవ్యాప్తంగా అభిమానుల్లో భారీ క్రేజ్ ఉంది. ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో ప్రపంచ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా, 1000 కోట్ల భారీ బడ్జెట్ తో సిద్ధమవుతోంది. భారీ బడ్జెట్, స్పెషల్ సెట్‌లతో ఈ సినిమా రికార్డులు సృష్టించాలన్నది మేకర్స్ టార్గెట్. కానీ ఈ మధ్య జరిగిన ఒక ఘటన టీమ్‌కు ఊహించని షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
లేటెస్ట్ టాక్ ప్రకారం, హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో రూ.2 కోట్ల ఖర్చుతో ప్రత్యేకంగా వేసిన ఒక సరస్సు సెట్, ఒక్కసారిగా వృథా అయిపోయిందతా. ఎందుకంటే, షూటింగ్‌కి ప్లాన్ చేసిన రోజే, మహేష్ బాబు లొకేషన్‌కు రాగానే తీవ్ర వేడి కారణంగా ఆయన అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయారట. "ఇది నా తప్పు కాదు, సారీ" అంటూ మహేష్ వెళ్లిపోవడంతో, దానికి సంబంధించిన షూట్ ఆగిపోయిందని తెలుస్తోంది. దీంతో ఆ భారీ సెట్టప్ ను వాడకుండానే ప్యాక్ చేయాల్సి వచ్చిందని సమాచారం.
అప్పట్లో కూడా ఇలానే..
ఇలాంటి పరిణామాలు మహేష్ బాబు కెరీర్‌లో ఇదే తొలిసారి కాదు. గతంలో బ్రహ్మోత్సవం షూటింగ్ సమయంలో కూడా, డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఒక పాటను అవుట్‌డోర్‌లో ప్లాన్ చేశారని, కానీ మహేష్ బాబు ఎండ భరించలేకపోయినట్టు, దాన్ని ఇండోర్‌లోకి మార్చారని అప్పట్లో ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. ఇప్పుడు SSMB29లో ఇలాంటి సంఘటన మరోసారి వార్తల్లోకి వచ్చింది.
గ్రాండియర్ ప్లస్ బడ్జెట్
ఈ ఘటనతో మేకర్స్ కు పెద్ద షాక్ ఇచ్చినా, మహేష్ అభిమానులు మాత్రం హీరో కంఫర్ట్ ముఖ్యమనే తరహాలో కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం రూ.2 కోట్ల సెట్ ఒక్కసారిగా వృథా అవ్వడాన్ని విమర్శిస్తున్నారు. స్టార్ హీరోలకు ఇలాంటి ప్రాధాన్యం ఇవ్వడం వల్లే బడ్జెట్ మరింత పెరగడంతో పాటు, వృథా ఖర్చులు పెరుగుతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
రాజమౌళి సినిమా గ్రాండియర్ ను, బడ్జెట్‌ను మేనేజ్ చేయడంలో ఎంతో కేర్ తీసుకుంటాడనే టాక్ ఉంది. కానీ SSMB29 లాంటి భారీ చిత్రాల్లో, స్టార్ హీరోను సెట్‌లో కంఫర్ట్‌గా ఉంచడమే పెద్ద టాస్క్. ఫారిన్ టెక్నీషియన్స్, గ్రాఫిక్స్ టీమ్, మాస్ ఆడియెన్స్‌కి కనువిందు చేసేలా విజువల్స్ ఇవ్వాలని మేకర్స్ చూస్తున్నారు. ఇక సినిమా విషయంలో భవిష్యత్తులో ఇంకా ఎలాంటి గాసిప్స్ వినిపిస్తాయో చూడాలి.