తెలుగు ఇండస్ట్రీ లో ఈ జనరేషన్ 'టార్చ్ బేరర్లు వీళ్లే?
తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతుంది. సినిమాలను తీయడం ఒక ఆర్ట్. అనుకున్నది అనుకున్నట్టుగా విజువలైజ్ చేసి విజయం సాధించిన దర్శకుడికి దక్కే గౌరవం ప్రత్యేకమైనది.
తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతుంది. సినిమాలను తీయడం ఒక ఆర్ట్. అనుకున్నది అనుకున్నట్టుగా విజువలైజ్ చేసి విజయం సాధించిన దర్శకుడికి దక్కే గౌరవం ప్రత్యేకమైనది. ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడిని అనుకరిస్తూ కొంతమంది డైరెక్టర్స్ అదే బాటలో నడుస్తుంటారు. ఒక రంగంలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ, ఫ్రెష్ థాట్ ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళని 'టార్చ్ బేరర్' అంటారు...'అరవింద సమేత' మూవీలో చెప్పినట్టుగా ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి బతుకు తాలుకు ఆలోచనలు మారుతుంటాయి. అలాగే సినిమా ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాలకు ఒకసారి సినిమాలు తీసే దర్శకుల ఆలోచన శైలి మారుతుంది. అలాగే సినిమాలు చూసే ప్రేక్షకుడి దృష్టి మారుతుంది. డిఫరెంట్ సబ్జెక్టులతో వచ్చే మూవీస్ ని ప్రేక్షకులు ఆదరిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ జనరేషన్ లో తెలుగు సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లే దర్శకులలో ముగ్గురుని 'టార్చ్ బేరర్లు' గా చెప్పుకోవచ్చు వాళ్ళెవరంటే.
రాజమౌళి
వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ ఎమోషనల్ సన్నివేశాలను ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా తెరక్కించడం లో రాజమౌళి సిద్ధహస్తుడు. విఎఫ్ఎక్స్ కి ప్రాధాన్యమున్న సినిమాలను తీయడం మనవల్ల కాదని భ్రమ పడిన వాళ్లందరికీ షాకిస్తూ హాలీవుడ్ ఇండస్ట్రీని మెప్పించేలా సినిమాలను తీసి సక్సెస్ లను సాధించాడు. సినిమా సినిమాకు తన పరిధిని విస్తరించుకుంటూ ప్రస్తుతం పాన్ వరల్డ్ స్థాయికి చేరుకున్నాడు. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని పక్క ఇండస్ట్రీ వాళ్లే పట్టించుకునే వారు కాదు. అలాంటిది ఇప్పుడు ప్రపంచ స్థాయి దర్శకులు సైతం మన గురించి మాట్లాడుకుంటున్నారు అంటే అది రాజమౌళి వల్లే సాధ్యమైంది...
సుకుమార్
మూస ధోరణిలో వెళ్తున్న సినిమాలకు స్వస్తి చెప్పి డిఫరెంట్ కథలను ట్రై చేసి, ప్రేక్షకుడి దృష్టి మార్చేసిన దర్శకుడు సుకుమార్...ఆడియన్స్ అభిరుచి కి అనుగుణంగా సినిమాలను చేస్తూ, కథల విషయంలో చాలా కేర్ తీసుకొని, స్క్రీన్ ప్లే ని అత్యుత్తమంగా ప్రజెంట్ చేశాడు. సుకుమార్ చేసిన ప్రయోగాలు కొన్ని విఫలమై ఉండొచ్చు. కానీ సినిమాను మాత్రం కొత్తగా ప్రజెంట్ చేయడంలో ఆయన ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు...
సందీప్ రెడ్డి వంగ
'అర్జున్ రెడ్డి' సినిమాతో ప్రేక్షకుడి ఆలోచన ధోరణిని మార్చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా... బోల్డ్ కంటెంట్ తో సినిమాని చేసి నెక్స్ట్ లెవెల్ సక్సెస్ ను సాధించవచ్చని ప్రూవ్ చేశాడు... సినిమా మ్యూజిక్, నేపథ్య సంగీతం, సౌండ్ ఎఫెక్ట్స్ ను కొత్తగా ప్రజెంట్ చేసిన దర్శకుడు సందీప్... అర్జున్ రెడ్డి, అనిమల్ రెండు సినిమాలతో ప్రేక్షకుల దృష్టి కోణాన్ని మార్చేశాడు. హీరో అంటే రాముడు మంచి బాలుడు గా ఉండాలని అలా ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మే వాళ్ల నమ్మకాన్ని పటాపంచలు చేశాడు. హీరో అంటే సాధారణ మనిషి మాత్రమే. ఆయనలో పాజిటివ్ లతో పాటు నెగెటివిటీస్ కూడా ఉంటాయని చూపించాడు. అందుకే సందీప్ సైతం టార్చ్ బేరర్ గా నిలిచాడు...
ఈ ముగ్గురు దర్శకులు హిట్ సినిమాలను ఇస్తూనే తర్వాతి తరంలో వచ్చే మేకర్స్ కి ధైర్యాన్ని ఇచ్చారు. అందుకే వీళ్లు నిజమైన 'టార్చ్ బేరర్లు' అయ్యారు...