వింక్ బ్యూటీ హిట్ వైబ్ క్యాచ్ చేస్తుందా..?

మలయాళ పరిశ్రమ నుంచి వచ్చే భామలకు మిగతా సౌత్ భాషల్లో మంచి డిమాండ్ ఉంటుంది.;

Update: 2025-05-25 23:30 GMT

మలయాళ పరిశ్రమ నుంచి వచ్చే భామలకు మిగతా సౌత్ భాషల్లో మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా అక్కడ భామలు అభినయానికి ప్రాధాన్యత ఇచ్చే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. అందుకే అక్కడ ఏదైనా హీరోయిన్ క్లిక్ అయితే చాలు వెంటనే తెలుగు, తమిళ భాషల్లో ఛాన్స్ లు ఇస్తుంటారు. అలా మలయాళం నుంచి వచ్చిన ఎంతోమంది హీరోయిన్స్ తెలుగు, తమిళ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్స్ గా రాణించారు. ఐతే అందరికీ అలాంటి బజ్ వస్తుందని చెప్పడం కష్టం. ముఖ్యంగా పాపులారిటీ వచ్చినా కథల ఎంపికల వల్ల ఆ క్రేజ్ తెచ్చుకోవడంలో వెనుకబడతారు.

అలాంటి వారిలో చెప్పుకుంటే ముందు వరుసలో ఉంటుంది వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. ఒరు ఆధార్ లవ్ సినిమా టీజర్ తో నేషన్ మొత్తాన్ని తన కన్నుగీటి మాయలో పడేసింది అమ్మడు. ఆ సినిమా రిలీజ్ టైం లో ప్రియా క్రేజ్ ఒక రేంజ్ లో ఉంది. ఐతే సినిమాలో ఆమె సైడ్ హీరోయిన్ అవ్వడం అంచనాలను అందుకునేలా సినిమా లేకపోవడం వల్ల నిరాశపరిచింది. ఐతే ఆ క్రేజ్ తో తెలుగు ఆఫర్లు వచ్చినా అమ్మడు అప్పుడు కాదనేసింది. స్టార్ ఛాన్స్ ల కోసం ఎదురుచూసి వచ్చిన ఒకటి అర అవకాశాలు కాదనుకుంది.

కట్ చేస్తే తెలుగు పరిశ్రమ అమ్మడికి లైట్ తీసుకుంది. ఆ తర్వాత మళ్లీ కొన్ని ఆఫర్లు రాగా వాటిని ఓకే చేసింది. నితిన్, తేజా సజ్జ లాంటి వారితో సినిమాలు చేసిన ప్రియా ప్రకాష్ ఆ సినిమాతో ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. ఫైనల్ గా తెలుగులో ఆశించిన బ్రేక్ రాబట్టలేదు సరికదా అసలు ఆమెను పట్టించుకోలేదు. ఐతే ఇదే క్రమంలో తమిళ్ లో ప్రయత్నాలు చేస్తుంది అమ్మడు.

రీసెంట్ గా అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో ఆమె స్పెషల్ క్యామియో ఆడియన్స్ ని అలరించింది. ఇక రీమిక్స్ సాంగ్ కి డ్యాన్స్ చేసి అలరించింది అమ్మడు. ఆ సినిమా కూడా అజిత్ ఫ్యాన్స్ ని అలరించింది. సో హిట్ వైబ్ ని క్యాచ్ చేస్తూ అమ్మడు మరికొన్ని అవకాశాలు అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. ప్రియా ప్రకాష్ వారియర్ సినిమా ఆఫర్లు ఎలా ఉన్నా అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ షోతో అదరగొట్టేస్తుంది. కెరీర్ లో ఒక మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న అమ్మడు ప్రయత్నాలు మాత్రం ఆపట్లేదు. మరి అమ్మడికి అలాంటి ఛాన్స్ ఎవరిస్తారన్నది చూడాలి.

Tags:    

Similar News