ఎండిపోయిన 1200 బోర్‌వెల్స్‌కు జీవం పోసిన IAS అధికారిపై మ్యాడీ ప్ర‌శంస‌లు

దేశంలో రోజురోజుకూ భూగర్భ జలాలు అడుగంటిపోతున్న తరుణంలో ఒక ఐఏఎస్ అధికారి చేపట్టిన వినూత్న కార్యక్రమం నీటి సంరక్షణకు సరికొత్త మార్గాన్ని చూపించింది.

Update: 2026-07-28 16:07 GMT

దేశంలో రోజురోజుకూ భూగర్భ జలాలు అడుగంటిపోతున్న తరుణంలో ఒక ఐఏఎస్ అధికారి చేపట్టిన వినూత్న కార్యక్రమం నీటి సంరక్షణకు సరికొత్త మార్గాన్ని చూపించింది. ఉపయోగం లేకుండా వదిలేసిన దాదాపు 1200కు పైగా బోర్‌వెల్స్‌ను ఆయన వర్షపు నీటి సేకరణ యూనిట్లుగా మార్చి సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టారు. సమాజానికి ఎంతో ఉపయోగపడే ఈ అద్భుతమైన చొరవను ప్రముఖ నటుడు `ధురందర్ 2` స్టార్ ఆర్. మాధవన్ ప్రత్యేకంగా ప్రశంసించారు.

ఈ ఆలోచన కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అద్భుత ఫలితాలను అందించింది. నిరుపయోగంగా మారిన బోర్‌వెల్స్ ద్వారా వర్షపు నీటిని నేరుగా భూమిలోకి ఇంకేలా చేయడం వల్ల ఆ ప్రాంతంలో భూగర్భ జలమట్టాలు అసాధార‌ణంగా పెరిగాయి. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే అక్కడ భూగర్భ నీటిమట్టం ఐదు నుండి పది అడుగుల మేర విజయవంతంగా పెరగడం ఈ ప్రాజెక్ట్ గొప్పదనానికి నిదర్శనం.

దీని ఫలితంగా ఒకప్పుడు నీరు లేక పూర్తిగా ఎండిపోయిన బావులు మళ్లీ జలకళను సంతరించుకున్నాయి. సంవత్సరాల తరబడి నీటి చుక్క లేక ఎండిపోయిన బావుల్లోకి మళ్లీ నీరు చేరి నిల్వ ఉండటం ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తగ్గడంతో పాటు... భూగర్భంలో నీటి మట్టం పెరగడం వల్ల వర్షాభావ పరిస్థితుల్లో కూడా ఆ ప్రాంతంలో ఊహించని మార్పులు కనిపించాయి.

గతంలో ప్రతి చిన్న అవసరానికి.. తాగునీటికి ట్యాంకర్లపైనే ఆధారపడిన గ్రామాల్లో ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎండిపోయిన చేతి పంపులు మళ్లీ సజావుగా పనిచేయడం మొదలుపెట్టడంతో ప్రజల నీటి కష్టాలు తీరాయి. ట్యాంకర్ల కోసం ఎదురుచూసే తిప్పలు తప్పడంతో గ్రామస్తులు తీవ్ర ఉపశమనం పొందుతున్నారు.

ఈ నీటి సంరక్షణ విధానం స్థానిక రైతులకు కూడా కొండంత అండగా నిలిచింది. పెరిగిన భూగర్భ జలాలు, మళ్లీ ఊరిన బావుల ద్వారా లభిస్తున్న కొత్త నీటి వనరులతో రైతులు తమ పంటలకు సమర్థవంతంగా సాగునీరు అందిస్తున్నారు. ఒక ఐఏఎస్ అధికారికి వ‌చ్చిన‌ ఈ చిన్న ఆలోచన వేలాది మంది ప్రజల, రైతుల జీవితాల్లో వెలుగులు నింపి పర్యావరణ పరిరక్షణకు గొప్ప ఆదర్శంగా నిలిచింది. ఎల్.నినో ప్ర‌భావంతో మేఘాలు (రుతుప‌వ‌నాలు) వ‌ర్షించ‌క తీవ్ర‌మైన ఇబ్బందులు ప‌డుతున్న ప్ర‌జ‌ల‌కు ఇలాంటి పాఠాలు నేర్వాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

సాంప్ర‌దాయ వంట‌కాల‌తో 75 కోట్ల ట‌ర్నోవ‌ర్.. బిహారీ ఫ్యామిలీపై ప్ర‌శంస‌లు!

సాంప్రదాయ వంటకాలకు సరైన నాణ్యత, గుర్తింపు తోడైతే వ్యాపారంలో అద్భుతాలు సృష్టించవచ్చని బీహార్‌కు చెందిన ఓ తల్లి, కొడుకుల జోడీ నిరూపించారు. బీహార్‌కు చెందిన ఈ మాతృమూర్తి, ఆమె కుమారుడు బెంగళూరు కేంద్రంగా ప్రారంభించిన `ఠేకువా` ( బీహార్ సాంప్రదాయ తీపి వంటకం) బ్రాండ్ ప్రస్తుతం రూ. 75 కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యంగా అవతరించింది. ఏడాదికి రూ. 15 కోట్ల ఆదాయాన్ని గడిస్తూ.. రోజుకు సగటున 1000కు పైగా ఆర్డర్లను అందుకుంటున్న ఈ స్ఫూర్తిదాయక వంట‌శాల‌ విజయాన్ని ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వారిపై ప్రశంసల వర్షం కురిపించారు.

సొంత ఊరి రుచులను సరికొత్త ప్యాకేజింగ్, నాణ్యతతో మహానగర వాసులకు అందించాలనే చిన్న ఆలోచనతో ప్రారంభమైన ఈ ప్రయాణం ఈరోజు ఎంతోమందికి ఉపాధినిస్తూ గొప్ప స్టార్టప్ విజేతగా నిలిచింది. డిజిటల్ విక్రయాలు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా దేశవ్యాప్తంగా కస్టమర్లను చేరుకుంటూ.. భారతీయ సాంప్రదాయ పిండివంటలకు మార్కెట్‌లో ఉన్న ప్రాధాన్యతను వీరు మరోసారి చాటి చెప్పారు. నిబద్ధత, కష్టం ఉంటే ప్రాంతీయ రుచులతో కూడా గ్లోబల్ స్థాయిలో కోట్లాది రూపాయల బ్రాండ్‌ను నిర్మించవచ్చని అనడానికి వీరి విజయగాథ ఒక నిదర్శనం.

Tags:    

Similar News