షోల్డర్ లెస్ అందాలతో గత్తర లేపుతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్!
ఈ క్రమంలోనే తాజాగా మరో లేటెస్ట్ ట్రెండీ ఔట్ఫీట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. షోల్డర్ లెస్ ఫ్రాక్ ధరించి తన అందాలతో మరింత హొయలు పోయింది.
ప్రముఖ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రం ఓజీ. ఈ సినిమాలో కన్మణి పాత్రతో పవన్ కళ్యాణ్ సరసన తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ప్రియాంక మోహన్. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ హీరోయిన్ గా మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ ఒకవైపు వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫాలోవర్స్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు ఒకవైపు ట్రెడిషనల్ గా మరొకవైపు గ్లామర్ టచ్ తో అటు ఫ్యాషన్ ప్రియులను కూడా ఆకర్షిస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా మరో లేటెస్ట్ ట్రెండీ ఔట్ఫీట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. షోల్డర్ లెస్ ఫ్రాక్ ధరించి తన అందాలతో మరింత హొయలు పోయింది. ఖారా కపాస్ బ్రాండ్ కి చెందిన ఎల్ వేర్ ఫాల్ 25 కలెక్షన్స్ నుండి ఎంపిక చేసిన స్ట్రక్చర్డ్ ఆక్స్ఫర్డ్ కాటన్ తో డిజైన్ చేసిన నుబ్రా మ్యాక్సీ డ్రెస్ ధరించి తన డ్రెస్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది. మిరమిట్లు గొలిపే ఎరుపు రంగు పూల ప్రింట్లతో డిజైన్ చేసిన ఈ షోల్డర్ లెస్ బ్లాక్ కలర్ మ్యాక్సీ డ్రెస్ ఈమె అందాన్ని ప్రకటింపు చేసింది. ఇకపోతే ఈమె ధరించిన ఈ డ్రెస్ మార్కెట్ రేటు ప్రకారం సుమారుగా రూ.9,770 నుండి రూ.10,855 మధ్య ఉంటుంది. డ్రై క్లీన్ మాత్రమే చేయగలిగే ఇలాంటి లేటెస్ట్ ఔట్ఫిట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. మొత్తానికి అయితే ప్రియాంక షేర్ చేసిన ఈ లేటెస్ట్ అవుట్ ఫిట్ చూపరులను విపరీతంగా అలరిస్తోంది.
ఇకపోతే ఈ మధ్యకాలంలో ప్రియాంక మోహన్ రేంజ్ గ్లోబల్ స్థాయికి పాకి పోయిందని చెప్పాలి. వరుసగా పలు చిత్రాలు చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న ఈమెను కొరియా టూరిజం ఆర్గనైజేషన్ కొరియా టూరిజంకి గౌరవ రాయబారిగా నియమించింది. ముఖ్యంగా కొరియన్ సంస్కృతిని అనుభవ పూర్వక ప్రయాణాలను ప్రోత్సహించడానికి, సౌత్ ఇండియాలో ప్రియాంక మోహన్ కి ఉన్న ప్రజాదారణను ఉపయోగించుకొని.. కొరియా టూరిజంను అభివృద్ధి చెందించడం కోసం దక్షిణ కొరియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ఎంపిక ఈమె నటించిన క్రాస్ కల్చరల్ నెట్ ఫ్లిక్స్ ప్రాజెక్ట్ మేడ్ ఇన్ కొరియా తర్వాతే ఇండియా -దక్షిణ కొరియా మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడానికి జరిగినట్లు సమాచారం.
ఇక ప్రియాంక మోహన్ చిత్రాల విషయానికి వస్తే.. మేడ్ ఇన్ కొరియా తరువాత తమిళ యాక్షన్ చిత్రం అరసన్ తో పాటు కన్నడ ప్రాజెక్టు 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ వంటి చిత్రాలలో ఈమె నటిస్తోంది.