#గుస‌గుస‌.. యంగ్ బ్యూటీకి పాన్ ఇండియా జాక్ పాట్!

సంద‌ట్లో స‌డేమియా అంటే ఇదేనేమో! నాలుగేళ్ల క్రితం క‌న్న‌డ సినీప‌రిశ్ర‌మ నుంచి అద్భుత‌మైన జాన‌ప‌ద క‌థ‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా వ‌చ్చింది.

Update: 2026-10-13 03:32 GMT

సంద‌ట్లో స‌డేమియా అంటే ఇదేనేమో! నాలుగేళ్ల క్రితం క‌న్న‌డ సినీప‌రిశ్ర‌మ నుంచి అద్భుత‌మైన జాన‌ప‌ద క‌థ‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా వ‌చ్చింది. ఆ త‌ర్వాత 2025లో వ‌చ్చిన ప్రీక్వెల్ కూడా బంప‌ర్ హిట్టు కొట్టి ఆ హీరో, నిర్మాణ సంస్థ‌ల‌కు గొప్ప ఆదాయం, అంత‌కుమించిన పేరును కూడా తెచ్చిపెట్టింది. కేజీఎఫ్ త‌ర్వాత అదే స్థాయిలో వ‌రుస పెట్టి పాన్ ఇండియా విజ‌యాలు ద‌క్క‌డంతో క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌లో కొత్త జోష్ కూడా వ‌చ్చింది. ఆ త‌ర్వాత చాలా మంది వ‌రుస‌గా పాన్ ఇండియా సినిమాలు ట్రై చేస్తూనే ఉన్నారు.

ఇదిలా ఉంటే పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ సంగ‌తి ఎలా ఉన్నా.. ఆ ఫ్రాంఛైజీలో న‌టించిన హీరోకి, నిర్మాణ సంస్థ‌కు మ‌ధ్య వివాదాలు స‌ద్ధుమ‌ణ‌గ‌లేద‌న్న చ‌ర్చ వేడెక్కించేస్తోంది. బాలీవుడ్ లో క‌ర‌ణ్ జోహార్- కార్తీక్ ఆర్య‌న్ ఇష్యూలా ఈ ఇష్యూ కూడా ఏదో ఒక రోజు సెటిల‌య్యేదే. కానీ ఇప్ప‌టికీ ఇంకా వారి మ‌ధ్య పొర‌పొచ్చాలు త‌గ్గ‌లేద‌ని గుస‌గుస వినిపిస్తోంది. బ్లాక్ బ‌స్ట‌ర్ ప్రీక్వెల్ చాప్ట‌ర్ 1 విడుద‌లై ఇప్ప‌టికి ఏడాది పూర్తి కాగా.. నిర్మాణ సంస్థ పేరును మెన్ష‌న్ చేయ‌కుండా హీరో, అలాగే హీరో పేరును ప్ర‌స్థావించ‌కుండా నిర్మాణ సంస్థ సోష‌ల్ మీడియాల్లో వార్షికోత్స‌వ‌ పోస్టును షేర్ చేయ‌డంతో వారి మ‌ధ్య ఇంకా ఏదీ సెట్ రైట్ కాలేద‌ని అర్థ‌మైంది.

అలాగే అదే చిత్రంలో న‌టించిన హీరోయిన్ కి, హీరోకి మ‌ధ్య కూడా కొన్ని విభేధాలొచ్చాయ‌ని.. వారి మ‌ధ్య కూడా మాట‌ల్లేవ‌నే ప్ర‌చారం అప్ప‌ట్లో సాగింది. స‌రిగ్గా ఇదే కార‌ణంతో తెలుగులో బ్లాక్ బ‌స్ట‌ర్ ఫ్రాంఛైజీలో త‌న స‌ర‌స‌న ఆ హీరోయిన్ న‌టించాల్సి ఉన్నా ఆ హీరో అవ‌కాశం క‌ల్పించ‌లేద‌ని గుసగుస వినిపిస్తోంది. ఇలాంటి స‌మ‌యంలోనే వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్న మ‌మిత భైజుతో రీప్లేస్ చేసార‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్, బెత్ల‌హాం కుటుంబం చిత్రాల‌తో బంప‌ర్ హిట్లు అందుకున్న ఈ యువ‌న‌టి జాక్ పాట్ కొట్టిన‌ట్టేన‌న్న చ‌ర్చ సాగుతోంది.

హీరోల‌తో స‌త్సంబంధాలు లేక‌పోతే అరుదైన అవ‌కాశాలు ఛేజారుతాయ‌న‌డానికి ఇది ఒక ఉదాహ‌ర‌ణ‌. అయితే అదే స‌మ‌యంలో మ‌రో ప్ర‌తిభావ‌నికి ఆ అవ‌కాశం ద‌క్కింది. అయితే దీనిపై ఇంకా అధికారికంగా చిత్ర‌బృందం ధృవీక‌రించాల్సి ఉంది. పాన్ ఇండియాలో బిగ్ ప్లానింగ్ తో తెర‌కెక్కుతున్న ఈ సీక్వెల్/ ప్రీక్వెల్ సినిమాకి సంబంధించిన అధికారిక అప్ డేట్స్ ఇక‌పై విడుద‌ల కానున్నాయ‌ని స‌మాచారం.

Tags:    

Similar News