దురంధర్ బ్యూటీ తండ్రి చాటు బిడ్డేనని తెలుసా?
కథానాయికగా నటించిన తొలి ఫ్రాంఛైజీతోనే ఏకంగా 3000 కోట్ల క్లబ్ నాయిక అయింది... దురంధర్ 2 వడి వడిగా 3000 కోట్ల క్లబ్ వైపు దూసుకుపోతుంటే ఈ ఆనందం చిత్రబృందంలో స్పష్ఠంగా కనిపిస్తోంది.;
దురంధర్, దురంధర్ 2 పాన్ ఇండియా సక్సెస్ ని ఆస్వాధిస్తోంది సారా అర్జున్. కథానాయికగా నటించిన తొలి ఫ్రాంఛైజీతోనే ఏకంగా 3000 కోట్ల క్లబ్ నాయిక అయింది... దురంధర్ 2 వడి వడిగా 3000 కోట్ల క్లబ్ వైపు దూసుకుపోతుంటే ఈ ఆనందం చిత్రబృందంలో స్పష్ఠంగా కనిపిస్తోంది.
కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ చాబ్రా కల్పించిన అవకాశమిది. దీనికి సారా అర్జున్ తండ్రి రాజ్ అర్జున్ తనవంతు కృతజ్ఞతను తెలిపారు. ముఖేష్ జీతో అతడి స్నేహం గురించి మాట్లాడారు.. సారా - రాజ్ అర్జున్ ఇద్దరూ ఎంతో ఆనందంగా కనిపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో `దురంధర్` మానియా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ పాన్ ఇండియా ఫ్రాంచైజీలో కథానాయికగా నటించిన సారా అర్జున్ ఓవర్ నైట్ స్టార్‌డమ్ సొంతం చేసుకుంది. హీరోయిన్ గా ఆరంగేట్ర చిత్రమే సారా అర్జున్ కెరీర్ లో ఇదొక మైలురాయిగా నిలిచిపోనుంది. అయితే ఈ సక్సెస్ వెనుక సారా తండ్రి ప్రోత్సాహం ఎంతో ఉంది.
సారా అర్జున్ తండ్రి రాజ్ అర్జున్ కూడా చిత్ర పరిశ్రమలో సుపరిచితులే. ఆయన ఒక విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సారా అర్జున్ కి కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ చాబ్రా కల్పించిన ఈ అద్భుతమైన అవకాశంపై రాజ్ అర్జున్ హర్షం వ్యక్తం చేశారు. ముఖేష్ చాబ్రాతో తనకున్న సుదీర్ఘ స్నేహం గురించి ప్రస్తావిస్తూ..తన కుమార్తె ఇంతటి ఘనవిజయాన్ని అందుకోవడానికి ముఖేష్ జీ కారకుడని ప్రశంసించారు. తండ్రీకూతుళ్లిద్దరూ ప్రస్తుతం ఈ విజయోత్సాహాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.
రాజ్ అర్జున్ సినీ ప్రస్థానం విషయానికి వస్తే.. 2002లో వచ్చిన `కంపెనీ` సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. గత రెండు దశాబ్దాలుగా సుమారు 30కి పైగా సినిమాల్లో చిన్న - పెద్ద పాత్రల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా అమీర్ ఖాన్ నిర్మాణంలో వచ్చిన `సీక్రెట్ సూపర్ స్టార్` చిత్రంలో సవతి తండ్రిగా అతడు పోషించిన క్రూరమైన పాత్ర ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుంది. ఆ సినిమా తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా నిలిచింది.
రాజ్ అర్జున్ కేవలం హిందీలోనే కాకుండా దక్షిణాది సినిమాల్లోనూ తన నటనతో ఆకట్టుకున్నారు. కంగనా రనౌత్ నటించిన `తలైవి` చిత్రంలో ఆర్.ఎం. వీరప్పన్ (స్మగ్లర్ వీరప్పన్ కాదు) పాత్రలో అతడు ఒదిగిపోయిన తీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రతి సినిమాకూ వైవిధ్యాన్ని ప్రదర్శించే రాజ్ అర్జున్.. తన నటనతో అటు బాలీవుడ్.. ఇటు సౌత్ ఇండస్ట్రీలో ఒక వెర్సటైల్ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. తన కుమార్తె సారా అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పటి నుండి తన కెరీర్ గైడ్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇలా తండ్రి నటనలో రాణిస్తుంటే.. కుమార్తె పాన్ ఇండియా రేంజ్‌లో రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. `దురంధర్ 2` సాధిస్తున్న వసూళ్లు సారా అర్జున్ క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి.