• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పుష్ప 2: అక్కడ బజ్...

పుష్ప 2: అక్కడ బజ్ తగ్గితే బాక్సాఫీస్ కు దెబ్బె

| ఆగష్టు 15న మూవీ రిలీజ్ అవుతుందని అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు.

By - Tupaki Desk
Update: 2024-07-31 12:27 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న పుష్ప ది రూల్ మూవీ షూటింగ్ దశలో ఉంది. మూడేళ్లుగా ఈ సినిమా షూటింగ్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మూడు సార్లు ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడింది. 2022 ఆఖర్లో పుష్ప 2 రిలీజ్ అవుతుందని భావించారు. అయితే 2024 ఆగష్టు 15న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ డేట్ కి ఇంకా 15 రోజుల సమయం మాత్రమే ఉంది. ఆగష్టు 15న మూవీ రిలీజ్ అవుతుందని అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు.

బాలీవుడ్ లో కూడా డిస్టిబ్యూటర్స్ పుష్ప ది రూల్ తో భారీ లాభాలు కొల్లగొట్టొచ్చని భావించారు. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో డిసెంబర్ 6కి రిలీజ్ వాయిదా వేశారు. దీంతో పుష్ప ది రూల్ మీద ఇన్ని రోజులు ఉన్న బజ్ మొత్తం ఒకేసారిగా తగ్గిపోయింది. మూవీ షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదనే టాక్ ఫ్యాన్స్ ని నిరుత్సాహానికి గురిచేసింది. ఎప్పుడైనా భారీ అంచనాలతో రిలీజ్ కాబోయే మూవీ చెప్పిన టైంకి చెప్పినట్లు ప్రేక్షకుల ముందుకొస్తే మంచి ఓపెనింగ్స్ ని అందుకునే ఛాన్స్ ఉంటుంది.

రిలీజ్ డేట్ ప్రతిసారి వాయిదా పడుతుంటే మూవీపైన ఉన్న బజ్ తగ్గిపోతూ ఉంటుంది. పుష్ప ది రూల్ విషయంలో కూడా అదే జరగబోతోందని మాట ట్రేడ్ పండితుల నుంచి వినిపిస్తోంది. పుష్ప ది రూల్ ఆగష్టు 15న రిలీజ్ అయితే మొదటి రోజు 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసేదని ట్రేడ్ పండితులు చెబుతున్న మాట. అయితే ఇప్పుడు రిలీజ్ వాయిదా పడటంతో మూవీపెయిన్ నార్త్ ఇండియాలో కూడా హైప్ తగ్గిందనే టాక్ వినిపిస్తోంది.

డిసెంబర్ 6న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేసింది. సినిమాకి భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తే మళ్ళీ పుష్ప ది రూల్ పైన హైప్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు సైతం అంటున్నారు. ఈ రిలీజ్ వాయిదా పడటం వలన కనీసం 50 కోట్ల మేరకు ఫస్ట్ డే కలెక్షన్స్ పుష్ప 2కి డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. గతంలో ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ వాయిదా పడటంతో ఓపెనింగ్ డే రోజున సాలిడ్ కలెక్షన్స్ ని అందుకునే ఛాన్స్ మిస్ చేసుకుంది.

ఇప్పుడు పుష్ప 2 కూడా ఈ రిలీజ్ వాయిదాతో ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా లాస్ అయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. నిజానికి పుష్ప మూవీ సక్సెస్ లో మేజర్ కంట్రిబ్యూషన్ నార్త్ ఇండియన్ ఆడియన్స్ నుంచి వచ్చింది. పుష్ప ది రూల్ మూవీ కోసం వాళ్ళు చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు. అయితే మూవీ రిలీజ్ ఆలస్యం అవుతూ ఉండటంతో అక్కడి పబ్లిక్ లో పుష్ప ది రూల్ పై ఉన్న అటెన్షన్ తగ్గిపోతుందని టాక్ నడుస్తోంది.

Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 
  • Filmindustry 
  • Pushpa2 
  • Alluarjun 
  • Rashmikamandanna 
  • Sukumar 
  • Boxoffice 
  • Collections 
  • Postponed 

Similar News

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS