• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విడుదలకు ముందే 200M ఏంటి...

విడుదలకు ముందే 200M ఏంటి పుష్ప !

| పుష్ప 2 విడుదల ఇంకా చాలా సమయం ఉన్నా కూడా గత కొన్ని నెలలుగా పాటల కారణంగా సోషల్ మీడియాలో సందడి చేస్తున్న విషయం తెల్సిందే.

By - Tupaki Desk
Update: 2024-08-07 13:31 GMT

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ముందుగా అనుకున్న ప్రకారం పుష్ప 2 ను ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలి. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో పాటు, ఇతర కారణాల వల్ల సినిమాను ఈ ఏడాది చివరికి అంటే డిసెంబర్‌ నెలలో క్రిస్మస్ కానుకగా విడుదల చేయడంకు వాయిదా వేయడం జరిగింది. పుష్ప 2 విడుదల ఇంకా చాలా సమయం ఉన్నా కూడా గత కొన్ని నెలలుగా పాటల కారణంగా సోషల్ మీడియాలో సందడి చేస్తున్న విషయం తెల్సిందే.

పుష్ప 2 నుంచి కపుల్‌ సాంగ్ అంటూ 'సూసేకి' పాట వచ్చి 70 రోజులు అయ్యింది. ఆ పాట వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు తో పాటు అన్ని భాషల్లో కూడా ట్రెండ్‌ అవుతూనే ఉంది. తాజాగా యూట్యూబ్‌ లో ఈ పాట అరుదైన రికార్డ్‌ ను సొంతం చేసుకుంది. అన్ని భాషల్లో కలిపి తాజాగా 200 మిలియన్ వ్యూస్‌ ను ఈ పాట దక్కించుకుంది. అంతే కాకుండా రికార్డ్‌ స్థాయిలో 2.12 మిలియన్‌ ల లైక్స్ మరియు 3.7 మిలియన్ల రీల్స్ అండ్‌ షార్ట్స్ షేర్ అయ్యాయి. ఈ స్థాయిలో ఒక పాట సినిమా విడుదలకు ముందు హిట్‌ అవ్వడం ఇదే ప్రథమం అంటూ బన్నీ ఫ్యాన్స్ సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు.

అల్లు అర్జున్‌, రష్మిక మందన్న తో ప్రముఖ కొరియోగ్రఫర్‌ గణేష్ ఆచార్య చేయించిన సింపుల్‌ స్టెప్స్ ఎంతో పాపులర్ అయ్యాయి. సినిమాలో వాడే కాస్ట్యూమ్స్ కాకుండా డిఫరెంట్‌ గా ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను లిరికల్‌ సాంగ్‌ కి జోడించడం వల్ల కూడా అత్యధిక వ్యూస్ దక్కాయి. అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్న వేసిన స్టెప్స్ ప్రతి ఒక్కరిని ఆకర్షించాయి. వీడియో లో సుకుమార్ ఇంకా ఇతర యూనిట్‌ సభ్యులు కూడా స్టెప్స్ వేయడం కూడా అందరి దృష్టిని ఆకర్షించాయి అనడంలో సందేహం లేదు.

మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్న పుష్ప 2 సినిమాను డిసెంబర్‌ లో విడుదల చేయబోతున్నారు. గతంలో వచ్చిన పుష్ప భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఉత్తర భారతంలో దాదాపు వంద కోట్ల వసూళ్లు నమోదు చేయడం వల్ల పుష్ప 2 కూడా అదే స్థాయిలో లేదా అంతకు మించి ఉంటుందని నమ్మకంగా ఎదురు చూస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఆ మధ్య పుష్ప 2 గురించి కొన్ని పుకార్లు వచ్చినప్పటికీ అవన్నీ నిజం కాదని ఇటీవల మళ్లీ షూటింగ్‌ ప్రారంభం అయ్యింది.

పుష్ప 2 కోసం బన్నీ సుదీర్ఘ కాలంగా హెయిర్ స్టైల్‌ మరియు గడ్డంతో కనిపిస్తున్నాడు. రష్మిక ఈ సినిమాలో ఎలా కనిపించబోతుంది అనే ఆసక్తి అందరిలో ఉంది. ఇక అనసూయ పాత్ర కూడా ఈ సినిమాకు అత్యంత కీలకంగా చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఫాహద్ ఫాసిల్‌ పాత్ర ప్రముఖంగా ఉంటుందని అంటున్నారు. మొత్తానికి పుష్ప 2 గురించి ఎన్నో అంచనాలు ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా దర్శకుడు సుకుమార్‌ సినిమాను రూపొందించే పనిలో ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఈ డిసెంబర్‌ లో సినిమా విడుదల చేయాలని ఫ్యాన్స్‌ కోరుతున్నారు.

The world is swinging to #TheCoupleSong ❤️‍🔥#Pushpa2SecondSingle hits 200M+ VIEWS with 2.12M+ LIKES & 3.7M+ REELS & SHORTS 💥💥

▶️ https://t.co/Ko86Xxg6Jk#Sooseki #Angaaron #Soodaana #Nodoka #Kandaalo #Aaguner 👌 #Pushpa2TheRule Grand release worldwide on 6th DEC 2024.… pic.twitter.com/273baFqNkW

— Mythri Movie Makers (@MythriOfficial) August 7, 2024
Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Filmindustry 
  • Pushpa2 
  • Alluarjun 
  • Rashmikamandanna 
  • Sukumar 
  • Mythrimoviemakers 
  • Collections 
  • Views 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS