టెలిగ్రామ్ స్కామ్.. అలెర్ట్ చేసిన తెలుగు బ్యూటీ..
తెలుగు బ్యూటీ, హీరోయిన్ పూజిత పొన్నాడ గురించి అందరికీ తెలిసిందే.;
తెలుగు బ్యూటీ, హీరోయిన్ పూజిత పొన్నాడ గురించి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ.. అప్డేట్స్ అండ్ పిక్స్ షేర్ చేస్తుంటుంది. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న అమ్మడు.. తన పేరును ఉపయోగించి ప్రజలను మోసం చేస్తున్న టెలిగ్రామ్ స్కామ్ గురించి తాజాగా మాట్లాడింది.
స్కామర్స్ పంపుతున్న మెసేజెస్ స్క్రీన్ షాట్స్ ను షేర్ చేసిన పూజిత.. ముగ్గురు ఇన్ స్టాగ్రామ్ అకౌంట్స్ ఫాలో అయితే రూ.180 డబ్బులు ఇస్తామని మోసం చేస్తున్నట్లు తెలిపారు. అస్సలు తాను టెలిగ్రామ్ లో లేనని క్లారిటీ ఇచ్చారు. ఇలా చేయమని ఎవరినీ ఎప్పుడూ అడగలేదని వెల్లడించారు.
"డబ్బు కోసం నన్ను ఫాలో అవ్వమని టెలిగ్రామ్ లో సందేశాలు వస్తున్నాయని నాకు చాలా మెసేజ్ లు వస్తున్నాయి. ఇలాంటి స్కామ్ లా బారినపడొద్దు. నేను టెలిగ్రామ్‌లో లేను. దయచేసి ఫ్రీ గా వచ్చిన డబ్బుల కోసం వెంపర్లాడొద్దు. ఎవరూ మోసపోవద్దు" అంటూ పూజిత పొన్నాడ ఇప్పుడు సోషల్ మీడియాలో తెలిపారు.
ఇక పూజిత కెరీర్ విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జన్మించిన ఆమె, తన తండ్రి జాబ్ రీత్యా ఢిల్లీ, చెన్నై వంటి నగరాల్లో పెరిగింది. చెన్నైలోని SRM ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తిచేశారు. ఆ తర్వాత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో ఉద్యోగం చేశారట.
2015లో ఉప్మా తినేసింది అనే షార్ట్ ఫిల్మ్ తో సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన పూజిత.. 2016లో ఊపిరి మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో గ్యాలరీ మేనేజర్ పాత్ర పోషించారు. 2018లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ అయిన రంగస్థలం చిత్రంలో ఆది పినిశెట్టి ప్రియురాలి పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
2019లో సీనియర్ నటుడు రాజశేఖర్ కల్కి మూవీలో ఎస్ఐ పాత్రలో మెప్పించారు. హ్యాపీ వెడ్డింగ్, రాజు గాడు, మిస్ ఇండియా, రావణాసుర, ఓదెల రైల్వే స్టేషన్ లో కనిపించారు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీతోపాటు. మరిన్ని సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తున్నారు. మరి ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.