తనపై తానే సెటైర్ వేసుకున్న గ్లోబ‌ల్ బ్యూటీ!

గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో చెప్పాల్సిన ప‌నిలేదు.

Update: 2026-07-31 11:30 GMT

గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో చెప్పాల్సిన ప‌నిలేదు. ఎక్కువ‌గా సినిమా విశేషాల కంటే వ్య‌క్తిగ‌త విష‌యాలు షేర్ చేసి అభిమానుల్ని అల‌రిస్తుంటారు. కానీ ఈసారి ఆ సంగ‌త‌లు ప‌క్క‌న బెట్టి ఓ సినిమా కార‌ణంగా 22 ఏళ్లు వెన‌క్కి వెళ్లారు. ఓసారి ఆ వివ‌రాల్లోకి వెళ్తే.. పీసీ నటించిన క్లాసిక్ కామెడీ చిత్రం `ముజ్సే షాదీ కరోగి` విడుదలై 22 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పీసీ పంచు కున్న జ్ఞాపకాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆ సినిమా రోజులను గుర్తుచేసుకుంటూ షేర్ చేసిన ఫొటో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ హీరోలుగా డేవిడ్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటించి ప్రేక్షకులను మెప్పించారు. 2004లో విడుదలైన సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇందులో పాటలు, కామెడీ సీన్లు ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తిండిపోయాయి. ఈ సినిమా వచ్చి రెండు దశాబ్దాలు దాటినా? అప్పట్లో సాగిన షూటింగ్ అనుభవాలను ప్రియాంక ఎంతో సరదాగా గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా తన పాత్రకు సంబంధించిన ఓ పాత స్టిల్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఆ కాలం నాటి ఫ్యాషన్ ట్రెండ్స్‌పై చమత్కారంగా స్పందించారు.

2004 నాటి రోజుల్లో తాను వేసుకున్న సన్నని కనుబొమ్మల (థిన్ ఐబ్రోస్) స్టైల్‌ను చూసి స్వయంగా నవ్వుకున్నారు. ఆ కాలంలో ఆ ట్రెండ్ చాలా పాపులర్ అని.. కానీ ఇప్పుడు ఆ ఫొటో చూస్తుంటే చాలా నవ్వు వస్తోందని సరదాగా పేర్కొన్నారు. ఆ కాలంలో సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని సరదా ముచ్చట్లను కూడా అభిమానులతో పంచు కున్నారు. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్‌లతో కలిసి పనిచేయడం అప్పట్లో గొప్ప అనుభూతి అని, ఆ సెట్స్‌లో జరిగిన అల్లరిని ఎప్పటికీ మచిపోలేనని తెలిపారు. 'ముజ్సే షాదీ కరోగి' చిత్రం తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిందని.. అప్పట్లో ప్రేక్షకులు తన పాత్రకు ఇచ్చిన ఆదరణ మరువలేనిదని ప్రియాంక భావోద్వేగానికి గురయ్యారు.

ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌గా హాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా ఇలా తన బాలీవుడ్ తొలి రోజుల జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా గుర్తుచేసుకోవడం అభిమానులకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. నాటి జ్ఞాపకాలను రీకాల్ చేస్తూ పీసీ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవ్వ‌డంతో అభిమానులు కూడా ఆ సినిమా విశేషాలను కామెంట్ల రూపంలో పంచుకుంటున్నారు. మొత్తానికి రెండు దశాబ్దాల క్రితం వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమా జ్ఞాపకాలను తిరిగి పంచుకోవ‌డం.. అప్పట్లో ఉన్న ఫ్యాషన్ ట్రెండ్స్‌పై జోకులు వేసుకోవడం ప్రియాంక డౌన్-టు-ఎర్త్ నేచర్‌కు నిదర్శనంగా నిలుస్తోంది. కాలం ఎంత మారినా? నాటి మధుర జ్ఞాపకాలు మాత్రం అలాగే నిలిచిపోతాయని ఈ సంఘటన మరోసారి రుజువు చేస్తుంది.

Tags:    

Similar News