ఎన‌ర్జిటిక్ స్టార్ తో 'ఓజీ' భామా?

ప్రియాంక మోహ‌న్ మంచి పెర్పార్మ‌ర్ అని తొలి సినిమాతోనే నిరూపించింది. అటుపై శ‌ర్వానంద్ కు జోడీగా న టించిన `శ్రీకారం` లోనూ అల‌రించింది.;

Update: 2025-10-28 23:30 GMT

చెన్నై బ్యూటీ ప్రియాంక అరుల్ మోహ‌న్ ప‌రిచ‌యం అస‌వ‌రం లేని పేరు. నాని హీరోగా న‌టించిన `గ్యాంగ్ లీడ‌ర్` తో ఎంట్రీ ఇచ్చిన అమ్మ‌డు అటుపై `స‌రిపోదా శ‌నివారం` తో మ‌రో హిట్ ఖాతాలో వేసుకుంది. ఇటీవ‌ల రిలీజ్ అయిన `ఓజీ` లో భాగ‌మైంది. ఈ సినిమా విజ‌యంతోనూ ప్రియాంక పేరు వైర‌ల్ గా మారింది. అయితే టాలీవుడ్ లో అమ్మ‌డి కెరీర్ మాత్రం ఇంకా ఊపందుకోలేదు. కెరీర్ ప్రారంభ‌మై ఐదేళ్లు అవుతున్నా? వేగం పుంజుకోలేదు. అందం ..అభిన‌యం అన్ని ఉన్నా? అవ‌కాశాలు అందుకోవ‌డంలో వెనుక‌బడుతోంది. మ‌రి ఈ వెనుక బాటుకు కార‌ణం ఏంటి? అన్న‌ది స‌స్పెన్స్.




 


కెరీర్ ఇంకా స్లోగానే:

అమ్మ‌డు గ్లామ‌ర్ ఎలివేష‌న్ల‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌త ఇవ్వ‌దు. వీలైనంత వ‌ర‌కూ న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న పాత్ర‌ల‌వైపే అడుగులు వేస్తుంది. మ‌రి ఇలా ఇంకెంత కాలం నెట్టుకొస్తుందో చూడాలి. ప్ర‌స్తుతం త‌మిళ్ లో `కెవిన్` అనే ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమా మిన‌హా కొత్త ఛాన్సులేవి లేవు. అయితే తాజాగా ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ అప్ క‌మింగ్ ప్రాజెక్ట్లో ఛాన్స్ అందుకుంద‌నే ప్రచారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం రామ్ హీరోగా మ‌హేష్ ద‌ర్శ‌క‌త్వంలో `ఆంధ్రా కింగ్ తాలూకా` అనే చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. అన్ని ప‌నులు పూర్తి చేసుకుని న‌వంబ‌ర్ లో ఈ చిత్రం రిలీజ్ రానుంది.

ఎవ‌రికైనా స‌రైన రోల్:

అటుపై రామ్.. కిషోర్ గోపు అనే కొత్త కుర్రాడితో ఓ సినిమా చేయ‌నున్నాడు. ఇప్ప‌టికే స్టోరీ లాక్ అయింది. ప్ర‌స్తుతం గోపీ ఆ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉన్నాడు. ఇందులో హీరోయిన్ గా ప్రియాంక పేరు ప‌రిశీల‌న‌లో ఉంద‌ని స‌మాచారం. రామ్ ఇమేజ్ కు తగ్గ హీరోయిన్ల‌ను కొంత మందిని ప‌రిశీలించ‌గా అందులో ప్రియాంక కూడా ఉంద‌ని తెలిసింది. ఇది ల‌వ్ అండ్ యూత్ పుల్ ఎంట‌ర్ టైన‌ర్. సినిమాలో హీరోయిన్ పాత్ర‌కు ప్రాధాన్య‌త ఉందిట‌. హీరోకి ధీటుగా హీరోయిన్ పాత్ర ఉంటుందంటున్నారు. ఈనేప‌థ్యంలో రామ్ స‌ర‌స‌న ఏ నాయిక ఎంపికైనా మంచి పాత్ర ప‌డ్డ‌ట్లే.

నాని అందుకే రిపీట్ చేసాడు:

ప్రియాంక మోహ‌న్ మంచి పెర్పార్మ‌ర్ అని తొలి సినిమాతోనే నిరూపించింది. అటుపై శ‌ర్వానంద్ కు జోడీగా న టించిన `శ్రీకారం` లోనూ అల‌రించింది. అందులోనూ న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న పాత్ర‌లోనే క‌నిపించింది. త‌న‌లో ఆస్కిల్స్ చూసే నాని మ‌ళ్లీ `స‌రిపోదా శ‌నివారం`లో హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. మ‌రి ఈ బ్యూటీలో స్కిల్స్ ను రామ్ అండ్ కో ఎంత వ‌ర‌కూ వినియోగించుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News