• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పుష్ప 2 హిందీ బ్లాస్ట్.....

పుష్ప 2 హిందీ బ్లాస్ట్.. ఆదివారం అంతకుమించి..

| పుష్ప 2 విడుదలైన ఫస్ట్ డే నుంచి ఆదివారం వరకు చాలా ఏరియాల్లో హౌస్ ఫుల్ బోర్డులతో దర్శనమిస్తోంది.

By - Tupaki Desk
Update: 2024-12-09 09:05 GMT

అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన 'పుష్ప 2: ది రూల్' హిందీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించి, అనేక రికార్డులను తిరగరాసింది. ఆదివారం రోజున ఈ సినిమా ఊహించని స్థాయిలో కలెక్షన్లను నమోదు చేసింది. ఫస్ట్ పార్ట్ అప్పట్లో పెద్దగా ప్రమోషన్ లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయినప్పటికీ హిందీలో టోటల్ గా 100 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లు వచ్చాయి. కానీ పార్ట్ 2 మాత్రం ఆ రికార్డ్ ను రెండు రోజుల్లోనే క్రాస్ చేయడం విశేషం.


పుష్ప 2 విడుదలైన ఫస్ట్ డే నుంచి ఆదివారం వరకు చాలా ఏరియాల్లో హౌస్ ఫుల్ బోర్డులతో దర్శనమిస్తోంది. ఆదివారం ఒక్క రోజే రూ. 86 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇది హిందీ సినిమా చరిత్రలో 4వ రోజు అత్యధిక నెట్ కలెక్షన్ల రికార్డు. మాస్ బెల్ట్స్‌లో సినిమా ఆక్యుపెన్సీ అత్యంత ఉత్సాహంగా ఉండటంతో రాబోయే రోజుల్లో లెక్క మరింత ఎక్కువగా పెరిగే ఛాన్స్ ఉంది.

ఇక హిందీలో మొత్తం నాలుగు రోజులలో రూ. 291 కోట్లకు చేరుకుని, షారుఖ్ ఖాన్ జవాన్ క్రియేట్ రూ. 249 కోట్ల రికార్డును అధిగమించింది. ఈ సినిమా నాలుగు రోజులలోనే అనేక రికార్డులను తిరగరాసింది. హిందీ వెర్షన్‌లో అన్ని ప్రాంతాల్లో అత్యధిక ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్ల రికార్డును సాధించడం గమనార్హం. అలాగే, వరుసగా నాలుగు రోజుల పాటు రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన తొలి చిత్రం గానూ నిలిచింది.

ఈ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ అత్యంత వేగంగా రూ. 250 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాగా కూడా గుర్తింపు పొందింది, ఇక త్వరలోనే రూ. 300 కోట్ల మార్క్‌ను కూడా చేరుకునే అవకాశం ఉంది. హిందీ వెర్షన్ సౌత్ ఇండియాలో చాలా తక్కువ స్క్రీనింగ్ లభించినప్పటికీ, ఈ రికార్డులు సృష్టించడమే సినిమాకు ఉన్న క్రేజ్‌ను హైలెట్ చేస్తోంది. నార్త్ లో చాలా ప్రాంతాల్లో 'పుష్ప 2' అత్యధిక కలెక్షన్ల రికార్డులను తిరగరాయడమే కాకుండా, రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను సృష్టించే అవకాశం ఉంది.

ప్రత్యేకంగా ఆదివారం రోజున రూ. 80 కోట్ల మార్క్‌ను దాటడం ఈ సినిమాకు గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు. ఈ విజయంతో అల్లు అర్జున్‌ను హిందీ మార్కెట్ లో కూడా ఒక బిగ్ స్టార్‌గా నిలబెట్టింది. ఇక నుంచి ఆయన తీసుకునే సినిమాల ఎంపిక, భవిష్యత్తులో మరింత గొప్ప క్రౌడ్ పులర్‌గా నిలపడానికి కీలక పాత్ర పోషిస్తుంది. 'పుష్ప 2' సినిమాను ఇప్పుడు కేవలం ఒక సినిమాగా కాదు, ఒక ఉద్యమం అని చెప్పుకోవచ్చు.

'పుష్ప 2' సినిమా హిందీ వెర్షన్ కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి:

గురువారం: రూ. 72 కోట్లు

శుక్రవారం: రూ. 59 కోట్లు

శనివారం: రూ. 86 కోట్లు

ఆదివారం: రూ. 86 కోట్లు

మొత్తం కలెక్షన్లు: రూ. 291 కోట్లు

ఈ అరుదైన రికార్డులు తెలుగు సినిమా ప్రతిష్టను దేశవ్యాప్తంగా మరోస్థాయికి తీసుకెళ్లాయి. అల్లు అర్జున్ నటన, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. పుష్ప 2 సృష్టించిన రికార్డులు రాబోయే కాలంలో భారతీయ చిత్ర పరిశ్రమకు మరింత బూస్ట్ ఇవ్వగలవు.

Tags:    
  • Pushpa2collections 
  • Pushpa2boxoffice 
  • pushpa2records 
  • pushpacollections 
  • pushparecords 
  • alluarjun 
  • indiacollections 
  • ollections 
  • numbers 
  • revenue 
  • boxoffice 
  • boxofficerecords 
  • bunny 
  • sukumar 
  • Rashmikamandanna 
  • Jatharaepiside 
  • peelingssong 
  • kissiksong 
  • wildfire 
  • wildfirecollections 
  • Pushpa2hindicollections 

Similar News

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

Copyright @2026

Powered by Blink CMS