కన్యత్వంపై నోరు జారిన SSMB29 హీరోయిన్?
కన్యను భార్యగా వెతకకండి. మంచి మర్యాద ఉన్న స్త్రీని పొందండి. కన్యత్వం ఒక రాత్రిలో ముగుస్తుంది కానీ మర్యాదలు శాశ్వతంగా ఉంటాయి;
ప్రియాంక చోప్రా జోనాస్.. పరిచయం అవసరం లేని పేరు ఇది. ఇటీవల దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి- మహేష్ కాంబినేషన్ సినిమా SSMB29 లో నటిస్తూ, అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇలాంటి సమయంలో ప్రియాంక చోప్రా కన్యత్వం (వర్జినిటీ) పై తప్పుడు కూత కూసింది! అంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగిపోతోంది. అసలింతకీ ప్రియాంక చోప్రా పేరుతో ముడిపడి ఉన్న ఈ వివాదం పూర్వాపరాల్లోకి వెళితే.. తెలిసిన సంగతులివి.
``కన్యను భార్యగా వెతకకండి. మంచి మర్యాద ఉన్న స్త్రీని పొందండి. కన్యత్వం ఒక రాత్రిలో ముగుస్తుంది కానీ మర్యాదలు శాశ్వతంగా ఉంటాయి`` అని పీసీ కోట్ చేసినట్టుగా ప్రచారం సాగుతోంది. ప్రియాంక చోప్రా జోనాస్‌కు ఆపాదిస్తూ, ఈ నకిలీ కోట్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పుడు చోప్రా దీనిని బహిరంగంగా ఖండించింది. ది బ్రీఫ్ ఇండియా అనే సోషల్ మీడియా పేజీ నుండి ఒక పోస్ట్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేసి... ఇది తాను షేర్ చేసిన కోట్ కాదని తెలిపింది. సోషల్ మీడియాలో ప్రచురితమయ్యే తప్పుడు సమాచారానికి బలైపోవద్దని ప్రజలను కోరారు.
ఇది నేను కాదు.. నా కోట్ లేదా నా వాయిస్ కాదు.. ఆన్‌లైన్‌లో ప్రతిదీ నిజం కాదు.. నకిలీ కంటెంట్‌ను సృష్టించడం వైరల్ అవ్వడానికి సులభమైన మార్గం`` అని అన్నారు. ``నాకు సంబంధించిన ప్రతిదీ మీరు స్పష్ఠంగా చెక్ చేసుకోండి. నా పేరు ఉపయోగించే తప్పుడు లింకులను క్లిక్ చేయవద్దు.. నమ్మొద్దు`` అని పీసీ కోరింది.
ప్రియాంక చోప్రా, ఇద్రిస్ ఎల్బా, జాన్ సెనా ప్రధాన తారాగణంగా నటించిన `హెడ్స్ ఆఫ్ స్టేట్` విడుదలకు సిద్ధమైంది. ఇటీవల న్యూయార్క్ ప్రీమియర్‌కు పీసీ హాజరయ్యారు. వెండి తళుకుల డిజైనర్ ఫ్రాకులో నగరవాసులకు మతులు చెడగొట్టింది. హెడ్స్ ఆఫ్ స్టేట్ చిత్రం జూలై 2న విడుదల కానుంది.