రెడ్ డ్రెస్ లో హొయలు పోతున్న తెలుగమ్మాయి!

ప్రియాంక జవాల్కర్.. నటిగా అరంగేట్రం చేయడాని కంటే ముందు టాప్ MNC కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసింది. ఈమె సినీ రంగుల ప్రపంచంలో నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని జాబ్ ని కూడా వదిలేసింది.;

Update: 2026-01-02 10:44 GMT

ప్రముఖ తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందంతో, నటనతో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె ఆంధ్రప్రదేశ్ అనంతపురంకు చెందినవారు. 1992 నవంబర్ 12న ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురంలో మరాఠీ మాట్లాడే కుటుంబంలో జన్మించారు. అనంతపురంలో LRG స్కూల్ నుండి తన స్కూల్ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన ఈమె.. ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ పట్టా అందుకుంది. ఇక హైదరాబాదులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుండి ఫ్యాషన్ డిజైనింగ్ లో డిప్లొమా కూడా పూర్తి చేసింది ప్రియాంక.

 

తన అందంతో అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈమధ్య కాలంలో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన ఈమె తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది ప్రియాంక జవాల్కర్. రెడ్ డ్రెస్ ధరించిన ఈమె అందులో అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కొత్త సంవత్సరం సందర్భంగా హాట్ అందాలు వలకబోస్తూ అభిమానులను సర్ప్రైజ్ చేసింది. మొత్తానికైతే చాలా రోజుల తర్వాత గ్లామర్ ట్రీట్ ఇచ్చింది ప్రియాంక జవాల్కర్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.

 

ప్రియాంక జవాల్కర్.. నటిగా అరంగేట్రం చేయడాని కంటే ముందు టాప్ MNC కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసింది. ఈమె సినీ రంగుల ప్రపంచంలో నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని జాబ్ ని కూడా వదిలేసింది. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె మొదట్లోనే మంచి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంది. అందం, అభినయంతో ఆడియన్స్ హృదయాలు దోచుకున్న ప్రియాంకకు అనుకున్నంత స్థాయిలో అవకాశాలు లభించడం లేదు ఇక ఇప్పుడు సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది.

 

ఇకపోతే టాక్సీవాలా సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో పాపులారిటీ కూడా దక్కించుకుంది. ఆ తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాతో కూడా మరో విజయాన్ని అందుకుంది. ఈమె నటించిన సినిమాలు మంచి విజయం అందుకుంటున్నాయి కానీ అనుకున్నంత స్థాయిలో అవకాశాలైతే తలుపు తట్టడం లేదు. ఇక ఇప్పుడు హీరోయిన్ గా అవకాశాలు లేకపోయేసరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు కూడా చేయడానికి సిద్ధమయ్యింది.

కనీసం ఇప్పటికైనా ప్రియాంకతో అవకాశాలు తలుపుతడతాయేమో చూడాలి. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటే తన అందాలతో అభిమానులను మెస్మరైజ్ చేయడమే కాకుండా ఫాలోవర్స్ ని కూడా పెంచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. మరి ఇప్పటికైనా సరైన అవకాశం లభించాలని అభిమానులు చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News