'ఇరుముడి' కావేరి తెలుగులో బిజీ అయ్యేనా?

కొత్త వారికి ఏ మాత్రం తగ్గదు అన్నట్లుగా ప్రియా భవానీ లుక్స్ తో ఆకట్టుకుంటుంది. అందుకే ఇరుముడి సినిమాలో డీ గ్లామర్‌గా కనిపించినప్పటికీ అందరి దృష్టిని ఆకర్షించింది.

Update: 2026-08-29 17:30 GMT

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం 'ఇరుముడి' ఫీవర్‌ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతకు ముందు వచ్చిన సినిమాలు, ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఏవీ కూడా ఇరుముడి సినిమాను ఆపలేక పోతున్నారు. రెండో వారంలో ఇరుముడి సినిమా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఈ మధ్య కాలంలో ఒక మీడియం రేంజ్‌ బడ్జెట్‌ మూవీ ఈ స్థాయి వసూళ్లు సాధించడం చాలా అరుదుగా మాత్రమే చూస్తూ ఉన్నాం. రవితేజ ఇన్నాళ్ల కెరీర్‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్ మూవీగా ఈ సినిమా నిలువబోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ప్రియా భవానీ శంకర్ గురించి ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. తెలుగులో ప్రియా భవానీకి ఇది మొదటి మూవీ ఏం కాదు, ఈమె ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అయింది. టాలీవుడ్‌లో సాలిడ్‌ హిట్‌ ఇరుముడి సినిమాతో దక్కించుకుంది.

ప్రియా భవానీ శంకర్‌ టాలీవుడ్‌ చిత్రాలు..

టాలీవుడ్‌లో ఇంతకు ముందు ప్రియా భవానీ కళ్యాణం కమనీయం, భీమా, జీబ్రా వంటి మీడియం రేంజ్ సినిమాల్లో నటించింది. ఆ సినిమాల్లో అభినయంతో పాటు అందం చూపించినా కూడా ప్రియా భవానీ పెద్దగా గుర్తింపు దక్కించుకోలేక పోయింది. ఆ సినిమాలు పెద్దగా ఆడక పోవడం వల్ల జనాలు ఈమెను గుర్తించలేదని చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన దాదాపు పదేళ్ల తర్వాత టాలీవుడ్‌ నుంచి ప్రియా భవానీకి సాలిడ్‌ సక్సెస్ దక్కించుకుంది. న్యూస్‌ రీడర్‌గా, యాంకర్‌గా, సీరియల్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ప్రియా భవానీ ఇప్పుడు హీరోయిన్‌గా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈమె భవిష్యత్తు ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇండస్ట్రీలో ఈమె ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయింది, మూడు పదుల వయసు దాటినా కూడా ఇంకా యంగ్‌ అండ్‌ గుడ్‌ లుకింగ్‌ అన్నట్లుగా ఈ అమ్మడు ఉంటుంది.

ఇరుముడి సినిమాలో రవితేజకు జోడీగా...

కొత్త వారికి ఏ మాత్రం తగ్గదు అన్నట్లుగా ప్రియా భవానీ లుక్స్ తో ఆకట్టుకుంటుంది. అందుకే ఇరుముడి సినిమాలో డీ గ్లామర్‌గా కనిపించినప్పటికీ అందరి దృష్టిని ఆకర్షించింది. నటన పరంగా ఇరుముడి సినిమాతో ప్రియా భవానీ నూటికి నూరు మార్కులు దక్కించుకుంది. టాలీవుడ్‌లో ఇంతకు ముందు చేసిన సినిమాలతో పోల్చితే ఇరుముడి సినిమా ఈమెకు స్టార్‌డంను తెచ్చి పెట్టింది. కనుక రాబోయే రోజుల్లో టాలీవుడ్‌లో ప్రియా భవానీ బిజీ అయ్యే అవకాశం ఉంది. మూడు పదుల వయసులో ఉంది కనుక యంగ్‌ హీరోలతో కాకున్నా కచ్చితంగా స్టార్‌ హీరోలతో ఈమెకు నటించే అవకాశం దక్కవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇరుముడి సినిమా తర్వాత కచ్చితంగా ప్రియా భవానీ శంకర్‌ టాలీవుడ్‌లో బిజీ కావడం మాత్రమే కాకుండా, పారితోషంక సైతం భారీగా పెంచే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ముందు ముందు మరిన్ని తెలుగు సినిమాలకు ఈమె సైన్‌ చేయడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

మొదటి సినిమాతోనే ఉత్తమ నటిగా..

ఒక తమిళ ఫ్యామిలీ లో జన్మించిన ప్రియా భవానీ చదువు పూర్తయిన వెంటనే తమిళ వార్త ఛానల్‌ పుతియ తలైమురై లో న్యూస్ రీడర్‌గా జాయిన్‌ అయింది. ఆ సమయంలోనే స్క్రీన్‌ పై ఆమెను చూసి చాలా మంది యాంకరింగ్‌ ట్రై చేయమన్నారు. యాంకర్‌గా, సీరియల్‌ ఆర్టిస్టుగా ప్రియా బిజీ అయింది. టీవీలో ఫేమస్ కావడంతో 2017లో తమిళ సినిమా ఆఫర్‌ ప్రియా భవానీని వెతుక్కుంటూ వచ్చింది. మొదటి సినిమాతోనే సైమా అవార్డ్స్‌లో ఉత్తమ నటి అవార్డ్‌ను సొంతం చేసుకుంది. అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవసరం, అవకాశం రాలేదు. దాదాపు పదేళ్లుగా బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలు చేస్తూ ఏడాదికి మూడు నాలుగు సినిమాలతో అలరిస్తూ వస్తుంది. ఇప్పటి వరకు తమిళ్‌, తెలుగు సినిమాల్లో నటించిన ఈమె ముందు ముందు ఇతర సౌత్‌ ఇండియన్‌ భాషల్లోనూ నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరుముడి హిట్‌ ఈమె కెరీర్‌ను ఎక్కడి వరకు తీసుకు వెళ్తుందా అనేది చూడాలి.

Tags:    

Similar News