పుష్ప 2 మరో సర్ ప్రైజ్.. ఈసారి అగ్గిరవ్వ లాంటి సామీ

మేకప్ వేసుకునేందుకు సిద్ధంగా ఉన్న శ్రీవల్లి 'సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామీ..' అంటూ ఆమె పాట పాడడమే కాకుండా తన ఐకానిక్ స్టెప్పుతో కూడా మెప్పించింది.

Update: 2024-05-23 06:09 GMT

ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో "పుష్ప 2" ఒకటి. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, తొలి భాగం "పుష్ప: ది రైజ్" ఘన విజయం సాధించడంతో సెకండ్ పార్ట్ పై మరింత అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా కొనసాగుతోంది. ఇటీవల, "పుష్ప 2" టీమ్ అభిమానులను ఆనందపరిచేలా టైటిల్ సాంగ్‌ను విడుదల చేసింది.

ఈ పాటకు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఈ సక్సెస్‌ని కొనసాగిస్తూ, మేకర్స్ మరో పాటను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. మే 29న ఉదయం 11 గంటల 7 నిమిషాలకు ఈ సాంగ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సాంగ్‌లో రష్మిక మందన్నా, అల్లు అర్జున్ మరోసారి స్టెప్పులతో ఆదరగొట్టబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ పాటలో పుష్పరాజ్ శ్రీవల్లి కెమిస్ట్రీని మరింత హైలెట్ చేసేలా ఉంటుందని సమాచారం.

ఇక లేటెస్ట్ గా మరో ఎనౌన్స్ మెంట్ వీడియోను విడుదల చేశారు. కేశవ వాయిస్ తో సెకండ్ సాంగ్ గురించి రష్మికను అడుగుతాడు. మేకప్ వేసుకునేందుకు సిద్ధంగా ఉన్న శ్రీవల్లి 'సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామీ..' అంటూ ఆమె పాట పాడడమే కాకుండా తన ఐకానిక్ స్టెప్పుతో కూడా మెప్పించింది. కపుల్ సాంగ్ గా రాబోతున్న ఈ పాటను శ్రేయ ఘోషల్ పాడారు. చూస్తుంటే పాట మంచి మెలోడీగా క్లిక్కయ్యేలా ఉంది.

ఇక "పుష్ప 2" లో మొత్తం 5 పాటలు ఉంటాయంట. సుకుమార్, దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ గురించి చెప్పాలంటే, వారి కాంబినేషన్ ఎప్పుడు కొత్తదనాన్ని, వినూత్నతను చూపిస్తూ ఉంటుంది. అలాగే, అల్లు అర్జున్‌తో కలసి వచ్చిన ప్రతీ సినిమా పాటలు అదుర్స్ అనే విషయం తెలిసిందే. "పుష్ప 2" లో కూడా అదే స్థాయిలో సంగీతం ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Read more!

ఇంకా, ఈ చిత్రంలో ఒక ఐటెమ్ సాంగ్ కూడా ఉంటుందని సమాచారం. ఈ సాంగ్ కోసం పలు ప్రముఖ కథానాయికల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ముఖ్యంగా, జాన్వీ కపూర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే, ఇందులో ఎవరిని తీసుకుంటారో స్పష్టత త్వరలోనే రానుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ భారీ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఏమాత్రం రాజీ పడడం లేదు.

మొదటి భాగం "పుష్ప: ది రైజ్" మంచి విజయాన్ని సాధించిన తరువాత, "పుష్ప 2" పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా ఆగస్టు 15న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ విడుదల తేదీని అందుకునేందుకు చిత్రబృందం చాలా కష్టపడుతోంది. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను అందుకుంటుందో చూడాలి.

Full View
Tags:    

Similar News