SSMB29 నటి పచ్చ నెక్లెస్‌పైనే కళ్లన్నీ
న్యూయార్క్ మెట్ గాలా -2025 ఈవెంట్లో భారతీయ సెలబ్రిటీల హంగామా గురించి తెలిసిందే. ఈవెంట్లో ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ స్పెషల్ లెహంగా, పచ్చ రంగు వజ్రాల నెక్లెస్ ప్రధానంగా హైలైట్ అయ్యాయి.;
న్యూయార్క్ మెట్ గాలా -2025 ఈవెంట్లో భారతీయ సెలబ్రిటీల హంగామా గురించి తెలిసిందే. ఈవెంట్లో ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ స్పెషల్ లెహంగా, పచ్చ రంగు వజ్రాల నెక్లెస్ ప్రధానంగా హైలైట్ అయ్యాయి. ఇషా ధరించిన కార్టియర్ నెక్లెస్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది తన తల్లి నీతా అంబానీ ధరించే నెక్లెస్.
ఇప్పుడు ప్రియాంక చోప్రా ధరించిన పచ్చ నెక్లెస్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈవెంట్లో అత్యంత ఖరీదైన ఆభరణాలు ధరించి సందడి చేసిన వారిలో పీసీ కూడా ఉంది. మెట్ గాలా 2025 వేడుకల్లో ప్రియాంక చోప్రా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యుఎస్ ఇన్‌ఫ్లుయెన్సర్ జూలియా చాఫ్ ఒక వీడియోని ఇన్ స్టాలో షేర్ చేసి.. అందులో ప్రియాంక నెక్లెస్ వివరాలను హైలైట్ చేసింది. వీడియోలో నీతా అంబానీ నెక్టెస్, ప్రియాంక చోప్రా నెక్లెస్ రెండూ హైలైట్ గా కనిపించాయి. 2024లో జామ్ నగర్ లోని ఓ భారీ ఈవెంట్లో నీతా అంబానీ పచ్చ నెక్లెస్ ధరించారని, పీసీ ధరించిన పచ్చల హారం ఇంచుమించు దానిని పోలి ఉందని ప్రభావశీలి ప్రశంసించారు.
ప్రియాంక చోప్రా 2025 మెట్ గాలాలో ఒలివియర్ రౌస్టింగ్ దుస్తుల్లో తళుకుబెళుకులు ప్రదర్శించింది. ఇంతకుముందు నల్ల పోల్కా డాట్స్ ఉన్న తెల్లటి దుస్తుల్లో కనిపించిన పీసీ ఆ తరవాత రకరకాల డిజైనర్ దుస్తుల్లో సందడి చేసింది. పీసీ ధరించిన ఆభరణాలలో పచ్చతో కూడిన పెద్ద వజ్రాల బల్గారి నెక్లెస్ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రియాంక 241-క్యారెట్ల పచ్చల హారం ఫోటోలు వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో సందడి చేస్తున్నాయి.
కొత్త బల్గారీ పాలీక్రోమా హై జ్యువెలరీ కలెక్షన్ కు పీసీ మెట్ గాలా ఈవెంట్లో ప్రచారం చేసింది. బ్రాండ్ అంబాసిడర్ ప్రియాంక చోప్రా ధరించినది `మాగ్నస్ ఎమరాల్డ్ నెక్లెస్` అని బల్గారీ కంపెనీ ఇన్ స్టాలో పేర్కొంది. 241.06 క్యారెట్ల ఎమరాల్డ్‌తో ఈ నెక్లెస్ ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత సున్నితమైన విలువైన రాళ్లలోని ఒకదానిని అమర్చి రూపొందించాం.. అని తెలిపింది. మెట్ గాలా ఈవెంట్ లో ప్రియానిక్ జంట సందడి చేసిన ఫోటోలు కూడా ఇప్పటికే వైరల్ అయ్యాయి. ఈ జంట మెట్ గాలాకు హాజరు కావడం ఇది వారి మొదటిసారి కాదు. 2017 నుంచి దీనిని కొనసాగిస్తున్నారు. నాలుగోసారి మెట్ గాలాలో ఈ జంట ఫోజులిచ్చింది. మెట్ గాలా నుంచి తిరిగి రాగానే పీసీ మహేష్ తో కలిసి ఎస్.ఎస్.ఎం.బి 29 షూటింగ్ షెడ్యూల్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది.