మ‌రి పుష్ప‌రాజ్ జ‌పాన్ వెళ్ల‌డా?

పాన్ ఇండియాలో సంచ‌ల‌న విజ‌యం సాధించిన `పుష్ప 2` జ‌పాన్ లోనూ భారీ ఎత్తున రిలీజ్ కు రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-12-04 08:41 GMT

పాన్ ఇండియాలో సంచ‌ల‌న విజ‌యం సాధించిన `పుష్ప 2` జ‌పాన్ లోనూ భారీ ఎత్తున రిలీజ్ కు రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. `పుష్ప కున్రిన్` టైటిట్ తో జ‌పాన్ లో జ‌న‌వ‌రి 16న రిలీజ్ అవుతుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ గీక్ పిక్చ‌ర్స్, ఫోచికు స్టూడియోల‌తో క‌లిసి రిలీజ్ చేస్తుంది. బ‌న్నీ న‌టించిన సినిమా జ‌పాన్ లో రిలీజ్ అవ్వ‌డం ఇదే తొలిసారి. `పుష్ప ది రైజ్` ను జ‌పాన్ లో రిలీజ్ చేయ‌క‌పోయినా? రెండ‌వ భాగానికి ఇండియా స‌హా ఇత‌ర భాష‌ల్లో వ‌చ్చిన గుర్తింపు చూసి మైత్రీ సంస్థ జ‌పాన్ రిలీజ్ కు పూనుకుంది. మ‌రి ఈ సినిమా ప్ర‌చారాన్ని జ‌పాన్ లో ప్లాన్ చేస్తున్నారా? అందుకు బ‌న్నీ హాజ‌ర‌వుతాడా? లేదా? అనే స‌దేహాలు అభిమానుల్లో ఉన్నాయి.

ముంబైలో బిజీ బిజీగా బ‌న్నీ:

ఈ నేప‌థ్యంలో అందుతోన్న సమాచారం మేర‌కు జ‌పాన్ లోనూ పెద్ద ఎత్తున ప్ర‌చార కార్య‌క్ర‌మాలు ప్లాన్ చేస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. రిలీజ్ కు ముందు నిర్వ‌హించే ఈవెంట్ లో బ‌న్నీ -సుకుమార్ త‌ప్ప‌క పాల్గొంటా ర‌ని తెలిసింది. ఈనేప‌థ్యంలోనే మేక‌ర్స్ రిలీజ్ తేదీని జ‌న‌వ‌రి 16న ప్ర‌క‌టించిన‌ట్లు తెలిసింది. ప్ర‌స్తుతం బ‌న్నీ అట్లీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. కొన్ని నెల‌లుగా ముంబైలోనే షూటింగ్ జ‌ర‌గ‌డంతో బ‌న్నీ అక్క‌డే ఉంటున్నాడు. హైద‌రాబాద్ కి రావ‌డం కూడా చాలా రేర్ గా జ‌రుగుతుంది.

జ‌పాన్ బ్యాక్ డ్రాప్ లో స‌న్నివేశాలు:

అప్ప‌టిక‌ప్పుడు వ‌ర్క్ షాప్స్ లో పాల్గొన‌డం అనంత‌రం షూటింగ్ తో క్ష‌ణం తీరిక లేకుండా ఉన్నాడు. అయితే `పుష్ప 2` జ‌పాన్ రిలీజ్ గురించి చెప్ప‌గానే ఎంతో సంతోషించాడుట‌. త‌న సినిమా కూడా అక్క‌డ రిలీజ్ అవుతుంద‌నే ఆనందాన్ని ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల వ‌ద్ద వ్య‌క్తం చేసాడుట‌. ప్ర‌చార ప‌రంగా తాను అన్ని ర‌కాలుగా అందుబాటులో ఉంటాన‌ని ప్రామిస్ చేసాడుట‌. డిసెంబ‌ర్ త‌ర్వాత కాస్త ప్రీ గా ఉంటాన‌నే విష‌యాన్ని చెప్ప‌డంతో రిలీజ్ అప్పుడు ఉండేలా ప్లాన్ చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. `పుష్ప‌2` క‌థ‌కి..జ‌పాన్ కి సినిమాలో ఓ లింక్ కూడా ఉంది. బ‌న్నీ ప‌రిచ‌య స‌న్నివేశాలు జ‌పాన్ లోనే షూట్ చేసారు. పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో వ‌చ్చే స‌న్నివేశాలు బిజినెస్ డీల్ లో భాగంగా జపాన్ తో కీల‌క‌మైన లీడ్స్ ఉన్నాయి. ఈ లీడ్స్ `పుష్ప‌2` జపాన్ రిలీజ్ కి అడ్వాంటేజ్ గా మారుతుంది.

త్వ‌ర‌లో వాళ్ల స‌ర‌స‌న బ‌న్నీ:

ఇప్ప‌టికే ప్ర‌భాస్, ఎన్టీఆర్, తార‌క్, రామ్ చ‌ర‌ణ్‌ లాంటి స్టార్ల‌కు జ‌పాన్ లో మంచి ప్యాన్ బేస్ ఏర్ప‌డిన సంగ‌తి తెలిసిందే. వాళ్ల‌కంటూ ప్ర‌త్యేక‌మైన అభిమానులున్నారు. ప్రముఖంగా ప్ర‌భాస్, తార‌క్ ల‌కు అక్క‌డ మంచి ఫాలోయింగ్ ఉంది. ఎంతో మంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ హీరోల సినిమాలు జ‌పాన్ లో రిలీజ్ అవుతు న్నాయంటే అక్క‌డ ప్ర‌త్యేక‌మైన హ‌డావుడి క‌నిపిస్తుంది. బ‌న్నీ కూడా వాళ్ల స‌ర‌స‌న చేరడం ఖాయం.

Tags:    

Similar News