• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ పిల్లే పెళ్ళాం...

ఆ పిల్లే పెళ్ళాం అయితే.... డార్లింగ్ కష్టాలు!

| ఇప్పుడదే నిజమైంది. అదంతా ప్రమోషన్స్ కోసమే చేశారు ప్రియదర్శి, నభా నటేష్. వీరిద్దరూ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ డార్లింగ్.

By - Tupaki Desk
Update: 2024-04-20 08:34 GMT

సోషల్ మీడియాలో ఈమధ్య హాట్ టాపిక్ గా మారిన నటుడు ప్రియదర్శి, హీరోయిన్ నభా నటేష్ మాటల యుద్ధానికి ఎండ్ కార్డ్ పడింది! ప్రభాస్ డార్లింగ్ డైలాగులతో నభ చేసిన డబ్ స్మాష్ వీడియోకు ప్రియదర్శి రియాక్ట్ అవ్వడం, డార్లింగ్ అని పిలవడం, అందుకు నభ ఫుల్ ఫైర్ అవ్వడం.. ఇదంతా వైరల్ అవ్వగా.. చాలా మంది నిజం అనుకోగా.. ఇంకొందరు సినిమా కోసమే అని చెప్పారు.


ఇప్పుడదే నిజమైంది. అదంతా ప్రమోషన్స్ కోసమే చేశారు ప్రియదర్శి, నభా నటేష్. వీరిద్దరూ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ డార్లింగ్. హనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నిరంజన్ రెడ్డి.. ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కోలీవుడ్ దర్శకుడు అశ్విన్ రామ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఈ సినిమా గురించి వార్తలు రాగా.. తాజాగా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు మేకర్స్. రాఘవ్, ఆనంది ఫుల్ ఎంటర్టైన్మెంట్ తీసుకొస్తారని గ్లింప్స్ రిలీజ్ చేశారు.

డార్లింగ్ మూవీ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. సబ్ టైటిల్ లో క్రేజీగా వై దిస్ కొలవెరి అంటూ రాసుకొచ్చారు మేకర్స్. టైటిల్ ను అనౌన్స్ చేస్తూ ఫస్ట్ లుక్, ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. నభా నటేష్‌ కు ప్రియదర్శి పెళ్లి ప్రపోజల్‌ చేస్తున్నట్లు ఉన్న ఫస్ట్‌ లుక్ పోస్టర్ సూపర్ గా ఉంది. భార్యలతో ఇబ్బందులు పడే భర్తల కథే ఈ మూవీ స్టోరీగా ఉండనున్నట్లు ప్రోమో చూస్తుంటే అర్ధమవుతుంది.

సెలూన్‌ లో ప్రియదర్శి, బార్బర్ మధ్య ఫన్నీ సంభాషణతో ప్రోమో స్టార్ట్ అయ్యింది. అప్పుడు దర్శి చెప్పే డైలాగ్ కామెడీగా ఉంది. ఆడవాళ్ళు తల్లులుగా ఉన్నప్పుడు ప్రేమగా, ఆప్యాయంగా ఉంటారని.. సిస్టర్లుగా ఉన్నప్పుడు అండగా, రక్షణగా ఉంటారని చెప్పారు. అదే అమ్మాయి ప్రేమికురాలిగా ఉన్నప్పుడు, క్యూట్‌ గా బబ్లీగా ఉండి మనల్ని చాలా అర్థం చేసుకుంటుందని.. కానీ ఆ పిల్లే పెళ్ళాం అయితే.. జిందగీ అంతా తలకిందులు చేసి.. మొగుడు తాట తీసి తందూరి వండుకుని తింటారు అన్నా.. అంటూ ప్రియదర్శి నవ్వులు పూయించారు.

ప్రోమో సినిమాపై ఆసక్తి పెంచుతోంది. ప్రియదర్శి తన యాక్టింగ్ తో అదరగొట్టారు. నభ గ్లామరస్ గా కనిపించింది. ఈ సినిమాలో హీరోయిన్ అనన్య నాగళ్ల కీలకపాత్ర పోషిస్తోంది. ఆమెతోపాటు పలువురు ప్రముఖ యాక్టర్లు నటిస్తున్నారు. టాలెంటెడ్ టెక్నీషియన్స్ ను రంగంలోకి దించారు నిరంజన్ రెడ్డి. నరేష్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా.. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. హేమంత్ డైలాగ్స్ అందిస్తుండగా.. ప్రదీప్ రాఘవ్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.

Full View
Tags:    
  • Nabhanatesh 
  • Priyadarshi 
  • Niranjanreddy 
  • Darlingmovie 
  • Glimpsee 
  • Aswinram 
  • Tollywood 

Similar News

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

Copyright @2026

Powered by Blink CMS