నిశ్చితార్థం త‌ర్వాత విడిపోయి మ‌ళ్లీ క‌లిసిపోయిన ప్రేమ‌ జంట‌!

భారతీయ యువ క్రికెటర్‌గా సంచలన ఇన్నింగ్స్‌లతో కెరీర్ ప్రారంభించిన పృథ్వీ షా తన అద్భుతమైన బ్యాటింగ్ శైలితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

Update: 2026-10-13 03:35 GMT

కొన్నిసార్లు ప్రేమకు రెండో అవకాశం ఇవ్వాల్సిందేనంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వార్త‌ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ప్రఖ్యాత టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా- ఆకృతి అగర్వాల్ తమ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు గతంలో వార్తలు వచ్చినా.. తాజాగా ఈ జంట తమ ప్రేమకు మరో అవకాశం ఇస్తూ మళ్లీ ఒక్కటయ్యారు. ఆకృతి అగర్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వేదికగా `ఎ పర్సనల్ క్లారిఫికేషన్` పేరుతో ఈ విషయాన్ని అధికారికంగా షేర్ చేయ‌డంతో ఈ వ్యవహారం మరోసారి వైరల్ అయింది.

తమ బంధం గురించి సరిగ్గా అవగాహన లేని కొందరి వ్యక్తుల మాటల వల్ల తాను తప్పుదారి పట్టానని.. సరైన మాట‌లు లేకుండానే తొందరపడి నిశ్చితార్థాన్ని రద్దు చేసుకునే నిర్ణయం తీసుకున్నానని ఆకృతి తన నోట్‌లో పేర్కొన్నారు. ఆ నిర్ణయం వల్ల ఇద్దరికీ కలిగిన బాధకు తాను పూర్తి బాధ్యత వహిస్తానని స్పష్టం చేశారు. విడిపోయిన తర్వాత తాము ఇద్దరం కూర్చుని విడివిడిగా మాట్లాడుకుని.. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే మళ్లీ కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇకపై తమ భవిష్యత్తును బ‌య‌టి శక్తులు కాకుండా పరస్పర అవగాహన, నమ్మకం, ప్రేమ నడిపిస్తాయని... ఈ కొత్త ఆరంభాన్ని అందరూ గౌరవించాలని ఆమె కోరారు.

ఈ పరిణామంపై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఈ కంబ్యాక్ నిర్ణ‌యంపై ఆశ్చర్యం వ్యక్తం చేయగా.. మరికొందరు సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై ఇంతలా ఫోకస్ చేయడం ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా విడిపోయిన ఈ జంట మళ్లీ కలిసిపోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

భారతీయ యువ క్రికెటర్‌గా సంచలన ఇన్నింగ్స్‌లతో కెరీర్ ప్రారంభించిన పృథ్వీ షా తన అద్భుతమైన బ్యాటింగ్ శైలితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అండర్-19 ప్రపంచకప్ విజేతగా భారత్‌కు నాయకత్వం వహించిన ఆయన టెస్ట్ అరంగేట్రంలోనే సెంచరీ బాది సంచలనం సృష్టించారు. దేశీయ క్రికెట్‌లో .. ఐపీఎల్‌లో ప‌లు ఫ్రాంచైజీల తరఫున ఆడుతూ తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. అయితే ఇటీవల కాలంలో ఫామ్ కోల్పోవడం....ఫిట్‌నెస్ సమస్యలు.. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలతో పృథ్వీ షా తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు.

ఇక పృథ్వీ షా ఫియాన్సీ ఆకృతి అగర్వాల్ విషయానికి వస్తే.. ఆమె సోషల్ మీడియాలో ..గ్లామర్ రంగంలో మంచి ఫాలోయింగ్ ఉన్న ప్రముఖ వ్యక్తి. ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ రంగాలకు సంబంధించిన కంటెంట్‌తో పాటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. మోడలింగ్ - క్రియేటివ్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండే ఆకృతి ప్రముఖులతో ఉండే పరిచయాలు.. సోషల్ మీడియా యాక్టివిటీ ద్వారా నిత్యం ట్రెండింగ్‌లో ఉంటారు.

Tags:    

Similar News