పవర్‌ఫుల్ క్యామియోకు రెడీ అయిన సల్మాన్
శివాజీ యొక్క అత్యంత విశ్వసనీయడు, విశ్వాసపాత్రుడైన జీవా మహాలా పాత్రలో సల్మాన్ కనిపించనున్నారట.;
బాలీవుడ్ స్టార్ హీరో రితేష్ దేశ్‌ముఖ్ రాజా శివాజీ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. రితేష్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలుండగా, ఇప్పుడా అంచనాలను పెంచే వార్త ఒకటి తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. శివాజీ యొక్క అత్యంత విశ్వసనీయడు, విశ్వాసపాత్రుడైన జీవా మహాలా పాత్రలో సల్మాన్ కనిపించనున్నారట.
రాజా శివాజీలో సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్ బిగ్ స్క్రీన్ పై నటించిన ప్రతీసారీ తనదైన శైలిలో ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు రితేష్ తో కలిసి రాజా శివాజీలో కూడా తన కీలక పాత్రతో మ్యాజిక్ చేయడానికి సల్మాన్ రడీ అవుతున్నట్టు తెలుస్తోంది. నవంబర్ 7 నుంచి సల్మాన్ ఈ షూటింగ్ లో పాల్గొననున్నారని, సినిమాలోని మేజర్ హైలైట్స్ లో సల్మాన్ ఖాన్ చేసే క్యారెక్టర్ కూడా ఒకటిగా నిలుస్తుందని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
సల్మాన్ రాకతో పెరిగిన అంచనాలు
అఫ్జల్ ఖాన్ నమ్మకస్తుడైన సయ్యర్ బండా చేసిన భీకర దాడి టైమ్ లో ఛత్రపతి శివాజీ మహారాజ్ ను రక్షించడంలో జీవా మహాలా కీలక పాత్ర పోషించారు. ఈ ధైర్య సాహసాలను రాజా శివాజీలో చూపించనున్నారని, సినిమాలో ఇవి మేజర్ హైలైట్ గా నిలుస్తాయని సమాచారం. సల్మాన్ ఖాన్ రాకతో ఇప్పటికే రాజా శివాజీపై అంచనాలు పెరగ్గా, ఈ సినిమా రితేష్ కెరీర్లోనే మైల్ స్టోన్ ఫిల్మ్ గా నిలవనుంది.
అప్జల్ ఖాన్ పాత్రలో సంజయ్ దత్
రాజా శివాజీలో జీవా పాత్రలో సల్మాన్ ఖాన్ కనిపించనుండగా, అఫ్జల్ ఖాన్ పాత్రలో సంజయ్ దత్ నటించనున్నారు. ఇప్పటికే ఇద్దరు బాలీవుడ్ స్టార్లను రంగంలోకి దింపిన రాజా శివాజీ చిత్ర యూనిట్, రానున్న రోజుల్లో ఇంకెంతమందిని ఈ సినిమాలో భాగం చేస్తారో చూడాలి. కాగా సల్మాన్ ఇప్పటికే గతంలో రితేష్ తో కలిసి లాయ్ భారీ సినిమాతో పాటూ వేద్ మూవీలోని వేద్ లవ్లే సాంగ్ లో గెస్ట్ రోల్ లో కనిపించారు.