• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పుష్పరాజ్‌ స్నేహితుడు...

పుష్పరాజ్‌ స్నేహితుడు అరెస్ట్ వెనుక ఏమి జరిగింది అంటే!

| పుష్ప‌- ప‌లాస 1978 లాంటి చిత్రాల్లో క‌థానాయ‌కుడి స్నేహితుడిగా అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న స‌హాయ‌ న‌టుడు జ‌గ‌దీష్ ని ఓ షాకింగ్ ఘటనలో పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు.

By - Tupaki Desk
Update: 2023-12-07 04:37 GMT

పుష్ప‌- ప‌లాస 1978 లాంటి చిత్రాల్లో క‌థానాయ‌కుడి స్నేహితుడిగా అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న స‌హాయ‌ న‌టుడు జ‌గ‌దీష్ ని ఓ షాకింగ్ ఘటనలో పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. జూనియ‌ర్ ఆర్టిస్ట్ అయిన మ‌హిళ ఆత్మ‌హ‌త్యలో అత‌డి ప్ర‌మేయం ఉంద‌ని పోలీసులు చెబుతున్నారు. జూనియర్ ఆర్టిస్ట్ వేధింపుల కారణంగా మానసిక క్షోభకు గురై గత నెల 29న విషాదకరంగా ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళ ఆత్మహత్యకు జగదీష్‌ కారణమని ప్రాథమికంగా గుర్తించారు. జగదీష్ చాలా రోజులుగా అధికారులనుంచి తప్పించుకుంటున్నాడు.. కానీ చివరికి అరెస్టు చేసి బుధవారం కోర్టులో హాజరుపరిచారు.

జగదీష్‌కు సినీ పరిశ్రమలో ఉన్న సంబంధాల ద్వారా స‌ద‌రు జూనియ‌ర్ ఆర్టిస్ట్ (మ‌హిళ‌)తో పరిచయం ఏర్పడినట్లు వెల్లడైంది. జగదీష్ స‌ద‌రు మహిళ‌ను బెదిరించడంతో కాన్ సీక్వెన్సెస్ బ‌య‌ట‌ప‌డ్డాయి. జ‌గ‌దీష్ ప్ర‌తిభావంతుడైన వ‌ర్థ‌మాన న‌టుడు. కెరీర్ ప‌రంగా ఎదుగుతున్నాడు. కానీ ఇలాంటి ఒక ఘ‌ట‌న‌లో అత‌డు ప‌ట్టుబ‌డ‌టం ప‌రిశ్ర‌మ‌లో షాక్ వేవ్ గా మారింది.

మల్లేశం -జార్జ్ రెడ్డి-పలాస 1978 వంటి చిత్రాలలో తన స‌హాయ‌క‌ పాత్రలతో అత‌డికి మంచి గుర్తింపు ద‌క్కింది. పాన్-ఇండియా చిత్రం `పుష్ప`లో అల్లు అర్జున్ స్నేహితుడిగా చిరస్మరణీయమైన పాత్రను పోషించాడు. అత‌డి అరెస్ట్ ఆక‌స్మిక ఘ‌ట‌న‌లు అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తాయి. ప్ర‌స్తుతం అత‌డు `పుష్ప 2`లో న‌టిస్తున్నాడు. తాజా ఘ‌ట‌న‌ పుష్ప టీమ్ కి కూడా ఇది ఇబ్బందిక‌ర స‌న్నివేశం.


Tags:    
  • Puspharaj 
  • Jagadish 
  • Police 
  • Arrest 
  • Punjagutta 
  • Puspha2 
  • Alluarjun 
  • Sukumar 
  • Filmindustry 

Similar News

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS