ఈసారి మాళవిక అస్సలు డిజప్పాయింట్ చేయదట..!

మలయాళ పరిశ్రమ నుంచి యాక్టింగ్ తో పాటు గ్లామర్ విషయంలో కూడా ఏమాత్రం తగ్గని విధంగా అలరిస్తూ వస్తుంది మాళవిక మోహనన్.;

Update: 2025-11-26 04:33 GMT

మలయాళ పరిశ్రమ నుంచి యాక్టింగ్ తో పాటు గ్లామర్ విషయంలో కూడా ఏమాత్రం తగ్గని విధంగా అలరిస్తూ వస్తుంది మాళవిక మోహనన్. మలయాళం నుంచి వచ్చినా ఎక్కువగా అమ్మడు తమిళ సినిమాల్లోనే కనిపించింది. రజనీకాంత్, దళపతి విజయ్ లాంటి స్టార్ హీరోల్లో నటించినా కూడా మాళవికకు రావాల్సిన గుర్తింపు రాలేదు. ఐతే మాళవిక ఈసారి మాత్రం అసలు డిజప్పాయింట్ చేయనని అంటుంది.

రాజా సాబ్ సినిమాలో మాళవిక మోహనన్..

రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ సినిమాలో మాళవిక మోహనన్ వన్ ఆఫ్ ది హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ కూడా హీరోయిన్ గా చేస్తుంది. ఐతే ఇద్దరు ఉన్నా కూడా సినిమాలో ఇద్దరికీ చాలా ఇంపార్టెంట్ రోల్స్ పడ్డాయట. ముఖ్యంగా స్టార్ సినిమాల్లో మాళవిక సరైన పాత్రలు చేయట్లేదు అన్న వాటికి ఆన్సర్ ఇస్తూ ఈసారి రాజా సాబ్ లో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నా అని అన్నది.

అంతేకాదు ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమాతో తెలుగులో అడుగు పెట్టడం సంతోషంగా ఉందని అంటుంది మాళవిక. స్టార్ హీరోయిన్ కి కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్న ఈ అమ్మడు రాజా సాబ్ సినిమాతో తప్పకుండా తన టాలెంట్ చూపిస్తానంటుంది. అమ్మడు చేసే ఈ రోల్ తెలుగు ఆడియన్స్ కి నచ్చేస్తుందని అంటున్నారు.

సినిమాలే కాదు ఫోటో షూట్స్ కూడా..

సో రాజా సాబ్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మాళవికకు కచ్చితంగా ఆ సినిమా తర్వాత తెలుగులో ఆమెకు మరింత పాపులారిటీ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. మాళవిక మోహనన్ సినిమాలే కాదు ఫోటో షూట్స్ కూడా ఫ్యాన్స్ కి తెగ నచ్చేస్తాయి. అమ్మడు అటు సినిమాలు చేస్తూనే వాణిజ్య ప్రకటనల్లో కూడా బిజీ గా ఉంటుంది. ప్రభాస్ రాజా సాబ్ తో మాళవిక టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంటుందని అంటున్నారు. 2026 సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ సినిమా అమ్మడి కోరిక నెరవేరేలా చేస్తుందా లేదా అన్నది చూడాలి.

కెరీర్ మొదలు పెట్టి పుష్కర కాలం అవుతున్నా సరే మాళవిక మోహనన్ కి స్టార్ రేంజ్ రాలేదు. అయినా సరే వరుస ఆఫర్లు అందుకుంటుంది అమ్మడు. ఈ ఇయర్ మలయాళంలో మోహన్ లాల్ తో హృదయపూర్వం సినిమా చేసిన మాళవిక నెక్స్ట్ రాజా సాబ్ తో వస్తుంది. ఇక కార్తి హీరోగా చేస్తున్న సర్దార్ 2 సినిమాలో కూడా మాళవిక ఫిమేల్ లీడ్ ఛాన్స్ దక్కించుకుంది. తెలుగు, తమిళ సినిమాలతో కెరీర్ ని ప్లాన్ చేసుకున్న మాళవిక రాజా సాబ్ తర్వాత తెలుగులో కచ్చితంగా బిజీ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. ప్రభాస్ తో సినిమా అంటే నేషనల్ లెవెల్ లో పాపులారిటీ అన్నట్టే. సో ఈ లెక్కన మాళవిక అటు బాలీవుడ్ మేకర్స్ దృష్టిలో పడినా కూడా కెరీర్ టర్న్ అయినట్టే లెక్క.

Tags:    

Similar News