• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహేష్ - రాజమౌళి.. ఆ...

మహేష్ - రాజమౌళి.. ఆ స్టార్ కూడా లిస్టులో ఉన్నాడా?

| ఇక ఇటీవల మాలీవుడ్ సినిమా వర్గాల్లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారని మరో టాక్ వైరల్ అయ్యింది.

By - Tupaki Desk
Update: 2024-05-18 07:52 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక దిగ్గజం రాజమౌళి కలయికలో రాబోతున్న బిగ్ ప్రాజెక్ట్ SSMB29 పై వస్తున్న వదంతులను నిర్మాతలు ఇటీవల ఖండించారు. ప్రముఖ క్యాస్టింగ్ డైరెక్టర్ విరెన్ స్వామిని నియమించినట్లు వచ్చిన వార్తలను వారు కొట్టిపారేశారు. రాజమౌళి, మహేష్ బాబు కలయికలో రాబోయే ఈ మొదటి సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన RRR తరువాత రాజమౌళి చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో విపరీతమైన హైప్ సొంతం చేసుకుంది.

దీంతో ఈ కాంబినేషన్ పై రోజుకో రూమర్ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఇండోనేషియా కు చెందిన మోడల్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిందని నాగార్జున స్పెషల్ రోల్ అంటూ రకరకాల గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. ఇక ఈ ప్రాజెక్టు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు పక్కా ప్రణాళికలతో వర్క్ షాప్ కూడా నిర్వహించనున్నారు.

 

ఇక ఇటీవల మాలీవుడ్ సినిమా వర్గాల్లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారని మరో టాక్ వైరల్ అయ్యింది. రాజమౌళి పృథ్వీరాజ్ తో చర్చలు జరుపుతున్నారని, ఈ కలయికపై అధికారిక ప్రకటన రావాల్సి ఉందని చెబుతున్నారు. ఇప్పటికే పృథ్వీరాజ్ సలార్ ద్వారా తెలుగు వారికి బాగా దగ్గరయ్యాడు.

ఇక మహేష్ సినిమాలో అతను నటిస్తున్నారు అంటే తప్పకుండా సినిమాపై మరిన్ని అంచనాలు పెరుగుతాయని చెప్పవచ్చు. మహేష్ బాబు ప్రస్తుతం కొన్ని వర్క్‌షాపుల్లో పాల్గొంటున్నారు. రాజమౌళి ఈ సూపర్ స్టార్ కోసం ఒక కొత్త లుక్ ని డిజైన్ చేస్తున్నారు. ఈ కొత్త లుక్ ను రహస్యంగా ఉంచేందుకు, మహేష్ బాబు తన పబ్లిక్ అపియరెన్సెస్ ను తగ్గించనున్నారని సమాచారం.

ఇక ఈ భారీ బడ్జెట్ సినిమా నిర్మాణం ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప్రారంభం కానుంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై KL నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై ప్రేక్షకులు, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు, రాజమౌళి కలయికలో వచ్చే ఈ సినిమా ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది.

ఇక సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కోసమే దాదాపు 6 నెలల సమయం తీసుకోబోతున్న జక్కన్న ఆ తర్వాత షూటింగ్ కోసం ఏడాది కంటే ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెండేళ్ల కంటే ఎక్కువ సమయం పట్టవచ్చని తెలుస్తోంది.

Tags:    
  • Ssmb29 
  • Ssrajamouli 
  • Maheshbabu 
  • Malayalamstar 
  • Prithvirajsukmaran 
  • Salaar 
  • Vijendraprasad 
  • Adventuredrama 
  • Malayalamstars 
  • Fahadfaisal 
  • Dulquersalman 
  • Shinetomchacko 

Similar News

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

Copyright @2026

Powered by Blink CMS