• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'పుష్ప 2'.. ఇది అసలు...

'పుష్ప 2'.. ఇది అసలు నమ్మేలా ఉందా?

| ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ''పుష్ప: ది రూల్''

By - Tupaki Desk
Update: 2024-07-16 07:43 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ''పుష్ప: ది రూల్''. ఇది బ్లాక్ బస్టర్ 'పుష్ప: ది రైజ్' కు రెండో భాగం కావడంతో అభిమానుల్లో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టుగానే ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు అనూహ్య స్పందన లభించింది. కచ్ఛితంగా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం గ్యారంటీ అని భావిస్తున్న తరుణంలో.. ఈ సినిమా గురించి రోజుకో కొత్త రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

'పుష్ప 2' చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ చివరకు డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేశారు. షూటింగ్‌ ఇంకా పెండింగ్ ఉండటం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనంతటికీ దర్శకుడు సుకుమారే కారణమని, ఆయన కారణంగానే ఈ ప్రాజెక్ట్ ఆలస్యమవుతోందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఇప్పుడు సుక్కూ పని తీరుతో బన్నీ కూడా విసిగిపోతున్నారని ఓ పుకారు పుట్టుకొచ్చింది.

గత రెండేళ్లుగా సెట్స్ మీదున్నా ఇంకా 'పుష్ప: ది రూల్' చిత్రానికి సంబంధించి నెల రోజుల షూటింగ్ పెండింగ్ ఉందట. దీనికి సుకుమార్ కారణమని.. రాత్రింబవళ్ళు కష్టపడటానికి హీరో సిద్ధంగా ఉన్నా, డైరెక్టర్ రెడీగా ఉండటం లేదని రూమర్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు ప్రస్తుతానికి 'పుష్ప 2' రెగ్యులర్ షూటింగ్ కు కాస్త బ్రేక్ పడిందని, సుక్కూకి జ్వరం రావడమే కారణమని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ నిరుత్సాహానికి గురవుతున్నారని రూమర్స్ వస్తున్నాయి.

'పుష్ప 2' సినిమా ఆగస్ట్ నుండి డిసెంబరుకి మారినప్పటికీ చిత్రీకరణ ఇంకా నత్తనడకన సాగుతుండటంపై బన్నీ అసహనం వ్యక్తం చేస్తున్నారని.. ఈ సినిమా సినిమా లేట్ అవ్వడంతో అట్లీ ప్రాజెక్ట్ ను కూడా వదుకోవాల్సి వచ్చిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని.. అసలు అల్లు అర్జున్, సుకుమార్ బాండింగ్ గురించి తెలిసిన వాళ్ళెవరూ వీటిని నమ్మరని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

బన్నీ - సుకుమార్ కాంబోలో ఇప్పటి వరకూ ఆర్య, ఆర్య 2, పుష్ప చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు నాలుగో చిత్రం కోసం కలిసి పని చేస్తున్నారు.. భవిష్యత్ లో 'పుష్ప' ఫ్రాంచైజీ కొనసాగుతుందని స్వయంగా వెల్లడించారు. కాబట్టి సుక్కూ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందో అన్ని సినిమాలు చేసిన అల్లు అర్జున్ కంటే ఎక్కువ ఎవరికీ తెలియదు. ప్రతీది పర్ఫెక్ట్ గా రావాలని తపించే దర్శకుడు.. సినిమా పూర్తి చేయడానికి అనుకున్న దాని కంటే ఎక్కువ టైం తీసుకుంటారనే విషయం తెలుసు.

అందులోనూ 'పుష్ప 1' బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడంతో సెకండ్ పార్ట్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకూడదనే ఉద్దేశ్యంతోనే 'పుష్ప: ది రూల్' ను వాయిదా వేశారు. సుకుమార్ కు ఫీవర్ వచ్చి షూటింగ్ కు కాస్త విరామం ప్రకటిస్తే, దానిపై అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేస్తున్నారని అనుకోవడంలో అసలు అర్థమే లేదు. ఎందుకంటే వీరిద్దరికీ ఒకరిపై ఒకరికి ఎంత అభిమానం ఉందో గతంలో అనేక సందర్భాల్లో చాటుకున్నారు.

'పుష్ప' థ్యాంక్స్ మీట్‌ లో బన్నీ మాట్లాడుతూ.. ఎవ‌రికైనా రుణ‌ప‌డి ఉన్నానంటే అది సుకుమార్ ఒక్క‌డికే అని చెప్పి భావోద్వేగానికి లోనైన సంగతి తెలిసిందే. తన లైఫ్‌లో సుకుమార్ లేకపోతే ఈ స్టైలిష్ స్టార్‌, ఐకాన్ స్టార్ ఇవేవీ ఉండేవి కాదంటూ క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. అల్లు అర్జున్ స్పీచ్ కు అక్కడున్న సుకుమార్ కూడా ఎమోషనల్ అయ్యారు. అలానే బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ రావాలని తనకంటే సుక్కు ఎక్కువగా కోరుకున్నారని, ఈ అఛీవ్‌మెంట్‌ కు ఆయనే కారణమని బన్నీ భావోద్వేగానికి గురయ్యారు. వాళ్ళిద్దరి మధ్య అలాంటి స్నేహానుబంధం ఉంది. కాబట్టి ఇప్పుడు 'పుష్ప 2' విషయంలో వినిపిస్తున్న రూమర్లన్నీ ఒట్టి అవాస్తవాలేనని ఫ్యాన్స్ అంటున్నారు.

Tags:    
  • Pushpa2 
  • Alluarjun 
  • Sukumar 
  • Pushpatherule 
  • Tollywood 
  • Rashmika 
  • Filmindustry 
  • Pushpa2movie 
  • Pushpa2shooting 

Similar News

కాజల్ అగర్వాల్ అభిమానులు హార్ట్!

2026-11-06 19:30 GMT

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS