• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బలగం హీరోకు అసలు పరీక్ష..

బలగం హీరోకు అసలు పరీక్ష..

| బలగం మూవీతో కమెడియన్ ప్రియదర్శి సోలో హీరోగా సక్సెస్ అందుకున్నాడు.

By - Tupaki Desk
Update: 2024-07-05 04:13 GMT

బలగం మూవీతో కమెడియన్ ప్రియదర్శి సోలో హీరోగా సక్సెస్ అందుకున్నాడు. ఇది వరకు మల్లేశం సినిమాలో ప్రియదర్శి లీడ్ రోల్ చేశారు. రియల్ లైఫ్ కథతో వచ్చిన ఆ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. తరువాత కొన్ని వెబ్ సిరీస్ లలో లీడ్ రోల్ చేశారు. అయితే బిగ్ స్క్రీన్ పరంగా చూసుకుంటే బలగం ప్రియదర్శికి హీరోగా వచ్చిన అతి పెద్ద హిట్ అని చెప్పాలి. ఈ మూవీ కంటెంట్ బలంగా ఉండటంతో ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యింది.

దీని తర్వాత ఎప్పటిలాగే కమెడియన్ క్యారెక్టర్స్ ప్రియదర్శి చేసుకుంటూ వస్తూనే హీరోగా మరో కొత్త ప్రాజెక్ట్ ని ఫినిష్ చేశాడు. హనుమాన్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి నిర్మాణంలో అశ్విన్ రామ్ దర్శకత్వంలో డార్లింగ్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కింది. ఇప్పటికే ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తమిళంలో రెండు సినిమాలు చేశాడు. అతని మూడో చిత్రంగా డార్లింగ్ జులై 19న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

నభా నటేష్ ఈ చిత్రంలో ప్రియదర్శికి జోడీగా నటించింది. ఇప్పటికే మూవీ నుంచి రెండు సాంగ్స్ ప్రేక్షకుల ముందుకొచ్చి ఆకట్టుకున్నాయి. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా డార్లింగ్ చిత్రాన్ని అశ్విన్ రామ్ తెరకెక్కించారు. ప్రియదర్శి ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ సినిమా కోసం ప్రియదర్శి రెమ్యునరేషన్ కూడా గట్టిగానే తీసుకున్నాడంట. నభా నటేష్ చాలా గ్యాప్ తర్వాత మరల ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

బలగం మూవీ కంటెంట్ ప్రేక్షకులకి కనెక్ట్ కావడంతో సక్సెస్ అందుకుంది. డార్లింగ్ మూవీతో మాత్రం ప్రియదర్శికి హీరోగా సక్సెస్ కొట్టాల్సిందే. అలా కొడితేనే కమర్షియల్ గా అతనికి మార్కెట్ పెరగడంతో పాటు హీరోగా అవకాశాలు వస్తాయి. హీరోగా తన రేంజ్ పెంచుకోవడానికి డార్లింగ్ రూపంలో ప్రియదర్శికి మంచి ఛాన్స్ అయితే దొరికింది. ఈ మధ్యకాలంలో రొమాంటిక్ లవ్ అండ్ కామెడీ కథలు అంతగా వర్క్ అవుట్ కావడం లేదు.

ఓటీటీ వరకు ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటున్న థియేటర్స్ లో ఆడియన్స్ కొత్తదనం, గ్రాండియర్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. కథలలో ఆ స్థాయి లేకపోతే చూడటానికి ఇష్టపడటం లేదు. అలాగే బలమైన కథ ఉన్న సినిమాలని కూడా ఆదరిస్తున్నారు. అయితే రెగ్యులర్ ఫార్మాట్ లో వచ్చే రొమాంటిక్ కామెడీ సినిమాలని ప్రేక్షకులు కనెక్ట్ కావడం లేదనేది గత కొంతకాలం నుంచి వస్తోన్న సినిమాలు చూసుకుంటే స్పష్టం అవుతోంది. మఈ మూవీతో ప్రియదర్శికి ఎలా అయితే సక్సెస్ కావాలో హీరోయిన్ నభా నటేష్ కూడా అలాగే సాలిడ్ హిట్ కావాలి. లేదంటే మళ్ళీ ఆమె కెరియర్ గాడితప్పే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Tags:    
  • Darling 
  • Tollywood 
  • Filmindustrry 
  • Nabhanatesh 
  • Niranjanreddy 
  • Balagam 
  • Ashwinram 

Similar News

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS