పవన్ హడావిడి కంప్లీట్ అయ్యాక ప్రభాస్ ది స్టార్ట్..!

ప్రస్తుతం తెలుగు రెండు రాష్ట్రాల్లో దసరా వరకు పవర్ స్టార్ ఓజీ హడావిడి ఉండేలా ఉంది. సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించారు.;

Update: 2025-09-27 05:41 GMT

ప్రస్తుతం తెలుగు రెండు రాష్ట్రాల్లో దసరా వరకు పవర్ స్టార్ ఓజీ హడావిడి ఉండేలా ఉంది. సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ కొన్నాళ్లుగా ఆయన్ని ఎలా చూడాలని అనుకుంటున్నారో అలా చూపించి అదరగొట్టాడు డైరెక్టర్ సుజిత్. దసరాకి సోలోగా వచ్చి సెన్సేషనల్ హిట్ అందుకునే దిశగా పరుగులు తీస్తుంది ఓజీ. ఐతే అక్టోబర్ 1న ధనుష్ ఇండ్లీ కొట్టు, అక్టోబర్ 2న కాంతారా చాప్టర్ 1 సినిమాలు వస్తున్నాయి. ఈ రెండు సినిమాల్లో కాంతారా చాప్టర్ 1 ఓజీ మీద ఎంతోకొంత ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉంది.

రాజా సాబ్ ట్రైలర్ తోనే..

ఎందుకంటే కాంతారా సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది. కాంతారా చాప్టర్ 1 పై హ్యూజ్ బజ్ ఉంది. అందులోనూ రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్ కాంబో క్రేజీగా ఉండబోతుంది. ఐతే ఈ సినిమాతో పాటు రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ ట్రైలర్ రాబోతుందని టాక్. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాజా సాబ్ సినిమా థ్రిల్లర్ జోనర్ లో డిఫరెంట్ అటెంప్ట్ చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఐతే ఓజీ సినిమా దసరా వరకు తన హడావిడి చూపిస్తే అక్టోబర్ నుంచి ప్రభాస్ రాజా సాబ్ హంగామా మొదలవుతుందని తెలుస్తుంది. ఆల్రెడీ నిర్మాత ఎస్.కె.ఎన్ ఈ విషయాన్ని వెల్లడించారు. అక్టోబర్ నుంచి జనవరి రిలీజ్ వరకు రాజా సాబ్ ప్రమోషన్స్ మోత మోగిస్తారని తెలుస్తుంది. మారుతి ఈసారి రాజా సాబ్ ప్రమోషన్స్ ని డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారట.

OGతో ఫ్యాన్స్ సూపర్ జోష్..

సో సెప్టెంబర్ మొత్తం ఓజీ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ సూపర్ జోష్ తో ఉంటే అక్టోబర్ నుంచి ఆ డ్యూటీ రెబల్ స్టార్ ఫ్యాన్స్ తీసుకుంటుంటారని తెలుస్తుంది. రాజా సాబ్ ట్రైలర్ రిలీజ్ నుంచి మూవీ రిలీజ్ వరకు సినిమా గురించి ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసేలా ఉంటుందట. ఇన్నాళ్లు సినిమా అప్డేట్స్ కోసం ఊగిపోయిన ఫ్యాన్స్ మేకర్స్ రిలీజ్ చేసే అప్డేట్స్ తో ఇక చాలు బాబోయ్ మేం సినిమా చూసేస్తాం అనేలా చేస్తారట.

సో పవన్ తర్వాత వెంటనే ప్రభాస్ డ్యూటీ ఎక్కేస్తున్నాడు. సో తెలుగు ఆడియన్స్ కు మాత్రం పండగ అది వచ్చిన రోజు కాదు సినిమాలతో ఆ జోష్ ముందు నుంచే మొదలు పెట్టేస్తున్నారనేలా ఉంది. 2026 పొంగల్ రేసులో రాజా సాబ్ వస్తుంది. ఆ సినిమాతో పాటు మెగాస్టార్ మన శంకర వరప్రసాద్, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒకరాజు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. తమిళ డబ్బింగ్ సినిమాలు జన నాయగన్, పరాశక్తి కూడా రిలీజ్ ప్లాన్ ఉంది.

Tags:    

Similar News