మొదట 60 షోల సినిమా.. ఇప్పుడు 1300 షోలు!
సెప్టెంబర్ 25న విడుదలైనప్పుడు ఈ సినిమాపై ఎలాంటి బజ్ లేదు. మొదటి రోజు వచ్చిన కలెక్షన్లు కూడా జస్ట్ 9 లక్షలు మాత్రమే. కానీ కంటెంట్ బాగుండటంతో థియేటర్లలో జనాలు పెరిగారు.
పెద్ద హీరోల సినిమాలకు మొదటి రోజే వేల థియేటర్లు, అడ్వాన్స్ బుకింగ్స్ మోత మోగిపోవడం ఇండస్ట్రీలో రెగ్యులర్ గా చూసేదే. కానీ కన్నడలో రీసెంట్ గా వచ్చిన 'ప్రేమద ఊరలి' అనే ఒక చిన్న మూవీ మాత్రం బాక్సాఫీస్ లెక్కలనే మార్చేసింది. రిలీజ్ రోజు కేవలం 60 షోలతో మొదలైన ఈ చిత్రం, మూడో వారానికి వచ్చేసరికి ఏకంగా 1300 షోల రేంజ్ కు దూసుకెళ్లింది. కేవలం మౌత్ టాక్ తోనే ఇంతటి సెన్సేషన్ క్రియేట్ చేయడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
సెప్టెంబర్ 25న విడుదలైనప్పుడు ఈ సినిమాపై ఎలాంటి బజ్ లేదు. మొదటి రోజు వచ్చిన కలెక్షన్లు కూడా జస్ట్ 9 లక్షలు మాత్రమే. కానీ కంటెంట్ బాగుండటంతో థియేటర్లలో జనాలు పెరిగారు. ఫస్ట్ వీక్ కంటే సెకండ్ వీక్ లో కలెక్షన్లు రెట్టింపు కావడం అసలైన ట్విస్ట్. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో తండ్రీకొడుకుల ఎమోషన్, కుటుంబ బంధాల చుట్టూ తిరిగే ఈ కథలో ఎలాంటి యాక్షన్ హంగులు లేవు. రంగాయణ రఘు, శ్రీరామ్ ల నేచురల్ పెర్ఫార్మెన్స్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది.
దాదాపు 2.5 కోట్ల బడ్జెట్ తో దర్శకుడు మనోజ్ కుమార్ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ డ్రామా ఇప్పటికే 50 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది. చిన్న బడ్జెట్ ప్రాజెక్టులకు ఇంతటి ప్రాఫిట్స్ రావడం ఈ రోజుల్లో మామూలు విషయం కాదు. రీసెంట్ గా టాలీవుడ్ లో రవితేజ 'ఇరుముడి' విషయంలోనూ ఇలాంటి ఫ్యామిలీ ఎమోషన్స్ వర్కౌట్ అయ్యాయి. కాకపోతే అక్కడ స్టార్ ఇమేజ్ ప్లస్ అయితే, ఇక్కడ ప్యూర్ కంటెంట్ మాత్రమే సినిమాను డ్రైవ్ చేసింది.
అయితే ఇదే సినిమాను తెలుగులో 'ప్రేమనే ఊరిలో' పేరుతో అక్టోబర్ 2న రిలీజ్ చేస్తే ఇక్కడ ఆశించిన రెస్పాన్స్ రాలేదు. కన్నడలో ఊపేసిన ఈ మ్యాజిక్ తెలుగు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా క్లిక్ కాలేదు. నేటివిటీ, రూటెడ్ ఎమోషన్స్ అనేవి సొంత గడ్డపై పేలినంత ఈజీగా ఇతర భాషల్లో వర్కౌట్ కాలేదు. ఆడియన్స్ పల్స్ ను బట్టి ఒకే కథ వేర్వేరు మార్కెట్లలో భిన్నమైన రిజల్ట్ ఇస్తుందని తేలిపోయింది.
సినిమాకు థియేటర్లలో విపరీతమైన డిమాండ్ ఉండటంతో అప్పుడే ఓటీటీ స్ట్రీమింగ్ అంటూ సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ మొదలయ్యాయి. అయితే మేకర్స్ వెంటనే స్పందించి వీటికి చెక్ పెట్టారు. ప్రస్తుతం థియేటర్లలో సాలిడ్ రన్ కొనసాగుతోందని, డిజిటల్ రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదని తేల్చేశారు. థియేట్రికల్ రన్ ను కాపాడుకోవడానికి మేకర్స్ తీసుకున్న ఈ డెసిషన్ బిజినెస్ పరంగా చాలా కరెక్ట్ స్టెప్.
మార్కెట్ లో ఎంత పెద్ద స్టార్ కాంబినేషన్లు ఉన్నా, సరైన ఎమోషన్ తో సినిమా తీస్తే ఆడియన్సే థియేటర్లను పెంచుతారని 'ప్రేమద ఊరలి' ప్రూవ్ చేసింది. పబ్లిసిటీ కోసం కోట్లు కుమ్మరించకుండా, కంటెంట్ ను నమ్ముకున్న మేకర్స్ కు ఈ సక్సెస్ ఒక పెద్ద బూస్ట్. కన్నడ ఇండస్ట్రీలో రీసెంట్ టైమ్స్ లో వచ్చిన బెస్ట్ బాక్సాఫీస్ సర్ ప్రైజెస్ లో ఇది టాప్ లో నిలవడం పక్కా.