• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహేష్ ఫారిన్ ట్రిప్స్.....

మహేష్ ఫారిన్ ట్రిప్స్.. నిర్మాత ఏమన్నారంటే

| సూపర్ స్టార్ మహేశ్​ బాబు - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ గుంటూరు కారం.

By - Tupaki Desk
Update: 2023-10-08 06:18 GMT

సూపర్ స్టార్ మహేశ్​ బాబు - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ గుంటూరు కారం. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్​పై సూర్య నాగదేవర వంశీ నిర్మిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఈ సినిమాపై వచ్చిన రూమర్స్ మరే ఇతర చిత్రంపై వచ్చి ఉండవనే చెప్పాలి. హీరోయిన్, సంగీత దర్శకుడు, రిలీజ్ డేట్స్ వాయిదా, షూటింగ్ క్యాన్సిల్, మహేశ్ ఫారెన్ ట్రిప్, కథలో మార్పులు.. అబ్బో ఇలా ప్రతీ విషయంపై ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంది.

అయితే తాజాగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న నిర్మాత నాగవంశీ వీటన్నిటికీ క్లారిటీ ఇస్తూ వస్తున్నాడు. ఇందులో భాగంగానే.. షూటింగ్ తరచుగా క్యాన్సిల్ అవ్వడం​​ - సినిమా చిత్రీకరణ మధ్యలో మహేశ్ ఫారెన్ ట్రిప్స్​ వెళ్లడం గురించి మాట్లాడాడు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆయనే స్వయంగా పోస్ట్ చేశాడు. ఆర్టికల్సు, ప్రెస్​ మీట్స్​లో అడగడాలు.. అన్నింటికీ ఆన్సర్ ఇదే అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చాడు

మహేశ్ సినిమా మొదలయ్యే సయయానికి ముందే మేడమ్​ మాకు చెబుతారు. మహేశ్ ఫలానా సమయానికి ఫలానా చోటుకు వెళ్తారు. షూటింగ్ క్యాన్సిల్​ అయిందనో ఆయన విదేశాలకు వెళ్లరు. అలాగని ఆయన ఫారెన్​ వెళ్లారనో షూటింగ్ క్యాన్సిల్ అవ్వదు. షూటింగ్ షెడ్యూల్స్​ వేసుకున్నప్పుడే ఇవన్నీ ప్లాన్ అయిపోతాయి. ఆయన వేసవి సెలవులకు, పుట్టినరోజులకు వెళ్తానని ముందే చెబుతారు. ఎందుకుంటే పిల్లలతో కలిసి గడపడానికి ఇక్కడ కుదరదు. అందుకే ఆయన విదేశాలకు వెళ్లిపోతారు. ప్రతి ఏడాది ఇది ఉండేదే అని నాగ వంశీ క్లారిటీ ఇచ్చాడు.

అంతకుముందు ఇంటర్వ్యూలో.. ఈ చిత్రం సంక్రాంతికి కచ్చితంగా వస్తుందని, నాన్ రాజమౌళి సినిమా కలెక్షన్స్ రికార్డుల్లో గుంటూరు కారం మొదటి ప్లేస్ దక్కించుకుంటుందని ధీమా కూడా వ్యక్తం చేశాడు. అలానే మరో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టైం అండ్ క్వాలిటీ గురించి ఆలోచించి గుంటురు కారం సినిమాను కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ చేస్తున్నట్లు, తమిళంలో లేదా ఇతర భాషల్లో డబ్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చాడు.

ఇకపోతే ఈ గుంటూరు కారం సినిమాలో యంగ్ బ్యూటీస్​ శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెన్సేషన్ మ్యూజిక్​ డైరెక్టర్​ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇంకా పలువురు సీనియర్ టెక్నీషియన్స్​ సినిమా కోసం పని చేస్తున్నారు.

Tags:    
  • Nagavamsi 
  • Gunturkarammovie 
  • Maheshbabu 
  • Tollywood 
  • Movienews 

Similar News

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

Copyright @2026

Powered by Blink CMS