• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెలోడి బ్ర‌హ్మ చేరిక‌తో...

మెలోడి బ్ర‌హ్మ చేరిక‌తో డ‌బుల్ ఇస్మార్ట్

| తాజా స‌మాచారం మేర‌కు మెలోడీ బ్రహ్మ మణి శర్మ మ‌రోసారి పూరితో క‌లిసి ప‌ని చేయ‌నున్నార‌ని తెలిసింది.

By - Tupaki Desk
Update: 2023-11-24 15:54 GMT

టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాధ్ 'లైగ‌ర్' త‌ర్వాత కొంత గ్యాప్ తీస్కున్న సంగ‌తి తెలిసిందే. అత‌డు ఇప్పుడు డ‌బుల్ ఇస్మార్ట్ అనే సినిమా తీస్తున్నాడు. ఇది రామ్ న‌టించిన ఇస్మార్ట్ శంక‌ర్ కి సీక్వెల్. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన కీల‌క అప్ డేట్ అందింది.

తాజా స‌మాచారం మేర‌కు మెలోడీ బ్రహ్మ మణి శర్మ మ‌రోసారి పూరితో క‌లిసి ప‌ని చేయ‌నున్నార‌ని తెలిసింది. ఈ కలయిక బ్లాక్ బస్టర్ క‌ల‌యిక‌. పోకిరి, చిరుత, ఇస్మార్ట్ శంకర్ లాంటి చార్ట్ బ‌స్ట‌ర్ ఆల్బమ్ లు ఈ జోడీ నుంచే వ‌చ్చాయి. ఆ సినిమాల‌న్నీ బ్లాక్ బ‌స్ట‌ర్లుగా నిలిచాయి. ఈ కాంబో డబుల్ స్మార్ట్‌తో తిరిగి వస్తోంది.

ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి మ‌ణిశ‌ర్మ స్వ‌రాలు స‌మ‌కూర్చిన సంగ‌తి తెలిసిందే. ఆ చిత్రం మ్యూజికల్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు సీక్వెల్ ఖచ్చితంగా చార్ట్‌బస్టర్ ఆల్బమ్ తో రంజింప‌జేస్తుంద‌ని అంచ‌నా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. డబుల్ ఇస్మార్ట్ చిత్రంలో రామ్ పోతినేని, సంజయ్ దత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కేజీఎఫ్ 2 త‌ర్వాత బాలీవుడ్ ఖ‌ల్ నాయ‌క్ సంజయ్ దత్ ఈ చిత్రంలో ముఖ్యమైన సుదీర్ఘ నిడివి ఉన్న‌ పాత్రను పోషిస్తున్నారు. ఇండ‌స్ట్రీ ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఇది కూడా ఇత‌ర సినిమాల్లోలానే గుడ్ వ‌ర్సెస్ బ్యాడ్ కి సంబంధించిన క‌థ‌. అందువ‌ల్ల‌ రామ్ - సంజయ్ దత్ మధ్య ముఖాముఖి పోరాటాల‌తో సినిమా ర‌క్తి క‌ట్టిస్తుంద‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

రామ్, పూరీల డెడ్లీ కాంబినేషన్‌లో డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్ - ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు. పూరి జగన్నాధ్ ఒక క్రేజీ కథను రామ్ కోసం రాసార‌ని కూడా తెలుస్తోంది. పూరి త‌న‌దైన శైలిలో పూర్తిగా స్టైలిష్ అవతారాలలో స్టార్ల‌ను ప్రెజెంట్ చేస్తున్నార‌ని స‌మాచారం. ఈ సినిమాలో రామ్ పోతినేని స్టైలిష్ గా బెస్ట్ లుక్ లో క‌నిపిస్తాడు. సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో అధిక బడ్జెట్‌తో డబుల్‌ ఇస్మార్ట్‌ రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించ‌నున్నారు. డబుల్ ఇస్మార్ట్ 8 మార్చి 2024న మహా శివరాత్రికి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయాల‌నేది ప్లాన్.

Tags:    
  • Tollywood 
  • Filmindustry 
  • Doubleismart 
  • Rampothineni 
  • Purijagganadh 
  • Sanjaydutt 
  • Manisharma 
  • Music 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS