పూరి మ్యూజింగ్స్: భార్యకు ఐదేళ్ల తర్వాత భర్తలో మన్మధుడు కనిపించడు!
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తన `పూరి మ్యూజింగ్స్`లో దంపతుల మధ్య సెక్సువల్ డిజైర్ గురించి ఎంతో హేతుబద్ధంగా, ఎక్కడా మొహమాటం లేకుండా విశ్లేషించారు.;
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తన `పూరి మ్యూజింగ్స్`లో దంపతుల మధ్య సెక్సువల్ డిజైర్ గురించి ఎంతో హేతుబద్ధంగా, ఎక్కడా మొహమాటం లేకుండా విశ్లేషించారు. మనుషులందరం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన వాస్తవం ఏమిటంటే.. సె**క్సువల్ డిజైర్ లేదా లైంగిక కోరిక అనేది ప్రారంభంలో ఉన్నంత గమ్మత్తుగా, ఉత్సాహంగా ఎల్లప్పుడూ ఉండదు. కాలం గడిచేకొద్దీ అది సహజంగానే తగ్గుముఖం పడుతుంది. కొత్తగా పెళ్లయిన జంట మొదటిసారి శృంగారంలో పాల్గొన్నప్పుడు అది ఒక అద్భుతమైన మధురానుభూతిని కలిగిస్తుంది. ఆ సమయంలో మెదడులో డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్ విడుదలవ్వడం, టెస్టోస్టిరాన్ స్థాయిలు పెరగడం వల్ల విపరీతమైన ఎగ్జైట్‌మెంట్ కలుగుతుంది. అయితే అదే శృంగారం రెండేళ్ల తర్వాత ఒక దినచర్యగా మారిపోతుంది. అది ఉన్నా లేకపోయినా పర్వాలేదనే స్థితికి భాగస్వాములు చేరుకుంటారు. ఐదేళ్లు గడిచేసరికి ఆ ఆసక్తి పూర్తిగా తగ్గిపోయి.. ఒకప్పుడు మన్మథుడిలా కనిపించిన భర్త కూడా భార్యకు సాదాసీదాగా అనిపించే అవకాశం ఉంటుంది.
సమాజంలో లైంగిక కోరికలను ఒక పాపంగా లేదా రహస్యంగా దాచాల్సిన విషయంగా చూసే ధోరణిని పూరి గతంలోను ఓసారి పూరి మ్యూజింగ్స్ లో తీవ్రంగా తప్పుబట్టారు. సెక్సువల్ డిజైర్ అనేది ఆకలి, నిద్ర లాంటి ఒక సహజమైన శారీరక అవసరమని, దీనిని బలవంతంగా అణచివేయడం వల్ల మనిషి తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతారని ఆయన వివరించారు. దీనిని కేవలం ఒక జంతు ప్రవృత్తిగా చూడకూడదని, అది ఒక గొప్ప సృజనాత్మక శక్తి అని పూరి అభిప్రాయపడ్డారు.
ప్రకృతి ప్రతి జీవిలోనూ సంతానోత్పత్తి ద్వారా జీవకోటి మనుగడ సాగించడం కోసం ఈ కోరికను నిక్షిప్తం చేసిందని, దీనివల్లే ఈ ప్రపంచం కొనసాగుతోందని పూరి గుర్తు చేశారు. లైంగికతను అసహ్యించుకోవడం అంటే మన ఉనికిని మనం తక్కువ చేసుకోవడమేనని విశ్లేషించారు. మన సమాజం నిర్మించిన నైతిక చట్టాలు, కట్టుబాట్లు ఈ సహజ సిద్ధమైన కోరికను ఒక నేరంగా చిత్రీకరిస్తున్నాయని ఆయన విమర్శించారు. సెక్స్ గురించి బహిరంగంగా మాట్లాడటాన్ని తప్పుగా భావించే వాతావరణం వల్ల..మనుషులు తమ కోరికలను లోపలే అణచుకుని మానసిక రుగ్మతలకు లోనవుతున్నారని.. అందుకే లైంగికత విషయంలో పరిణతి చెందిన ఆలోచనలు అవసరమని ఆయన సూచించారు.
వైద్య నిపుణుల అభ్రిపాయం కూడా ఇదే:
సెక్సువల్ డిజైర్ అనేది మనిషికి ఉత్సాహాన్నిచ్చే ఒక గొప్ప ఇంధనం వంటిదని వైద్య నిపుణులు (సె*క్సాలజిస్టులు) అభివర్ణించారు. ఈ కోరికను గౌరవించినప్పుడు అది మనిషిని మరింత సజీవంగా ఉంచుతుందని.. దీనిని ఒక శాస్త్రంగా చూడాలే తప్ప వికారంగా చూడకూడదని వివరించారు. మనల్ని మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవడంలో భాగమే మన లైంగిక అవసరాలను కూడా అర్థం చేసుకోవడం. లైంగికత పట్ల అవగాహన పెంచుకోవడం వల్ల మనుషుల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని.. అపార్థాలకు తావుండదని పలువురు నిపుణులు నొక్కి చెప్పారు.
లైంగిక కోరిక మన శరీరంలో ఒక భాగం. దీని చుట్టూ ఉన్న అనవసరపు రహస్యాలను.. సిగ్గును పక్కన పెట్టి.. అది ఒక సహజ ప్రక్రియ అని గుర్తించినప్పుడే మనిషి మానసిక స్వేచ్ఛను పొందగలడు. ప్రతీ మనిషి తనలోని ఈ సహజ ప్రవృత్తిని అంగీకరించినప్పుడే సమాజంలో ఉన్న అనేక సామాజిక - మానసిక సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని శృంగార నిపుణులు చెబుతున్నారు. పూరి జగన్నాథ్ లాంటి ప్రముఖులు లైంగికతపై చేసే విశ్లేషణలు అర్థవంతమైనవని అంగీకరించాలి. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో పూరి తెరకెక్కిస్తున్న చిత్రం విడుదలకు రావాల్సి ఉంది. ఈ చిత్రానికి `స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్` అనేది టైటిల్. ఈ సినిమా షేపప్ అవుతున్న విధానంపైనా, దర్శకుడు పూరి పైనా సేతుపతి ఇప్పటికే ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. కొంత గ్యాప్ తర్వాత పూరి సరైన బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో పని చేస్తున్నారు.