• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పూరీ మాస్టర్ ప్లాన్.....

పూరీ మాస్టర్ ప్లాన్.. రికార్డులు షేక్ అవుతాయా..?

| బెగ్గర్ సినిమాను పూరీ జగన్నాథ్ న్యూ ఎనర్జీతో చేస్తున్నాడని తెలుస్తుంది. పూరీ తన ఒకప్పటి వర్కింగ్ స్టైల్ ఎనర్జీని కూడకట్టుకుని ఈ సినిమా కోసం పనిచేస్తున్నాడట.

By - Tupaki Desk
Update: 2025-05-27 23:30 GMT

డబుల్ ఇస్మార్ట్ తో మరో డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కి నెక్స్ట్ సినిమా అంత త్వరగా దొరుకుతుందని ఎవరు అనుకోలేదు. అందులోనూ కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి తో కాంబినేషన్ కుదుతుందని అసలు ఊహించలేదు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి లెక్క కోసం సినిమాలు అసలు చేయడు. కథ నచ్చి అందులో క్యారెక్టరైజేషన్ పూర్తిగా ఎక్కితేనే అందులో తన విజువల్ ని ఊహించుకుని అప్పుడు సినిమాకు ఓకే చెబుతాడు. విజయ్ సేతుపతి సినిమా సైన్ చేశాడంటే సగం హిట్ అనే అనుకుంటారు.

అలాంటి విజయ్ సేతుపతి పూరీ జగన్నాథ్ తో బెగ్గర్ సినిమా చేయడం ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. పూరీ ఎలాంటి కథ చెబితే విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా అని చర్చించుకుంటున్నారు. విజయ్ సేతుపతి టబు ఇలా బెగ్గర్ లో క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేస్తున్నాడు పూరీ జగన్నాథ్. ఐతే ఈ సినిమా విషయంలో పూరీ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఒక పర్ఫెక్ట్ మాస్టర్ ప్లాన్ తోనే పూరీ వస్తున్నాడట.

బెగ్గర్ సినిమాను పూరీ జగన్నాథ్ న్యూ ఎనర్జీతో చేస్తున్నాడని తెలుస్తుంది. పూరీ తన ఒకప్పటి వర్కింగ్ స్టైల్ ఎనర్జీని కూడకట్టుకుని ఈ సినిమా కోసం పనిచేస్తున్నాడట. అలా ఒకప్పటి పూరీని గుర్తు చేస్తే చాలని ఫ్యాన్స్ ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్నారు. విజయ్ సేతుపతి సినిమాకు పూరీ ప్లానే అదని తెలుస్తుంది. అదే జరిగితే మాత్రం బెగ్గర్ సినిమా రికార్డులు షేక్ చేసే ఛాన్స్ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

పూరీ ఈమధ్య మ్యూజింగ్స్ తో ఆడియన్స్ కి కనెక్ట్ లో ఉన్నాడు. సినిమాలు ఫెయిల్ అయినా పూరీ మ్యూజింగ్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఆ జోష్ తోనే పూరీ విజయ్ సేతుపతి సినిమాను తెరకెక్కిస్తున్నారట. తప్పకుండా ఈ మూవీ పూరీ మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా ఉంటుందని చెప్పొచ్చు. పూరీ కంబ్యాక్ ఇస్తే మాత్రం ఆడియన్స్ మాత్రమే కాదు స్టార్స్ కూడా ఖుషి అవుతారని చెప్పొచ్చు. మరి పూరీ నిజంగానే విజయ్ సేతుపతి బెగ్గర్ తో తిరిగి ఫాం లోకి వస్తాడా లేదా ఈమధ్య సినిమాల మాదిరిగానే హడావిడి తప్ప రిజల్ట్ అదే అని అనిపించుకుంటాడా అన్నది చూడాలి.

Tags:    
  • PuriJagannadh 
  • VijaySethupathi 
  • BeggerMovie 
  • Tollywood 
  • Kollywood 
  • VijaySethupathiFans 

Similar News

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS