ప్రియదర్శి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడా?
బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు హీరోగా సుజిత్ సర్కార్ ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు.;
ప్రియదర్శి నటుడిగా ఏస్థాయికి చేరాడు? అన్నది చెప్పాల్సిన పనిలేదు. ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఇండస్ట్రీలో ఎదిగాడు. 'పెళ్లి చూపులు' తో లైమ్ లైట్ లో కి వచ్చిన తొలి సినిమాతోనే మంచి కమెడి యన్ గా గుర్తింపు దక్కించుకున్నాడు. ఒక్క సక్సస్ అతడి జీవితాన్నే మార్చేసింది. నాటి నుంచి నేటి వరకూ ప్రియదర్శి ఖాళీగా ఉన్న రోజు లేదు. నటుడిగా అంత బిజీ అయ్యాడు. అతడు నటించిన సినిమాలు ఏడాదికి నాలుగైదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
కమెడియన్ గా ఓ స్థాయికి వెళ్లిపోవడంతో ప్రధాన పాత్రలకు ప్రమోట్ అయ్యాడు. స్టార్ హీరోలకు ప్రెండ్ క్యారెక్టర్లో చాలా సినిమాలు పోషించడాడు. 'మల్లేషం' తో హీరోగానూ టర్న్ అయ్యాడు. ఇటీవలే 'కోర్టు' తో మంచి బ్రేక్ అందుకున్నాడు. ఈ సినిమా భారీ లాభాలు తెచ్చి పెట్టింది. నటుడిగా మరో మెట్టు పైకి ఎక్కాడు. ఆ వెంటనే 'సారంగపాణి జాతకం' అంటూ మరో సినిమాతోనూ అలరించాడు. దీంతో ఇండస్ట్రీలో అల్లరి నరేష్ ప్లేస్ ను ప్రియదర్శి రీప్లేస్ చేస్తున్నాడా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలో ప్రియదర్శి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు హీరోగా సుజిత్ సర్కార్ ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో ఇద్దరు హీరో లు కాగా ఓ రోల్ కు రాజ్ కుమార్ రావ్ ని ఎంపిక చేయగా మరో పాత్రకు ప్రియదర్శితో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలాలి.
ప్రియదర్శ్ ఇంతవరకూ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఇది మంచి అవకాశమే. నటుడిగా అతడి ఇమేజ్ బాలీవుడ్ పాకుతుంది. హిందీ చిత్రమైనా ప్రియదర్శి ఉంటే తెలుగులోనూ మార్కెట్ చేయోచ్చు. డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తే ప్రియదర్శి ఇమేజ్ తో ఇక్కడా వర్కౌట్ అవుతుంది. ఆ ప్రణాళికలో భాగంగానే ప్రియదర్శిని బాలీవుడ్ మేకర్స్ తెరపైకి తెస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ 'వార్ 2'లో ఎన్టీఆర్ నటిం చడంతో? తెలుగులో పెద్ద ఎత్తున బిజినెస్ జరుగుతోన్న సంగతి తెలిసిందే.