మరోసారి అంతర్జాతీయ వేదికపై ప్రియాంక.. ఎందుకంటే?
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మరోసారి ఇంటర్నేషనల్ స్టేజ్ పై మెరవనున్నారు. జనవరి 11న లాస్ ఏంజిల్స్ లో జరగబోయే 83వ గోల్డెన్ గ్లోబ్ 2026లో ప్రియాంక ప్రెజెంటర్ గా కనిపించనున్నారు.;
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మరోసారి ఇంటర్నేషనల్ స్టేజ్ పై మెరవనున్నారు. జనవరి 11న లాస్ ఏంజిల్స్ లో జరగబోయే 83వ గోల్డెన్ గ్లోబ్ 2026లో ప్రియాంక ప్రెజెంటర్ గా కనిపించనున్నారు. ఈ గ్రాండ్ ఈవెంట్ లో ప్రియాంక తో పాటూ పలు హాలీవుడ్ స్టార్స్ కూడా అవార్డులు అందచేయనున్నారు. ఈ వీకెండ్ లో గోల్డెన్ గ్లోబ్స్ 2026 జరగనుండగా తాజాగా నిర్వాహకులు ప్రెజెంటర్ల లిస్ట్ ను ఎక్స్ అకౌంట్ లో షేర్ చేశారు.
ఈ ప్రెజెంటర్ లైనప్ లో మిలే సైరస్, పమేలా ఆండర్సన్, మెకాలే కల్కిన్, ఓర్లాండో బ్లూమ్, మెలిస్సా మెక్కార్తీ, క్వీన్ లతీఫా, స్నూప్ డాగ్, అమండా సెయ్‌ఫ్రైడ్, అయో ఎడెబిరి, అనా డి అర్మాస్, కోల్మన్ డొమింగో, క్రిస్ పైన్, డకోటా ఫానింగ్, డేవ్ ఫ్రాంకో, డయాన్ లేన్, హైలీ స్టెయిన్ ఫెల్డ్, జెన్నిఫర్ గార్నర్, జాసన్ బాట్‌మాన్, జో కీరీ, జస్టిన్ హార్ట్లీ, జుడ్ అపాటో, కేథరిన్ హాన్, కెవిన్ బేకన్, కీగన్- మైఖేల్ కీ, కైరా సెడ్‌విక్, కెవిన్ హార్ట్, లాలిసా మనోబాల్ లాంటి ప్రముఖ హాలీవుడ్ స్టార్ల పేర్లు కూడా ఉన్నాయి.
జనవరి 11న గోల్డెన్ గ్లోబ్స్
ఈ ఇయర్ జరిగే ఈ ఈవెంట్ ఈటీ టైమ్ ప్రకారం రాత్రి 8 గంటల నుంచి 11 గంటల వరకు సీబీఎస్ ఛానెల్ లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. దీంతో పాటూ పారామౌంట్ +లో కూడా ఈ ఈవెంట్ స్ట్రీమింగ్ కానుంది. ఈ కార్యక్రమం జనవరి 11న లాస్ ఏంజిల్స్ లో బెవర్లీ హిల్టన్ లో జరగనుంది. ఇక ఇందులో నామినేషన్ల విషయానికొస్తే పలు సినిమాలున్నాయి.
పాల్ థామస్ ఆండర్సన్ యొక్క వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ మూవీ 9 నామినేషన్లలో ముందంజలో ఉండగా, జోచిమ్ టైర్ యొక్క సెంటిమెంటల్ వాల్యూ 8 నామినేషన్లతో సెకండ్ ప్లేస్ లో ఉంది. ర్యాన్ కూగ్లర్ యొక్క సిన్నర్స్ 7 నామినేషన్లు, క్లో జావో హామ్నెట్ 6 నామినేషన్లు కలిగి ఉంది. టీవీ విభాగంలో ది వైట్ లోటస్ ఆరు నామినేషన్లతో ముందంజలో ఉంది. అడోల్‌సెన్స్ 5 నామినేషన్లు, ఓన్లీ మర్డర్స్ ఇన్ ది బిల్డింగ్, సెవెరెన్స్ నాలుగు నామినేషన్లు పొందాయి. ఇక ప్రియాంక కెరీర్ విషయానికొస్తే ఆమె చేతిలో ప్రస్తుతం ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి అనే సినిమా ఉంది. దీంతో పాటూ ది బ్లఫ్ లో కూడా ప్రియాంక నటిస్తున్నారు. ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది.